ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బెంగళూరు లోని బాశ్ స్మార్ట్ కేంపస్ ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించివీడియో సందేశం మాధ్యమం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి


‘‘సాంకేతిక విజ్ఞానం మరియు నూతన ఆవిష్కరణల లో మరింత ఎక్కువ పెట్టుబడి పెట్టడం ముఖ్యం’’

‘‘భారతదేశంలో వృద్ధి మరింత హరితప్రధానమైంది గా మారుతోంది’’

‘‘ప్రభుత్వం లో ప్రతి దశ ను సాంకేతికత తో జతకలపడం అనేది డిజిటల్ ఇండియాతాలూకు మా దృష్టి కోణం లో ఒక భాగం గా ఉంది.  లభిస్తున్న అవకాశాల నువినియోగించుకొని మా దేశం లో మరింత పెట్టుబడి పెట్టవలసింది గా ప్రపంచ దేశాల కు నేనువిజ్ఞప్తి చేస్తున్నాను’’

‘‘ఇవాళ, బాశ్ అనేది ఒక జర్మన్ కంపెనీ తో పాటుగా ఒక భారతీయ కంపెనీ కూడాను.  అది జర్మన్ఇంజినీరింగు కు మరియు భారతీయ శక్తి కి ఒక మహత్తర ఉదాహరణ గా ఉంది’’

Posted On: 30 JUN 2022 12:46PM by PIB Hyderabad

బాశ్ ఇండియా భారతదేశం లో అడుగుపెట్టి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భం లో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు.

ముందుగా, ప్రధాన మంత్రి బాశ్ ఇండియా ను భారతదేశం లో 100 ఏళ్ళు పూర్తి చేసుకొన్నందుకు అభినందించడం తో పాటు ఈ ప్రత్యేక సందర్భం భారతదేశ స్వాతంత్య్రానికి 75వ సంవత్సరం లో చోటు చేసుకొంటోందన్నారు. ఇదే సందర్భం లో బాశ్ స్మార్ట్ కేంపస్ ను ప్రారంభించడమైంది. ‘‘ఈ కేంపస్ భారతదేశాని కి మరియు ప్రపంచాని కి భవిష్యత్తు కాలం లో కావలసిన ఉత్పత్తుల ను మరియు పరిష్కారాల ను రూపొందించడం లో తప్పక దారి ని చూపుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. బెంగళూరు లోని బాశ్ కేంద్రాన్ని 2015వ సంవత్సరం అక్టోబరు లో చాన్స్ లర్ మర్కెల్ గారి తో కలసి తాను సందర్శించడాన్ని కూడా ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకున్నారు.

నేటి కాలాన్ని సాంకేతిక విజ్ఞాన కాలం గా ప్రధాన మంత్రి అభివర్ణిస్తూ, మహమ్మారి చెలరరేగినప్పుడు సాంకేతిక విజ్ఞాన ప్రయోజనాలు ఏ విధం గా వెలికివచ్చిందీ నొక్కిచెప్పారు. సాంకేతిక విజ్ఞానం లో, నూతన ఆవిష్కరణ లో మరిన్ని పెట్టుబడుల ను పెట్టడం ముఖ్యం అని ఆయన అన్నారు. నూతన ఆవిష్కరణ లు మరియు పరిమాణం పరం గా బాశ్ చేసిన కృషి ని ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, ఇది నిలకడ గా కొనసాగవలసిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. ‘‘భారతదేశం లో గడచిన 8 సంవత్సరాల లో సౌరశక్తి తాలూకు స్థాపిత సామర్ధ్యం దాదాపు గా 20 రెట్ల మేర కు వృద్ధి చెందడం తో భారతదేశం యొక్క వృద్ధి హరిత ప్రాధాన్యం కలది గా రూపుదిద్దుకొంటోంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశం లో, భారతదేశం వెలుపల కార్బన్-న్యూట్రాలిటీ ని సాధించినందుకు బాశ్ ను ప్రధాన మంత్రి కొనియాడారు.

ప్రస్తుతం భారతేదశం అత్యంత వేగం గా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల లో స్థానం సంపాదించుకొంది అని ప్రధాన మంత్రి అన్నారు. పెట్టుబడులు గత రెండేళ్ళ లో జోరందుకొన్నాయి. ‘‘మా యువత సౌజన్యం తో మా యొక్క స్టార్ట్-అప్ ఇకో-సిస్టమ్ ప్రపంచం లో అతిపెద్ద స్టార్ట్-అప్ ఇకో-సిస్టమ్ లలో ఒకటి గా నిలచింది. ఒక్క సాంకేతిక జగతి లోనే ఎన్నో అవకాశాలు ఉన్నాయి.’’ భారత ప్రభుత్వం ప్రతి గ్రామాని కి అధిక వేగవంతమైన ఇంటర్ నెట్ ను అందించేందుకు కృషి చేస్తోంది. ‘‘డిజిటల్ ఇండియా తాలూకు మా దృష్టి కోణం లో ప్రభుత్వం లోని ప్రతి ఒక్క దశ ను సాంకేతిక విజ్ఞానం తో జత పరచడం అనేది ఒక భాగం గా ఉంది. ఈ అవకాశాల ను ప్రపంచం వినియోగించుకొని, మా దేశం లో పెట్టుబడి పెట్టాలని నేను కోరుతున్నాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

ఈ ముఖ్య సందర్భం లో భారతదేశం లో మరింత ఎక్కువ గా పాటుపడడాన్ని గురించి ఆలోచించవలసిందంటూ బాశ్ కు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ‘‘రాబోయే 25 సంవత్సరాల లో మీ జట్టు సభ్యులు మరేమి చేయగలుగుతారు అనే విషయం లో లక్ష్యాల ను నిర్దేశించుకోవలసింది. 100 సంవత్సరాల క్రితం ఒక జర్మన్ కంపెనీ గా భారతదేశాని కి బాశ్ తరలి వచ్చింది. అయితే, ఈ రోజు న అది ఒక జర్మన్ కంపెనీ అయినట్లే ఇండియన్ కంపెనీ గా కూడా ను ఉంది. జర్మన్ ఇంజినీరింగు కు, భారతదేశం యొక్క శక్తి కి ఇది ఒక గొప్ప ఉదాహరణ గా ఉంది. ఈ భాగస్వామ్యం ఇక ముందు సైతం బలవత్తరం గా వృద్ధి చెందుతూనే ఉంటుంది’’ అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

 

**************

DS

 (Release ID: 1838234) Visitor Counter : 49