మంత్రిమండలి
బిఎస్ఎన్ ఎల్ పునరుద్ధరణ కు 1.64 లక్షల కోట్ల రూపాయల పాకేజిని ఆమోదించిన కేంద్ర కేబినెట్
Posted On:
27 JUL 2022 5:16PM by PIB Hyderabad
టెలికం రంగం వ్యూహాత్మక రంగం. టెలికం రంగ మార్కెట్ ను సమతూకంలో ఉంచడానికి బిఎస్ఎన్ ఎల్ ఉపకరిస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో టెలికం సేవలను విస్తరింపచేయడంలో . విపత్తు సహాయంలో, దేశీయ సాంకేతిక పరిజ్ఞన అభివృద్ధిలో బిఎస్ ఎన్ ఎల్ కీలకపాత్ర పోషిస్తుంది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన పునరుద్ధరణ చర్యలు బిఎస్ ఎన్ ఎల్ సేవల స్థాయిపెంపునకు తాజాగా పెట్టుబడిని సమకూర్చడంపైన, స్పెక్ట్రం కేటాయింపు, లాభనష్టాల ఖాతాపై ఒత్తిడి తగ్గించడం, భారత్ బ్రాడ్ బాండ్ నిగమ్ లిమిటెడ్ (బిబిఎన్ ఎల్‌క్ష)ను బిఎస్ ఎన్ ఎల్‌లో విలీనం చేయడం ద్వారా ఫైబర్‌నెట్‌వర్క్‌ను పెంచడం వంటివి ఉన్నాయి.
బిఎస్ఎన్ ఎల్ సేవల స్థాయి పెంపుః
పాలనాపరంగా స్పెక్ట్రమ్ కేటాయింపుః ప్రస్తుత సేవలను మెరుగుపరచడానికి, 4 జి సేవలు అందించడానికి, బిఎస్ఎన్ఎల్‌కు 900 -1800 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌ను పాలనాపరంగా రూ 44,993 కోట్ల రూపాయలతో కేటాయించనున్నారు. ఈక్విటీ సమకూర్చడం ద్వారా దీనిని కేటాయిస్తారు. ఈ స్పెక్ట్రమ్ తో బిఎస్ఎన్ ఎల్ మార్కెట్ లో పోటీ పడగలుగుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతాలలో గల విస్తృతనెట్ వర్క్‌ను ఉపయోగించుకుని హై స్పీడ్ డాటాను అందించగలుగుతుంది.
కాపెక్స్ కు ఆర్థికంగ మద్దతు : దేశీయంగా సాంకేతికత అభివృద్ధిని ప్రోత్సహించేందుకు, బిఎస్ ఎన్ ఎల్ ఆత్మనిర్భర్ 4జి టెక్నాలజీ స్టాక్ ను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది. రాగల 4 సంవత్సరాలకు అవసరమయ్యే పెట్టుబడి వ్యయం అవసరాలకు ప్రభుత్వం 22,471 కోట్ల రూపాయల కాపెక్స్‌ను సమకూరుస్తుంది. ఇది ఆత్మనిర్భర్ 4జి స్టాక్ అభివృద్ధి, నిర్వహణకు ఎంతగానో ఉపకరిస్తుంది.
గ్రామీణ ప్రాంత వైర్ లైన్ కార్యకలాపాలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ : వాణిజ్యపరంగా సాధ్యం కానప్పటికీ బిఎస్ ఎన్ ఎల్ గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో వైర్ లైన్ సర్వీసులను సమకూరుస్తూ వస్తున్నది. ఇది ప్రభుత్వ సామాజిక లక్ష్యాలను చేరుకోవడానికి ఉపకరిస్తుంది. ప్రభుత్వం బిఎస్ ఎన్ ఎల్‌కు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద వాణిజ్యపరంగా గిట్టుబాటు కాని గ్రామీణ వైర్ లైన్ కార్యకలాపాలకు 2014-15 నుంచి 2019-20 కాలానికి ప్రభుత్వం 13,789 కోట్ల రూపాయలను సమకూరుస్తుంది.,
అధీకృత పెట్టుబడి పెంపు : బిఎస్ ఎన్ ఎల్ అధీకృత పెట్టుబడి ని ఎజిఆర్ బకాయిలు, కాపెక్స్ , స్పెక్ట్రమ్ కేటాయింపునకు బదులుగా 40,000 కోట్ల రూపాయల నుంచి 1, 50,000 కోట్లరూపాయలకు పెంచుతారు.
