ప్రధాన మంత్రి కార్యాలయం

జులై లో 6 బిలియన్ యుపిఐ లావాదేవీ లు జరగడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి 

Posted On: 02 AUG 2022 10:44AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జులై నెల లో, 2016వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చూస్తే అత్యంత అధికం గా, 6 బిలియన్ యుపిఐ లావాదేవీ లు చోటు చేసుకొన్నటువంటి శ్రేష్ఠమైన సిద్ధి పట్ల తన ప్రశంస ను వ్యక్తం చేశారు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతా రమణ్ గారు చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానం గా -

‘‘ఇది ఒక శ్రేష్ఠమైనటువంటి కార్యసిద్ధి. ఇది కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం తో పాటు గా ఆర్థిక వ్యవస్థ ను స్వచ్ఛ తరమైంది గా తీర్చిదిద్దే దిశ లో భారతదేశం ప్రజలు చెప్పుకొన్న సామూహిక సంకల్పాన్ని సూచిస్తోంది. మరీ ముఖ్యం గా, కోవిడ్-19 మహమ్మారి తలెత్తిన కాలం లో డిజిటల్ చెల్లింపు లు ఎంతో సహాయకారి గా రుజువయ్యాయి.’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS

 

 



(Release ID: 1847314) Visitor Counter : 199