హోం మంత్రిత్వ శాఖ
ఏడాదిన్నరలోనే ప్రభుత్వంలో 10లక్షల మంది నియామకం
తగిన ఆదేశాలు జారీ చేసిన ప్రధాని మోదీకి
ట్విట్టర్ ద్వారా అమిత్ షా కృతజ్ఞతలు..
నవభారతానికి ఆధారం యువశక్తే..
యవజనుల సాధికారతకోసం
నరేంద్ర మోదీ నిర్విరామ కృషి..
యువతలో ఆత్మవిశ్వాసాన్ని
నింపనున్న నియామకాలు..
ఖాళీల భర్తీకి పలు చర్యలు తీసుకున్న
కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ..
प्रविष्टि तिथि:
14 JUN 2022 2:44PM by PIB Hyderabad
ప్రభుత్వంలోని అన్ని శాఖలు, మంత్రిత్వ శాఖల్లో గత ఏడాదిన్నిర కాలంలో ఉద్యమ పంథాలో 10 లక్షలమంది నియామకాలు జరిగేలా ఆదేశాలిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర హోమ్, సహకార శాఖ మంత్రి అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా అమిత్ షా ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
"నవ భారతదేశానికి ప్రధాన ప్రాతిపదిక యువశక్తి మాత్రమే. యువజనులకు సాధికారత కల్పించేందుకు నరేంద్ర మోదీ నిర్విరామంగా పనిచేస్తూ వస్తున్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు, మంత్రిత్వ శాఖల్లో ఏడాదిన్నరలో 10లక్షలమందిని నియమించేందుకు మోదీ జారీ చేసిన ఆదేశాలు, తీసుకున్న నిర్ణయాలు యువజనుల్లో కొత్త ఆశలు నెరవేరడానికి, ఆత్మవిశ్వాసానికి దోహదపడతాయి.” అని అమిత్ షా తన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు.
ప్రభుత్వ శాఖల్లో, మంత్రిత్వ శాఖల్లో 10లక్షల మంది నియామకానికి ప్రధానమంత్రి జారీచేసిన ఆదేశాలమేరకు ఉద్యోగ ఖాళీలను ఉద్యమ తరహాలో భర్తీ చేసేందుకు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ గత ఏడాదిన్నర కాలంలో అనేక చర్యలు తీసుకుందని ఆయన అన్నారు.
****
(रिलीज़ आईडी: 1833971)
आगंतुक पटल : 141