ప్రధాన మంత్రి కార్యాలయం

జాతీయ చేనేత దినోత్సవం నేపథ్యంలో ఘనమైన భారత సాంస్కృతిక వైవిధ్యానికి ప్రధానమంత్రి అభివందనం


‘హ్యాండ్‌లూమ్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్’లో పాల్గొనాలని
అంకుర సంస్థలతో ముడిపడిన యువతకు సూచన

Posted On: 07 AUG 2022 2:18PM by PIB Hyderabad

   జాతీయ చేనేత దినోత్సవం నేపథ్యంలో ఘనమైన భారతదేశ సాంస్కృతిక వైవిధ్యానికి, కళాత్మక సంప్రదాయాల కొనసాగింపునకు కృషి చేస్తున్న వారందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివందనం చేశారు. అంకుర సంస్థల పర్యావరణంతో ముడిపడిన యువతరం ‘హ్యాండ్లూమ్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్‌’లో పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా పంపిన సందేశంలో;

   “జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఘనమైన భారతదేశ సాంస్కృతిక వైవిధ్యానికి, మన కళాత్మక సంప్రదాయాల కొనసాగింపునకు సదా కృషిచేస్తున్న వారందరికీ నా అభివందనాలు. #MyHandloomMyPride”…

  “నేత కార్మికుల కోసం ఆలోచన-ఆవిష్కరణలకు ఇప్పుడో అద్భుతమైన అవకాశం వచ్చింది. అంకుర సంస్థల పర్యావరణంతో ముడిపడిన యువతరమంతా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను… #MyHandloomMyPride” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1849557) Visitor Counter : 268