ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పౌరులు వారి సోశల్ మీడియా డిపి ని త్రివర్ణం తో మార్పు చేసుకోవలసింది గావిజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి

Posted On: 02 AUG 2022 10:19AM by PIB Hyderabad

పౌరులంతా ‘హర్ ఘర్ తిరంగా’ (‘ఇంటింటా త్రివర్ణం’) ను సామూహిక ఉద్యమం రూపం లో జరుపుకొనే క్రమం లో భాగం గా వారి వారి సోశల్ మీడియా డిపి (డిస్ ప్లే పిక్చర్ ) స్ ను మువ్వన్నెల తో మార్పు చేసుకోవలసింది అంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి ని చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఈ రోజు న ఆగస్టు 2వ తేదీ కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ కాలం లో- ఎప్పుడైతే మనం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ను పాటించుకొంటున్నామో- ఇది మన దేశం #HarGharTiranga (‘ఇంటింటా త్రివర్ణం’) కై సిద్ధమైన కాలంగాను, మన మువ్వన్నెల జెండా యొక్క ఉత్సవాన్ని జరుపుకొనేటటువంటి ఒక సామూహిక ఉద్యమం గాను ఉంది. నేను నా యొక్క సోశల్ మీడియా పేజీల లో డిపి ని మార్చుకొన్నాను; మరి మీరు అందరు కూడా ఇదే పని ని చేయండి అంటూ కోరుతున్నాను.’’ అని పేర్కొన్నారు.


*****

 

DS/TS

 

 


(Release ID: 1847313) Visitor Counter : 172