బిఎస్ ఎన్ ఎల్ లాభనష్టాల ఖాతాపై ఒత్తిడి తగ్గింపు :
రుణ వ్యవస్థీకరణ : దీర్ఘకాలిక రుణాన్ని సమకూర్చుకునేందుకు ఈ పిఎస్ యు లకు ప్రభుత్వం సావరిన్ గ్యారంటీలను సమకూరుస్తుంది. దీనితో ఇవి 40,399 కోట్ల రూపాయల ను దీర్ఘకాలిక బాండ్ల ద్వారా సమకూర్చుకోనున్నాయి. ఇది ప్రస్తుత రుణ పునర్నిర్మాణానికి , లాభనష్టాల ఖాతాపై ఒత్తిడి తగ్గించడానికి ఉపకరిస్తుంది.
ఎజిఆర్ బకాయిలకు ఆర్థిక మద్దతు : లాభనష్టాల ఖాతా ను మరింత మెరుగుపరచడానికి , బిఎస్ ఎన్ ఎల్‌కు సంబంధించి సుమారు 33,404 కోట్ల రూపాయల విలువగల ఎజిఆర్ బకాయిలను ఈక్విటీకిందికి మార్చడం ద్వారా సెటిల్‌చేస్తారు. ప్రభుత్వం ఎజిఆర్, జిఎస్టి బకాయిల ను పరిష్కరించేందుకు నిధులు సమకూరుస్తుంది.
ప్రిఫరెన్స్ షేర్ల తిరిగి విడుదల : బిఎస్ ఎన్ ఎల్ రూ 7,500 కోట్ల రూపాయల మేర ప్రిఫరెన్స్ షేర్లను ప్రభుత్వానికి తిరిగి జారీచేస్తుంది.
బిఎస్ ఎన్ ఎల్ ఫైబర్‌నెట్ వర్క్ పెంపు:
బిబిఎన్ ఎల్, బిఎస్ ఎన్ ఎల్ విలీనం : భారత్ నెట్ కింద గల విస్తృత మౌలికసదుపాయాలను వినియోగించుకునేందుకు వీలుగా భారత్ బ్రాడ్ బాండ్ నెట్ వర్క్ లిమిటెడ్ ( బిబిఎన్ ఎల్)ను, బిఎస్ ఎన్ ఎల్ లతో విలీనం చేస్తారు. భారత్ నెట్ వర్క్ కింద ఏర్పాటుచేసిన మౌలికసదుపాయాలు జాతీయ సంపద అవుతాయి. ఇది అందరు టెలికం సర్వీసు ప్రొవైడర్లకు ఎలాంటి వివక్షతకు తావులేకుండా అందుబాటులో ఉంటుంది.
ఈ చర్యలతో, బిఎస్ ఎన్ ఎల్ ప్రస్తుత తన సేవల నాణ్యతను పెంచుకోవడానికి , 4 జి సేవలు అందించడానికి , ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వీలుకలుగుతుంది. ఈ పునరుద్ధరణ ప్రణాళికతో బిఎస్ఎన్ ఎల్ 2026-27 నుంచి లాభాలను ఆర్జించగలదని భావిస్తున్నారు.
***
(Release ID: 1845521)
Visitor Counter : 272
Read this release in:
Bengali
,
Tamil
,
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Malayalam