ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కామన్వెల్త్ గేమ్స్-2022లో రజత పతకం సాధించిన వెయిట్‌లిఫ్టర్ వింధ్యారాణి దేవిని అభినందించిన ప్రధానమంత్రి

Posted On: 31 JUL 2022 8:11AM by PIB Hyderabad

   బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌-2022 మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన వింధ్యారాణి దేవిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో;

   “బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌-2022లో రజత పతకం కైవసం చేసుకున్న వింధ్యారాణి దేవికి అభినందనలు! ఆమె పట్టుదల, దీక్షకు ఈ విజయం ఒక నిదర్శనం. దీనిపై భారతీయులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులోనూ ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ నా శుభాశీస్సులు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/ST

 


(Release ID: 1846741) Visitor Counter : 155