ప్రధాన మంత్రి కార్యాలయం

‘నా మిత్రుడు, ఆబే సాన్’ – శ్రీ శింజో ఆబే కు శ్రద్ధాంజలిని ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 08 JUL 2022 9:33PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జపాన్ పూర్వ ప్రధాని శ్రీ శింజో ఆబే కు భావగర్భితమైన శ్రద్ధాంజలి ని అర్పించారు. ప్రధాన మంత్రి ఒక ట్వీట్ తరువాత మరొక ట్వీట్ లలో ఏమన్నారంటే -

‘‘శ్రీ ఆబే కన్నుమూత తో, జపాన్ మరియు ప్రపంచం ఒక గొప్ప దూరాలోచనపరుడి ని కోల్పోయాయి. మరి, నేనేమో ఒక ప్రియ మిత్రుడి ని కోల్పోయాను.

నా మిత్రుడు ఆబే సాన్ కు ఇదే శ్రద్ధాంజలి..’’

‘‘నేను మొట్టమొదటి సారి ఆబే సాన్ ను 2007వ సంవత్సరం లో కలుసుకొన్నాను. అప్పటి నుంచి మేం ఎన్నో మరవరాని చర్చలు జరిపాం. వాటిలో ప్రతి ఒక్క దానిని నా మది లో పదిలపరచుకొంటాను. ఆబే సాన్ భారతదేశం- జపాన్ సంబంధాల ను శక్తియుక్తం గా మలచారు. న్యూ ఇండియా తన వృద్ధి ని త్వరితం చేసుకొంటున్న కాలం లో జపాన్ చేదోడు గా ఉండేటట్టు ఆయన చూశారు.’’

‘‘ప్రపంచ నాయకత్వం విషయానికి వస్తే, ఆబే సాన్ తన కాలాని కంటే ముందటి ఆలోచనలు చేసే వారు అనాలి. క్వాడ్ గాని, ఆసియాన్ నాయకత్వం లోని విభిన్నమైన వేదిక లు గాని, ఇండో పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమం గాని, ఆసియా-ఆఫ్రికా గ్రోథ్ కారిడర్ గాని కోఎలిశన్ ఫార్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ గాని.. ఇవి అన్నీ కూడాను ఆయన యొక్క బహుమూల్యమైనటువంటి తోడ్పాటు ల తో ప్రయోజనాల ను పొందాయి.’’

***

DS/AK

 

 

 

 



(Release ID: 1840324) Visitor Counter : 112