నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటీస్‌షిప్ మేళా భారతదేశంలోని 200 ప్రదేశాలలో నిర్వహించబడుతుంది


అప్రెంటిస్‌షిప్ మేళా ద్వారా ఇప్పటి వరకు 67,035 మందికి అప్రెంటిస్‌షిప్ శిక్షణ ఆఫర్‌లు అందించబడ్డాయి

మేళాలో ఉద్యోగ అవకాశాలను ప్రోత్సహించడానికి 36+ పరిశ్రమలు, 500+ వాణిజ్య మరియు 1000+ వ్యాపారాలు ఉంటాయి.

Posted On: 10 JUL 2022 1:28PM by PIB Hyderabad

యువతలో వృత్తిపరమైన అవకాశాలు మరియు ఆచరణాత్మక శిక్షణను పెంచడానికి ప్రధానమంత్రి స్కిల్ ఇండియా మిషన్‌లో భాగంగా నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ప్రధాన్ మంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళాను జూలై 11, 2022న నిర్వహించనుంది. ఇప్పటి వరకు, 1,88,410 మంది దరఖాస్తుదారులు అప్రెంటిస్‌షిప్ మేళాలో పాల్గొన్నారు. ఇప్పటి వరకూ ప్లాట్‌ఫారమ్‌లో 67,035 అప్రెంటిస్‌షిప్ ఆఫర్‌లు చేయబడ్డాయి. కార్యక్రమంలో 36 రంగాలు మరియు 1000 కంటే ఎక్కువ కంపెనీలు మరియు 500 విభిన్న రకాల ట్రేడ్‌లు ఉంటాయి. ఎంఎస్‌డీఈ 200 కంటే ఎక్కువ ప్రాంతాల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అప్రెంటిస్‌షిప్ శిక్షణ ద్వారా దరఖాస్తుదారులకు వారి కెరీర్‌లను రూపొందించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.

ఇందులో పాల్గొనే అభ్యర్థులు తప్పనిసరిగా 5నుండి-12వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్, నైపుణ్య శిక్షణ సర్టిఫికేట్, ఐటీఐ డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. యువకులు మరియు ఔత్సాహిక వర్క్‌ఫోర్స్ వెల్డింగ్, ఎలక్ట్రికల్ వర్క్, హౌస్ కీపింగ్, బ్యూటీషియన్‌లు, మెకానిక్ వర్క్ వంటి 500 కంటే ఎక్కువ ట్రేడ్‌లను ఎంచుకోగలుగుతారు. అభ్యర్థులు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీవీఈటీ) గుర్తింపు పొందిన ధృవపత్రాలను కూడా పొందుతారు. శిక్షణ తర్వాత అవి వారి ఉపాధిని మెరుగుపరుస్తారు. ఈ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశ్యం ఏటంటే, శిక్షణ మరియు ఆచరణాత్మక నైపుణ్యాల ద్వారా వారి సామర్థ్యాన్ని కనుగొనడంలో మరియు అభివృద్ధి చేయడంలో యజమానులకు సహాయం చేస్తూనే ఎక్కువ మంది అప్రెంటిస్‌లను నియమించుకునేలా కంపెనీలను ప్రోత్సహించడం.

ప్రధాన్ మంత్రి నేషనల్ అప్రెంటీస్‌షిప్ మేళాపై నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ " అప్రెంటిస్‌షిప్ మేళా దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన వ్యక్తులకు అదనపు ఉద్యోగ అవకాశాలను అందిస్తుందని మేము ఆశిస్తున్నాము. ఈ ప్రోగ్రామ్‌ ప్రాధమిక ఉద్దేశ్యం ఎక్కువ మంది అప్రెంటిస్‌లను రిక్రూట్ చేయడం. ఆచరణాత్మక శిక్షణ కోసం ఇలాంటి అప్రెంటిస్‌షిప్‌లు అవసరమని గమనించడం ముఖ్యం. దీని కోసం మేము ప్రయత్నిస్తున్నాము. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న అప్రెంటిస్‌షిప్‌ల సంఖ్య మరియు వాటిని విజయవంతంగా అమలు చేయడం ద్వారా ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపింది" అని వెల్లడించారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కింద అప్రెంటిస్‌షిప్ అత్యంత స్థిరమైన మోడల్ మరియు స్కిల్ ఇండియా కింద పెద్ద ప్రోత్సాహాన్ని పొందుతోంది. నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (ఎన్‌ఏపీఎస్‌) కింద ప్రత్యక్ష లబ్ధిదారుల బదిలీ (డిబిటీ) ద్వారా ఇటీవల మొదటి సెట్ అప్రెంటీస్‌లు వారి ఖాతాలలో స్టైపెండ్ సబ్సిడీని పొందారు.

పీఎం నేషనల్ అప్రెంటీస్‌షిప్ మేళాలలో పాల్గొనే కంపెనీలు ఒకే ప్లాట్‌ఫారమ్‌లో అప్రెంటీస్‌లను కలుసుకునే అవకాశాన్ని కలిగి ఉంటాయి మరియు దరఖాస్తుదారులను అక్కడికక్కడే ఎంచుకోవచ్చు. కనీసం నలుగురు ఉద్యోగులతో కూడిన చిన్న స్థాయి సంస్థలు కార్యక్రమంలో అప్రెంటిస్‌లను తీసుకోవచ్చు.

ప్రతి నెలా అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించబడుతుంది. దీనిలో ఎంపికైన వ్యక్తులు కొత్త నైపుణ్యాలను పొందేందుకు ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా నెలవారీ స్టైఫండ్‌ను అందుకుంటారు. నేర్చుకునేటప్పుడు సంపాదించడానికి కూడా వారికి అవకాశం కల్పిస్తారు. అప్రెంటిస్‌ల ఉపకార వేతనాలు ఆన్‌లైన్‌లో చెల్లించబడతాయి.

ఆసక్తి గల అభ్యర్ధులు https://dgt.gov.in/appmela2022/ లేదా https://www.apprenticeshipindia.gov.in/ని సందర్శించడం ద్వారా మేళా కోసం నమోదు చేసుకోవచ్చు మరియు మేళా జరిగే సమీప ప్రదేశాన్ని తెలుసుకోవచ్చు.


 

*****


(Release ID: 1840630) Visitor Counter : 229