ప్రధాన మంత్రి కార్యాలయం

జగద్గురు శ్రీ సంత్ తుకారామ్ మహారాజ్ ఆలయాన్ని పుణె లోని దేహూ లోప్రారంభించిన ప్రధాన మంత్రి


‘‘ప్రపంచం లో అత్యంత ప్రాచీన నాగరికతల లో ఒకటి గా భారతదేశం ఉంది అనేటటువంటిఖ్యాతి భారతదేశం లోని మునులు, సాధువుల పరంపర కు దక్కుతుంది’’

‘‘సంత్ తుకారామ్ గారి ‘అభంగ’లే మనకు ఇస్తున్న శక్తి తో మనం మన సాంస్కృతిక విలువల అండతో ముందుకు సాగుతున్నాం’’

‘‘ ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అవుర్ సబ్ కా ప్రయాస్’ అనే భావన మన సాధువుల యొక్క గొప్పసంప్రదాయాల నుంచి ప్రేరణ ను పొందింది’’

‘‘దళితుల, మోసానికి గురైన వర్గాల, వెనుకబడిన వర్గాల, ఆదివాసీల మరియు శ్రమికుల సంక్షేమంప్రస్తుతం దేశాని కి తొలి ప్రాథమ్యం గా ఉన్నది’’

‘‘ఆధునిక సాంకేతిక విజ్ఞానం  మరియు మౌలిక సదుపాయాలు అనేవి ప్రస్తుతం భారతదేశంయొక్క అభివృద్ధి కి సమాన పదాలు గా మారుతున్నాయి, మరి మేం అభివృద్ధి మరియు వారసత్వం ఈ రెండూ కలసికట్టుగా ముందంజ వేసేటట్లు గా చర్యల ను తీసుకొంటున్నాం.’’ 

Posted On: 14 JUN 2022 3:55PM by PIB Hyderabad

జగద్గురు శ్రీ సంత్ తుకారామ్ మహారాజ్ ఆలయాన్ని పుణె లోని దేహూ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.

ఈ సందర్భం లో సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, పవిత్రమైనటువంటి దేహూ గడ్డ కు విచ్చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి మన ధర్మ గ్రంథాల ను గురించి ప్రస్తావిస్తూ, సాధువుల సత్సంగం అనేది మానవ జన్మ లో ప్రాప్తించేటటువంటి ఒక అరుదైన సౌభాగ్యం అని పేర్కొన్నారు. సాధువుల కృప దొరికిందా అంటే గనక అప్పుడు దైవం యొక్క ప్రాప్తి స్వతహా గానే లభ్యం అవుతుంది. ‘‘ఈ రోజు న, దేహూ లోని ఈ పవిత్రమైన ధార్మిక స్థలాని కి విచ్చేసి నేను ఈ తరహా అనుభూతి నే పొందుతున్నాను’’ అని ఆయన అన్నారు. ‘‘దేహూ లోని శిలా మందిర్ ఒక్క భక్తి యొక్క శక్తి తాలూకు కేంద్రం మాత్రమే కాదు, అది భారతదేశం సాంస్కృతిక భవిష్యత్తు కు బాట ను పరిచేది కూడా ను. ఈ పవిత్ర స్థానాన్ని పునర్ నిర్మించినందుకు గాను ఆలయం ట్రస్టు కు మరియు భక్తజనానికంతా నేను నా యొక్క కృతజ్ఞత ను వ్యక్తం చేస్తున్నాను.’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

కొన్ని నెలల క్రితం పాల్ కీ మార్గ్ లో రెండు జాతీయ రహదారుల ను నాలుగు దోవ లు కలిగినవి గా తీర్చిదిద్దేందుకు శంకుస్థాపన చేసే భాగ్యం కూడా తనకు దక్కింది అని శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చుకొన్నారు. శ్రీ సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్ కీ మార్గ్ ను అయిదు దశల లో పూర్తి చేయడం జరుగుతుంది; సంత్ తుకారామ్ మహారాజ్ పాల్ కీ మార్గ్ ను మూడు దశల లో పూర్తి చేయడం జరుగుతుంది. ఈ దశల లో 350 కిలో మీటర్ ల పొడవు న హైవే స్ ను 11,000 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో నిర్మించడం జరుగుతుంది.

