హోం మంత్రిత్వ శాఖ
భారత్‌లోని తొలి యునెస్కో ప్రపంచ వారసత్వ నగరమైన అహ్మదాబాద్‌ను టైమ్ మ్యాగజైన్ 2022లో ప్రపంచంలోనే 50 అతిగొప్ప ప్రదేశాల జాబితాలో చేర్చడం పట్ల దేశవాసులకు అభినందనలు తెలిపిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్‌షా
భారత్‌లోని తొలి యునెస్కో నగరమైన అహ్మదాబాద్‌ను ఇప్పుడు టైమ్ మ్యాగజైన్ 2022లో ప్రపంచంలోనే అతి గొప్ప 50 నగరాల జాబితాలో చేర్చడం ప్రతి భారతీయుడికీ ఆత్మగౌరవం కలిగించే విషయం, ముఖ్యంగా,గుజరాత్ ప్రజలకు
ఇది 2001 నుంచి గుజరాత్‌లో ప్రపంచ స్థాయి మౌలికసదుపాయాలు సృష్టించేందుకు పునాది వేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనిక భావనల ఫలితం
అది సబర్మతి రివర్ ఫ్రంట్ కావచ్చు లేదా అహ్మదాబాద్‌లోని సైన్స్ సిటీకావచ్చు భారత్‌ను భవిష్యత్తు కోసం సంసిద్ధం చేసేందుకు తర్వాతి తరం మౌలిక సదుపాయాలను సృష్టించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన శ్రీ నరేంద్ర మోడీ
Posted On:
14 JUL 2022 11:47AM by PIB Hyderabad
భారత్‌లోని తొలి యునెస్కో ప్రపంచ వారసత్వ నగరమైన అహ్మదాబాద్‌ను టైమ్ మ్యాగజైన్ 2022లో ప్రపంచంలోనే 50 అతిగొప్ప ప్రదేశాల జాబితాలో చేర్చడం పట్ల దేశవాసులకు కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్‌షా అభినందనలు తెలిపారు.
భారత్‌లోని తొలి యునెస్కో నగరమైన అహ్మదాబాద్‌ను ఇప్పుడు టైమ్ మ్యాగజైన్ 2022లో ప్రపంచంలోనే అతి గొప్ప 50 నగరాల జాబితాలో చేర్చడం ప్రతి భారతీయుడికీ ఆత్మగౌరవం కలిగించే విషయం, ముఖ్యంగా,గుజరాత్ ప్రజలకు అని ఆయన ట్వీట్‌ల పరంపరలో పేర్కొన్నారు. అందరికీ అభినందనలు అని ఆయన అన్నారు.
గుజరాత్‌లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు 2001 నుంచి శ్రీ నరేంద్రమోడి దార్శనిక భావనలు పునాది వేశాయని శ్రీ చెప్పారు. అది సబర్మతి రివర్‌ఫ్రంట్ కావచ్చు లేదా అహ్మదాబాద్‌లోని సైన్స్ సిటీ కావచ్చు, శ్రీ మోడీ ఎప్పుడూ తరువాతి తరం మౌలిక సదుపాయాలను సృష్టించడ ద్వారా భారత్‌ను భవిష్యత్తుకి సిద్ధం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారని షా పేర్కొన్నారు.
(Release ID: 1841520)
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam