హోం మంత్రిత్వ శాఖ
కేంద్ర రిజర్వు పోలీసు దళం (సిఆర్‌పిఎఫ్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోం & సహకార మంత్రి శ్రీ అమిత్ షా
తన శౌర్యంతో దేశ భద్రతను చెక్కు చెదరకుండా కాపాడడంలో అద్వితీయమైన సహకారాన్ని అందించడమే కాక ప్రతి భారతీయుడూ గర్వించే వీర చరిత్రను సృష్టించిన సిఆర్‌పిఎఫ్
సిఆర్‌పిఎఫ్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జవాన్లకు శుభాకాంక్షలు తెలుపడమే కాక అంకిత భావంతో వారు అందించిన సేవలకు, దేశం పట్ల అంకిత భావానికీ నా అభివందన (సెల్యూట్)
Posted On:
27 JUL 2022 12:24PM by PIB Hyderabad
కేంద్ర రిజర్వు పోలీసు దళం (సిఆర్‌పిఎఫ్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి కేంద్ర హోం & సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. దేశ భద్రతను చెక్కు చెదరకుండా ఉంచడంలో ప్రత్యేక సహకారాన్ని అందించడమే కాక, ప్రతి భారతీయుడూ గర్వించే ఘనమైన వీర చరత్రను సిఆర్‌పిఎఫ్ సృష్టించిందని హోం మంత్రి ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. సిఆర్‌పిఎఫ్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జవాన్లకు శుభాకాంక్షలు తెలుపడమే కాక అంకిత భావంతో అందించిన సేవలకు, దేశం పట్ల అంకిత భావానికీ నా అభివందనలు (సెల్యూట్) అని ఆయన అన్నారు.
కేంద్ర రిజర్వు పోలీసు దళాన్ని 27 జులై, 1939లో క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీసు (రాణికి ప్రాతినిధ్యం వహించే పోలీసు)గా ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యానంతరం, 28 డిసెంబరు 1949లో పార్లమెంటులో చేసిన చట్టం ద్వారా ఈ దళానికి కేంద్ర రిజర్వు దళంగా పేరు పెట్టారు. నూతనంగా స్వతంత్రం సాధించిన దేశ మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఈ దళం పోషించనున్న బహుముఖ పాత్రలను నాటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందుగానే ఊహించారు.
***
(Release ID: 1845396)