ప్రపంచం లో అతి ప్రాచీనమైన నాగరికత ను కలిగివున్న దేశాల లో ఒక దేశం గా భారతదేశం ఉండడం మనకు గర్వకారణం అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘దీని తాలూకు ఖ్యాతి ఎవరికైనా దక్కుతుంది అంటే అది భారతదేశం లోని సాధువులు మరియు మునుల పరంపర కే’’ అని ఆయన అన్నారు. భారతదేశం శాశ్వతం. ఎందుకు అంటే భారతదేశం సాధువుల భూమి కాబట్టి అని ప్రధాన మంత్రి అభివర్ణించారు. ప్రతి యుగం లో, మన దేశాని కి మరియు సమాజాని కి కొందరు మహానుభావులు మార్గదర్శనాన్ని ఇస్తూ వస్తున్నారు. ఈ రోజు న దేశం సంత్ కబీర్ దాస్ యొక్క జయంతి ని జరుపుకొంటోంది అని ప్రధాన మంత్రి అన్నారు. శ్రీ సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్, సంత్ నివృత్తినాథ్, సంత్ సోపాన్ దేవ్ మరియు ఆది శక్తి ముక్తా బాయీ జీ ల వంటి సాధువుల ముఖ్య వార్షిక ఉత్సవాలను గురించి కూడా ఆయన ఈ సందర్భం లో ప్రస్తావించారు.

సంత్ తుకారామ్ జీ యొక్క దయ, కరుణ మరియు సేవ లు ఆయన యొక్క అభంగాలరూపం లో ఈనాటికీ మన చెంత న ఉన్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ అభంగాలుమనకు తరాల తరబడి ప్రేరణ ను ఇస్తున్నాయి. ఏదైతే అంతరించిపోదో, అది కాలం తో పాటు శాశ్వతం గా ఉండిపోవడమే కాక ప్రాసంగికం గా కూడా ఉంటుంది.. అదే అభంగఅని ఆయన వివరించారు. ఈ రోజు కు కూడా దేశం తన సాంస్కృతిక విలువల తో పాటు ముందుకు సాగిపోతోంది, సంత్ తుకారామ్ యొక్క అభంగాలుమనకు శక్తి ని ఇస్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రధాన మంత్రి ప్రతిష్ఠిత సంత్ పరంపర యొక్క అభంగాలగౌరవశాలి సంప్రదాయాని కి శ్రద్ధాంజలి ని ఘటించారు. మానవుల మధ్య భేదభావాల ను అంతం చేసిన ఉపదేశాల ను ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించారు. ఈ ప్రబోధాలు దేశ భక్తి కి మరియు సమాజ భక్తి కి సమానమైనటువంటివి, ఎందుకు అంటే ఈ ప్రబోధాలు ఆధ్యాత్మిక సమర్పణ భావన ను గురించి కూడా బోధిస్తున్నాయి అని ఆయన అన్నారు. ఈ సందేశం వార్ కరీ భక్తులు ఏటా జరిపే పంఢర్ పుర్ యాత్ర లో ప్రస్ఫుటం అవుతుంది అని ఆయన అన్నారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అవుర్ సబ్ కా ప్రయాస్భావన అటువంటి గొప్ప సంప్రదాయాల నుంచి ప్రేరణ ను పొందింది అని ఆయన అన్నారు. మరీ ముఖ్యం గా స్త్రీ- పురుష సమానత్వ భావన మరియు అంత్యోదయ భావనల ను గురించి ఆయన ప్రస్తావిస్తూ, అవి వార్ కరీ సంప్రదాయం నుంచి ప్రేరణ ను పొందాయి అన్నారు. ‘‘దళితుల, మోసానికి గురైన వర్గాల, వెనుకబడిన వర్గాల, ఆదివాసీల మరియు శ్రమికుల సంక్షేమం దేశాని కి తొలి ప్రాథమ్యం గా ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

తుకారామ్ మహారాజ్ వంటి సాధు సంతులు ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి జాతీయ నాయకుల జీవనం లో చాలా పెద్ద పాత్ర ను పోషించారు అని ప్రధాన మంత్రి అన్నారు. స్వాతంత్య్ర పోరాటం లో పాలుపంచుకొన్నందుకు వీర్ సావర్ కర్ కు శిక్ష ను విధించిన వేళ ఆయన తుకారామ్ జీ యొక్క అభంగాల ను ఆలాపిస్తుండే వారు; కారాగారం లో ఉండగా చేతులకు వేసిన బేడీల ను చిప్ లీ వలె మోగించే వారు అని కూడా ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకువచ్చారు. సంత్ తుకారామ్ ఒక విభిన్నమైనటువంటి కాలం లో దేశం లో ఉత్సాహాన్ని మరియు శక్తి ని ప్రసరింపచేశారు అని ప్రధాన మంత్రి అన్నారు. పంఢర్ పుర్, జగన్నాథ్, మథుర లోని భ్రజ్ పరిక్రమ లేదా కాశీ పంచ్ కోసీ పరిక్రమ, చార్ ధామ్ లేదా అమర్ నాథ్ యాత్ర ల వంటి ధార్మిక తీర్థాలు’ మన దేశం యొక్క వివిధత్వాన్ని ఏకత సూత్రం లో పెనవేశాయి. మరి ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్భావన ను రేకెత్తించాయి అని కూడా ఆయన అన్నారు.

మన దేశ సమైక్యత ను బలపరచడం కోసం, మన ప్రాచీనమైన గుర్తింపు మరియు సంప్రదాయాల ను సజీవం గా అట్టిపెట్టుకొనడం మన బాధ్యత అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. ఈ కారణం గా, ‘‘ప్రస్తుతం ఎప్పుడైతే ఆధునిక సాంకేతిక విజ్ఞానం మరియు మౌలిక సదుపాయాలు భారతదేశం యొక్క అభివృద్ధి కి పర్యాయం గా మారుతున్నాయో, అభివృద్ధి మరియు వారసత్వం.. ఈ రెండూ కలసికట్టు గా ముందంజ వేసేటట్లు గా మేం చర్యల ను తీసుకొంటున్నాం’’ అని ఆయన అన్నారు. తన మాటల కు ఊతం గా, పాల్ కీ యాత్ర యొక్క ఆధునికీకరణ, చార్ ధామ్ యాత్ర కోసం కొత్త హైవే స్, అయోధ్య లో భవ్యమైనటువంటి రామ ఆలయం, కాశీ విశ్వనాథ్ ధామ్ యొక్క పునర్ నిర్మాణం, సోమ్ నాథ్ లో అభివృద్ధి కార్యాల ను గురించి ప్రధాన మంత్రి ఉదాహరణలు గా పేర్కొన్నారు. ప్రసాద్ యోజన లో భాగం గా తీర్థ స్థలాల ను అభివృద్ధి చేయడం జరుగుతోంది అని ఆయన వెల్లడించారు. రామాయణ సర్క్యూట్ ను, బాబా సాహెబ్ పంచ్ తీర్థ్ ను అభివృద్ధి చేయడం జరుగుతోంది అని కూడా ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరి కృషి సరి అయిన దిశ లో సాగితే గనక అన్నిటి కంటే కఠినమైనటువంటి సమస్యల ను సైతం పరిష్కరించవచ్చని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం స్వాతంత్య్రం యొక్క 75వ సంవత్సరం లో దేశం సంక్షేమ పథకాల మాధ్యమం ద్వారా 100 శాతం సాధికారిత దిశ లో దేశం ముందుకు కదులుతోంది అని ఆయన అన్నారు. పేదల కు ఈ పథకాల ద్వారా కనీస సదుపాయాల ను కల్పిలంచడం జరుగుతోంది. స్వచ్ఛ్ భారత్ అభియాన్ లో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు ఈ జాతీయ సంకల్పాల ను వారి యొక్క ఆధ్యాత్మిక సంకల్పాల లో ఓ భాగం గా చేసుకోవాలి అని కూడా ఆయన కోరారు. ప్రాకృతిక వ్యవసాయాని కి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని, యోగ కు ప్రజాదరణ లభించేటట్లు చూడండి, అలాగే యోగ దినాన్ని జరుపుకోవడం కోసం ముందుకు రండి అంటూ సభికుల కు ఆయన విజ్ఞప్తి చేశారు.

