ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బర్మింగ్ హమ్ లో కామన్ వెల్థ్గేమ్స్ 2022 లో బంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకు వెయిట్ లిఫ్టర్ శ్రీ జెరెమీ లాల్రినుంగా కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 31 JUL 2022 5:42PM by PIB Hyderabad

బర్మింగ్ హమ్ లో జరుగుతున్నటువంటి కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో స్వర్ణ పతకాన్ని గెలుచుకొన్నందుకు వెయిట్ లిఫ్టర్ శ్రీ జెరెమీ లాల్ రినుంగా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మన యువ శక్తి చరిత్ర ను సృష్టిస్తున్నది. సిడబ్ల్యుజి లో తొలి సారి గా పాల్గొంటూ పసిడి ని గెలుచుకోవడం తో పాటుగా ఒక బ్రహ్మాండమైనటువంటి సిడబ్ల్యుజి రెకార్డు ను కూడాను నెలకొల్పిన @raltejeremy కి అభినందన లు. చిన్న వయస్సు లోనే ఆయన గొప్ప గౌరవాన్ని మరియు కీర్తి ని సంపాదించి పెట్టారు. ఆయన భావి ప్రయాసల లో రాణించాలి అని కోరుకొంటూ ఇవే శుభాకాంక్షల ను తెలియజేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.


***
DS/SH

 


(रिलीज़ आईडी: 1846796) आगंतुक पटल : 199
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam