మంత్రిమండలి

మాల్దీవుల కు చెందిన జూడిశల్ సర్వీస్ కమిశన్ తో న్యాయ సంబంధి సహకారం రంగం లో ఎమ్ఒయు పై సంతకాల కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 20 JUL 2022 2:32PM by PIB Hyderabad

 

న్యాయ సంబంధి సహకారం అనే రంగం లో భారతదేశాని కి మరియు మాల్దీవుల గణతంత్రాని కి చెందిన జూడిశల్ కమిశన్ కు మధ్య అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పై సంతకాలు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలియజేసింది. న్యాయ సంబంధి సహకారం రంగం లో భారతదేశాని కి మరియు ఇతర దేశాల కు మధ్య కుదిరినటువంటి ఎనిమిదో అవగాహనపూర్వక ఒప్పందం ఇది.

 

న్యాయస్థానాల డిజిటైజేశన్ ప్రక్రియ లో సమాచార సాంకేతిక విజ్ఞ‌ానం తాలూకు ప్రయోజనాల ను వినియోగించుకొనేందుకు ఒక ఉపయుక్త వేదిక ను ఈ ఎమ్ఒయు సమకూర్చుతుంది. అంతేకాక, రెండు దేశాల ఐటి కంపెనీల కు మరియు స్టార్ట్- అప్స్ కు వృద్ధి చెందేందుకు అవకాశాలు ఉన్నటువంటి ఒక రంగం గా కూడాను ఇది నిరూపణ కాగలదు.

 

గత కొంత కాలం లో, భారతదేశానికి మరియు మాల్దీవుల కు మధ్య సన్నిహిత సహకారం బహుళ పార్శ్వాల లో గాఢతరం గా మారింది. చట్టం మరియు న్యాయం రంగం లో సహకారానికి సంబంధించినటువంటి ఈ ఒప్పందం పై సంతకాల తో, ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత జోరు ను అందుకోగలుగుతాయి. ఈ ఒప్పందం ఉభయ దేశాలలోనూ న్యాయ రంగం మరియు ఇతర శాసన సంబంధి రంగాల లో జ్ఞ‌ానం మరియు సాంకేతిక విజ్ఞ‌ానం ల ఆదాన ప్రదానాని కి వీలు ను కల్పించడం ఒక్కటే కాకుండా ఇరుగు పొరుగు దేశాల కు పెద్ద పీట ను వేసే (‘నేబర్ హుడ్ ఫస్ట్’) విధానం యొక్క లక్ష్యాల సాధన దిశ లో ప్రస్థానాన్ని పురోగమింపచేస్తుంది కూడా.

 

 

****



(Release ID: 1843485) Visitor Counter : 123