సంత్ తుకారామ్ వార్ కరీ సంత్ మరియు కవి గా పేరు తెచ్చుకొన్నారు; ‘అభంగ’ భక్తి కవిత్వం మరియు కీర్తనల పేరిట చర్చ కు వచ్చిన ఆధ్యాత్మిక గీతాల మాధ్యమం ద్వారా సముదాయ కేంద్రితమైనటువంటి పూజ కు కూడా ఆయన ప్రసిద్ధి ని పొందారు. ఆయన దేహూ లో నివాసం ఉండే వారు. ఆయన మరణానంతరం ఒక శిలా మందిరాన్ని నిర్మించడం జరిగింది. అయితే అది ఒక ఆలయం రూపాన్ని సంతరించుకోలేదు. దానిని రాతి పనితనం తోను, 36 శిఖరాల తోను పునర్ నిర్మించడం జరిగింది; అందులో సంత్ తుకారామ్ యొక్క విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేయడమైంది.

 

Blessed to inaugurate Jagatguru Shrisant Tukaram Maharaj Temple in Dehu, Pune. His teachings inspire all of us. https://t.co/RT1PGpihCf

— Narendra Modi (@narendramodi) June 14, 2022

हमारे शास्त्रों में कहा गया है कि मनुष्य जन्म में सबसे दुर्लभ संतों का सत्संग है।

संतों की कृपा अनुभूति हो गई, तो ईश्वर की अनुभूति अपने आप हो जाती है।

आज देहू की इस पवित्र तीर्थ-भूमि पर आकर मुझे ऐसी ही अनुभूति हो रही है: PM @narendramodi

— PMO India (@PMOIndia) June 14, 2022

देहू का शिला मंदिर न केवल भक्ति की शक्ति का एक केंद्र है बल्कि भारत के सांस्कृतिक भविष्य को भी प्रशस्त करता है।

इस पवित्र स्थान का पुनर्निमाण करने के लिए मैं मंदिर न्यास और सभी भक्तों का आभार व्यक्त करता हूं: PM @narendramodi

— PMO India (@PMOIndia) June 14, 2022

हमें गर्व है कि हम दुनिया की प्राचीनतम जीवित सभ्यताओं में से एक हैं।

इसका श्रेय अगर किसी को जाता है तो वो भारत की संत परंपरा को है, भारत के ऋषियों मनीषियों को है: PM @narendramodi

— PMO India (@PMOIndia) June 14, 2022

भारत शाश्वत है, क्योंकि भारत संतों की धरती है।

हर युग में हमारे यहां, देश और समाज को दिशा देने के लिए कोई न कोई महान आत्मा अवतरित होती रही है।

आज देश संत कबीरदास की जयंती मना रहा है: PM @narendramodi

— PMO India (@PMOIndia) June 14, 2022

संत तुकाराम जी की दया, करुणा और सेवा का वो बोध उनके ‘अभंगों’ के रूप आज भी हमारे पास है।

इन अभंगों ने हमारी पीढ़ियों को प्रेरणा दी है।

जो भंग नहीं होता, जो समय के साथ शाश्वत और प्रासंगिक रहता है, वही तो अभंग है: PM @narendramodi

— PMO India (@PMOIndia) June 14, 2022

छत्रपति शिवाजी महाराज जैसे राष्ट्रनायक के जीवन में भी तुकाराम जी जैसे संतों ने बड़ी अहम भूमिका निभाई।

आज़ादी की लड़ाई में वीर सावरकर जी को जब सजा हुई, तब जेल में वो हथकड़ियों को चिपली जैसा बजाते हुए तुकाराम जी के अभंग गाते थे: PM @narendramodi

— PMO India (@PMOIndia) June 14, 2022

हमारी राष्ट्रीय एकता को मजबूत करने के लिए आज ये हमारा दायित्व है कि हम अपनी प्राचीन पहचान और परम्पराओं को चैतन्य रखें।

इसलिए, आज जब आधुनिक टेक्नोलॉजी और इनफ्रास्ट्रक्चर भारत के विकास का पर्याय बन रहे हैं तो हम ये सुनिश्चित कर रहे हैं कि विकास और विरासत दोनों एक साथ आगे बढ़ें: PM

— PMO India (@PMOIndia) June 14, 2022

***

DS/AK

 



(Release ID: 1834090) Visitor Counter : 127