మంత్రిమండలి

భారతదేశానికి చెందిన నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి మంత్రిత్వ శాఖ కు (ఎమ్ఎన్ఆర్ఇ)మరియు ఇంటర్ నేశనల్ రిన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఆర్ఇఎన్ఎ) కు మధ్య వ్యూహాత్మకభాగస్వామ్య ఒప్పందాని కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 29 JUN 2022 3:48PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం లో నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి మంత్రిత్వ శాఖ (ఎమ్ఎన్ఆర్ఇ) కి మరియు ఇంటర్ నేశనల్ రిన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఆర్ఇఎన్ఎ) కు మధ్య సంతకాలు జరిగిన ఒక వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం తాలూకు వివరాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశాని కి తెలియజేయడమైంది. ఈ ఒప్పందం పై 2022వ సంవత్సరం జనవరి లో సంతకాలు అయ్యాయి.

ఈ ఒప్పందం లక్ష్యం ఏమిటి అంటే భారతదేశం లో నవీకరణ యోగ్య శక్తి ఆధారితమైన హరిత శక్తి రంగం లో మహత్వాకాంక్ష తో కూడిన పరివర్తన, నాయకత్వం మరియు జ్ఞానాన్ని ప్రోత్సహించాలి అన్నదే. ఈ ఒప్పందం భారతదేశం లో శక్తి రంగం లో పరివర్తన సంబంధిత ప్రయాసల కు సహాయకారి గా ఉండడమే కాక జలవాయు పరివర్తన ను ఎదుర్కోవడం లో ప్రపంచానికి కూడా సహాయకారి గా ఉంటుంది.

వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం లో పేర్కొన్న సహకార పూర్వక రంగాలు 2030వ సంవత్సరానికల్లా శిలాజేతర ఇంధన విద్యుత్తు ఉత్పత్తి సామర్ధ్యాన్ని 500 గీగావాట్ స్థాయి కి చేర్చాలి అని భారతదేశం పెట్టుకొన్న లక్ష్యాన్ని సాధించడం లో తోడ్పడుతాయి. దీనితో ఆత్మనిర్భర్ భారత్ఆవిష్కరణ కు కూడా ప్రోత్సాహం లభిస్తుంది.

ఈ ఒప్పందం యొక్క ముఖ్య ప్రత్యేకతల లో ఈ కింద ప్రస్తావించిన రంగాల లో సహకారాన్ని ప్రోత్సహించడం అనేది ఓ భాగం గా ఉంది :

  1. భారతదేశం నుంచి నవీకరణ యోగ్య శక్తి మరియు స్వచ్ఛ శక్తి సంబంధిత సాంకేతికత లకు ప్రోత్సాహాన్ని ఇచ్చే విషయం లో తత్సంబంధిత జ్ఞానాన్ని పంచుకొనేందుకు మార్గం సుగమం కావడం
  2. దీర్ఘకాలిక శక్తి ప్రణాళిక అనే అంశం లో భారతదేశం చేస్తున్న ప్రయత్నాల ను సమర్థించడం
  3. భారతదేశం లో నూతన ఆవిష్కరణల పరమైన వాతావరణాన్ని పటిష్టపరచడం కోసం సహకారాన్ని అందించడం
  4. గ్రీన్ హైడ్రోజన్ ను అభివృద్ధిపరచే అవకాశాల ను మరియు దాని వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా తక్కువ ఖర్చు లో కర్బన ప్రమేయాన్ని న్యూనీకరించే దిశ గా పయనించడం

ఈ ప్రకారం గా, ఈ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం భారతదేశం యొక్క శక్తి రంగం లో పరివర్తన ను తీసుకు వచ్చే ప్రయత్నాల తో పాటు జలవాయు పరివర్తన ను ఎదుర్కోవడం లో ప్రపంచానికి కూడా సాయపడనుంది.

 

***

 



(Release ID: 1837983) Visitor Counter : 170