మంత్రిమండలి
విపత్తుల స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కూటమి (సిడిఆర్ఐ)ని 'అంతర్జాతీయ సంస్థ'గా వర్గీకరించడానికి ,
ఐక్యరాజ్యసమితి (ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్) చట్టం, 1947 కింద ప్రతిపాదించిన మినహాయింపులు, ఇమ్యూనిటీలు , ప్రివిలేజ్ లను మంజూరు చేయడానికి సిడిఆర్ఐతో హెడ్ క్వార్టర్స్ అగ్రిమెంట్ (హెచ్ క్యూఎ) పై సంతకం చేయడానికి మంత్రివర్గం ఆమోదం
Posted On:
29 JUN 2022 3:45PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన
సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం విపత్తుల స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కూటమి (సిడిఆర్ఐ)ని 'అంతర్జాతీయ సంస్థ'గా వర్గీకరించడానికి , ఐక్యరాజ్యసమితి (ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్) చట్టం, 1947 కింద ప్రతిపాదించిన మినహాయింపులు, ఇమ్యూనిటీలు , ప్రివిలేజ్ లను మంజూరు చేయడానికి సిడిఆర్ఐతో హెడ్ క్వార్టర్స్ అగ్రిమెంట్ (హెచ్ క్యూఎ) పై సంతకం చేసేందుకు ఆమోదం తెలిపింది.
సిడిఆర్ఐని ఒక 'అంతర్జాతీయ సంస్థ'గా వర్గీకరించడం , ఐక్యరాజ్యసమితి (ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్) యాక్ట్, 1947 సెక్షన్ -3 కింద ప్రతిపాదించిన మినహాయింపులు, ఇమ్యూనిటీలు మరియు ప్రివిలేజెస్ మంజూరు కోసం సిడిఆర్ఐ తో హెచ్ క్యూ ఏ పై సంతకం చేయడం ద్వారా డానికి స్వతంత్ర , అంతర్జాతీయ చట్టపరమైన హోదాను కల్పిస్తుంది.తద్వారా ఇది అంతర్జాతీయంగా తన విధులను సమర్థవంతంగా , ప్రభావ వంతంగా నిర్వహించగలదు. ఇది సిడిఆర్ఐ కి ఈ దిగువ పేర్కొన్నవాటిలో సహాయపడుతుంది:
I.విపత్తు ప్రమాదం /లేదా విపత్తు అనంతర ఉపశమనం కోసం మద్దతు అవసరమైన నిస్సహాయ దేశాలకు నిపుణులను పంపడం, అలాగే ఇదేవిధమైన ప్రయోజనాల కోసం కొరకు సభ్య దేశాల నుంచి నిపుణులను భారతదేశానికి తీసుకురావడం;
Ii.సి డి ఆర్ ఐ కార్యకలాపాల కోసం కొరకు ప్రపంచవ్యాప్తంగా నిధులను మోహరించడం, సభ్య దేశాల నుంచి విరాళాలను అందుకోవడం;
III. విపత్తు, వాతావరణ ప్రమాదాలు , వనరులకు అనుగుణంగా స్థితిస్థాపక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవడం లో దేశాలకు సహాయపడటానికి సాంకేతిక నైపుణ్యాన్ని అందుబాటులో ఉంచడం;
IV..స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కొసం తగిన రిస్క్ గవర్నెన్స్ ఏర్పాట్లు , వ్యూహాలను అవలంబించడంలో దేశాలకు సహాయాన్ని అందించడం;
V. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్ డిజి), పారిస్ వాతావరణ ఒప్పందం , విపత్తు నష్టాల తగ్గింపు కోసం సెండాయ్ ఫ్రేమ్ వర్క్ తో సమలేఖనం చేస్తూ, ఇప్పటికే ఉన్న , ఇంకా భవిష్యత్తు మౌలిక సదుపాయాల విపత్తు- వాతావరణ స్థితిస్థాపకతను నిర్ధారించడానికి తమ వ్యవస్థలను అప్ గ్రేడ్ చేయడంలో సభ్య దేశాలకు సాధ్యమైన మేర పూర్తి మద్దతును అందించడం;
VI.స్వదేశంలో విపత్తును తట్టుకునే మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని సమం చేయడం;
VII. భారతీయ శాస్త్ర -సాంకేతిక సంస్థ తో పాటు మౌలిక సదుపాయాల డెవలపర్లకు ప్రపంచ నిపుణులతో సంభాషించే అవకాశాన్ని కల్పించడం. విపత్తును తట్టుకునే మౌలిక సదుపాయాల అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వ , ప్రైవేట్ రంగాలలో మన స్వంత సామర్థ్యాలు , యంత్రాంగాలను నిర్మించడానికి ఇది సహాయపడుతుంది
ప్రారంభమైనప్పటి నుండి, 31దేశాలు, ఆరు అంతర్జాతీయ సంస్థలు, రెండు ప్రైవేట్ రంగ సంస్థలు సి ది ఆర్ ఐ లో సభ్యులుగా చేరాయి.
