ప్రధాన మంత్రి కార్యాలయం
ఐక్యరాజ్య సమితి సెక్రట్రి జనరల్ శ్రీ ఎంటోనియో గుటెరెస్ కు మరియు ప్రధాన మంత్రి శ్రీనరేంద్ర మోదీ కి మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ
प्रविष्टि तिथि:
29 JUL 2022 10:26PM by PIB Hyderabad
ఐక్య రాజ్య సమితి సెక్రట్రి జనరల్ (యుఎన్ ఎస్ జి) శ్రీ ఎంటోనియో గుటెరెస్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.
కాంగో ప్రజాస్వామిక గణతంత్రం లో యుఎన్ ఆర్గనైజేశన్ స్టెబిలైజేశన్ మిశన్ (ఎమ్ఒఎన్ యుఎస్ సిఒ) పై ఇటీవల జరిగిన దాడి ని గురించి నేత లు ఇరువురు చర్చించారు. భారతీయ శాంతి సైనికులు ఇద్దరు ఆ దాడి లో అమరులు అయ్యారు.
దాడి కి తెగబడిన వారి పై చట్టం ప్రకారం చర్య లు తీసుకోవడం కోసం దర్యాప్తు వేగం గా జరిగేటట్టు చూడాలంటూ ఐరాస సెక్రట్రి జనరల్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోరారు. ఇంత వరకు ఐరాస శాంతి స్థాపన కార్యాల లో 2,50,000 మంది కి పైగా భారతదేశ శాంతి సైనికులు సేవల ను అందించారని ఆయన ప్రస్తావిస్తూ ఐరాస శాంతి స్థాపన కోసం భారతదేశం తన స్థిరమైన వచనబద్ధత ను కొనసాగిస్తుంది అని స్పష్టం చేశారు. 177 మంది భారతదేశ శాంతి సైనికులు ఐరాస శాంతి స్థాపన కార్యాల లో నిమగ్నమై సర్వోచ్చ బలిదానాన్ని ఇచ్చారు; ఇది సైనికదళాల ను సమకూర్చిన ఏ దేశం ద్వారా అయినా ఒనగూరినటువంటి అతి పెద్ద తోడ్పాటు అని చెప్పాలి.
భారతదేశ సరిహద్దు భద్రత దళం సిబ్బంది కి చెందిన అమరులైన ఇద్దరు సైనికుల యొక్క కుటుంబాల కు, భారతదేశ ప్రజల కు మరియు భారతదేశం యొక్క ప్రభుత్వానికి యుఎన్ఎస్ జి తన సంతాపాన్ని తెలియజేశారు. మోనుస్కో కు వ్యతిరేకం గా జరిగిన దాడి ని నిర్ద్వంద్వం గా ఖండిస్తున్నట్లు ఆయన పునరుద్ఘాటిస్తూ, శీఘ్ర దర్యాప్తు కై చేతనైన కార్యాచరణ ను చేపట్టడం జరుగుతుందని బరోసా ను ఇచ్చారు.
కాంగో ప్రజాస్వామిక గణతంత్రం లో నివసిస్తున్న ప్రజల లో శాంతి ని మరియు స్థిరత్వాన్ని పరిరక్షించడం కోసం భారతదేశం తన అచంచల సమర్థన ను అందిస్తూ ఉంటుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు. అక్కడ ప్రస్తుతం సుమారు 2040 మంది భారతదేశ సైనికులు విధినిర్వహణ లో ఉన్నారు.
***
(रिलीज़ आईडी: 1846795)
आगंतुक पटल : 554
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
हिन्दी
,
English
,
Urdu
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam