రైల్వే మంత్రిత్వ శాఖ
'ఆజాదీ కి రైల్ గడీ ఔర్ స్టేషన్స్' వేడుకలు 23 జూలై 2022న ముగుస్తాయి
స్వాతంత్ర్య సమరయోధులు మరియు వారి కుటుంబ సభ్యులతో సంభాషించనున్న రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్
అన్ని జోనల్ రైల్వేలు కార్యక్రమంలో పాల్గొంటాయి
Posted On:
21 JUL 2022 1:09PM by PIB Hyderabad
భారతీయ రైల్వేలు 23 జూలై, 2022న ఢిల్లీలో 'ఆజాదీ కి రైల్ గడీ ఔర్ స్టేషన్స్' ఐకానిక్ వీక్ సెలబ్రేషన్‌ల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబ సభ్యులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించనున్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా భారతీయ రైల్వే జూలై 18 నుండి జూలై 23 వరకు 'ఆజాదీ కి రైల్ గడీ ఔర్ స్టేషన్స్’ వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా స్వాతంత్య్ర పోరాటంలో గుర్తించిన 75 స్టేషన్లు/27 రైళ్ల ప్రాముఖ్యతను హైలైట్ చేశారు.
అన్ని జోన్‌లు/డివిజన్‌లు వాటి నామినేటెడ్ స్టేషన్‌ల ద్వారా (మొత్తం 75 ఫ్రీడమ్ స్టేషన్‌లు) ముగింపు కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కనెక్ట్ చేయబడతాయి. వీసీ ద్వారా జనరల్ మేనేజర్లు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ మేరకు రైల్వే బోర్డు ఇప్పటికే అన్ని జోనల్ రైల్వేల జనరల్ మేనేజర్‌లకు లేఖ రాసింది.
ఈ వేడుక అన్ని జోన్‌లు/డివిజన్‌లలో వారి నామినేటెడ్ స్టేషన్‌ల ద్వారా (మొత్తం 75 ఫ్రీడమ్ స్టేషన్‌లు) టూ వే కమ్యూనికేషన్ లింక్‌తో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.
****
(Release ID: 1843554)
Visitor Counter : 211
Read this release in:
English
,
Hindi
,
Marathi
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Urdu
,
Kannada
,
Assamese
,
Tamil
,
Malayalam