సి.డి.ఆర్.ఐ. ఆర్థికంగా అభివృద్ధి చెందిన వివిధ దేశాలను, అభివృద్ధి చెందుతున్న దేశాలను ఇంకా వాతావరణ మార్పులు విపత్తులకు ఎక్కువగా గురయ్యే దేశాలను ఆకర్షించడం ద్వారా తన సభ్యత్వాన్ని స్థిరంగా విస్తరిస్తోంది.
కాలక్రమేణా, భారతదేశంలోనే కాకుండా ఇతర భాగస్వామ్య దేశాలలో కూడా విపత్తును తట్టుకునే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి సంస్థలు/ భాగస్వాముల నెట్వర్క్ ను అభివృద్ధి చేస్తారు.
నేపథ్యం:
2019, ఆగస్టు 28న రూ.480 కోట్ల మద్దతుతో న్యూఢిల్లీ లో సెక్రటేరియట్ తో పాటు సీడీఆర్ఐని ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019-20 నుండి 2023-24 వరకు ఐదు సంవత్సరాల కాలంలో సాంకేతిక సహాయం , పరిశోధన ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి, సెక్రటేరియట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి , పునరావృత ఖర్చులను కవర్ చేయడానికి భారత ప్రభుత్వం నుండి మద్దతు సిడిఆర్ఐకి కార్పస్ గా ఉపయోగపడింది.
2019 సెప్టెంబర్ 23న న్యూయార్క్ లో జరిగిన ఐక్య రాజ్య సమితి క్లైమేట్ ఏక్షన్ సదస్సు
సందర్భంగా భారతదేశ ప్రధాన మంత్రి సీడీఆర్ఐ ని ప్రారంభించారు.ఇది భారత ప్రభుత్వం ప్రారంభించిన రెండవ ప్రధాన ప్రపంచ చొరవ. ఇంకా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు , విపత్తు స్థితిస్థాపకత విషయాల్లో భారతదేశ నాయకత్వ పాత్రకు ఇది నిదర్శనం.
సిడిఆర్ఐ అనేది జాతీయ ప్రభుత్వాలు, ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు , కార్యక్రమాలు, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులు , ఫైనాన్సింగ్ యంత్రాంగాలు, ప్రైవేట్ రంగం, విద్యా ,విజ్ఞాన సంస్థల తో కూడిన ప్రపంచ భాగస్వామ్య వ్యవస్థ. వాతావరణం , విపత్తు ప్రమాదాలకు మౌలిక సదుపాయాల వ్యవస్థల స్థితిస్థాపకతను ప్రోత్సహించడం, తద్వారా సుస్థిర అభివృద్ధిని నిర్ధారించడం దీని లక్ష్యం.
*****
(Release ID: 1838109)
Visitor Counter : 177
Read this release in:
Urdu
,
Marathi
,
English
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam