ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు హర్ జిందర్ కౌర్ కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 02 AUG 2022 10:54AM by PIB Hyderabad

హర్ జిందర్ కౌర్ గారు మహిళ ల 71 కిలోగ్రాము వెయిట్ లిఫ్టింగ్ కేటగిరి లో కాంస్య పతకాన్ని గెలుచుకొన్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె ను అభినందించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మన వెయిట్ లిఫ్టింగ్ దళం బర్మింగ్ హమ్ కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) లో అసాధారణమైన ప్రదర్శన ను ఇచ్చింది. ఈ ప్రదర్శన ను కొనసాగిస్తూ, హర్ జీందర్ కౌర్ గారు కాంస్య పతకాన్ని గెల్చుకొన్నారు. ఈ విశిష్టమైన కార్యసిద్ధి కి గాను ఆమె కు ఇవే అభినందన లు. ఆమె భావి ప్రయత్నాల కు గాను ఇవే శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS

 

 


(Release ID: 1847332) Visitor Counter : 172