మంత్రిమండలి

జపాన్ కి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, వాయు కాలుష్యం నాణ్యత, వాతావరణ మార్పు పై భారతీయ పరిశోధన సంస్థ ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ (అరీస్) మధ్య సంతకం చేసిన అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) ఆమోదించిన క్యాబినెట్

Posted On: 08 JUN 2022 4:49PM by PIB Hyderabad

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, జపాన్, ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ (అరీస్), ఇండియా మధ్య సహకార మార్గదర్శకాలు రూపొందించేందుకు అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేయడం గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం సమాలోచనలు జరిపింది. గాలి నాణ్యత, వాతావరణ మార్పులపై ఉమ్మడి పరిశోధన (ఇకపై "ఉమ్మడి పరిశోధన"గా సూచిస్తారు) నిర్వహించడం, అమలు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. అలాగే, నైనిటాల్ అరీస్ పరిశోధనా రంగాలలో గతంలో ఏ ఇతర విదేశీ సంస్థలతోనూ అటువంటి అవగాహన ఒప్పందాలు సంతకం చేయలేదు.

ఇరు పక్షాలు నిర్వహించే వివిధ కార్యకలాపాలపై కూడా చర్చించారు. శాస్త్రీయ పరికరాలను ఉమ్మడిగా వినియోగించుకోవడం, పరిశీలించే పద్ధతులపై శాస్త్రీయ, సాంకేతిక సమాచారం పరస్పర మార్పిడి, శాస్త్రీయ నివేదికలు రూపొందించేటపుడు సంయుక్త విశ్లేషణ ఈ ఒప్పందం ప్రకారం చేస్తారు. అలాగే ఉమ్మడి విద్యా, పరిశోధక కార్యకలాపాలు, పరిశోధనలకు ఇరు వైపుల నుండి విజిటింగ్ స్కాలర్లు, పీహెచ్డీ విద్యార్థులు పరస్పరం వెళ్లే అవకాశం, సంయుక్తంగా కార్యశాలలు, సెమినార్లు నిర్వహణ వంటి విషయాల్లో రెండు సంస్థలు కలిసి పనిచేస్తాయి. 

అరీస్ గురించి... 
ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ (అరీస్) అనేది భారత ప్రభుత్వంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం క్రింద స్థాపించిన స్వయంప్రతిపత్త పరిశోధనా సంస్థ. అరీస్ అనేది ఖగోళ శాస్త్రం, ఆస్ట్రోఫిజిక్స్, అట్మాస్ఫియరిక్ సైన్సెస్‌లో పరిశోధన కోసం అత్యుత్తమ కేంద్రం. ఇది భూమిపై వాయు కాలుష్యం మరియు వాతావరణ మార్పులు, సూర్యుడు, నక్షత్రాలు, గెలాక్సీల నిర్మాణం, పరిణామంపై పరిశోధనలను నిర్వహిస్తుంది. ఇన్స్టిట్యూట్ పరిశోధన సమూహంలో పరిశోధనా శాస్త్రవేత్తలు, పీహెచ్డీ విద్యార్థులు, పోస్ట్‌డాక్స్, విజిటింగ్ స్కాలర్‌లు ఉంటారు. పరిశోధకులు అధునాతన, శాస్త్రీయ పరికరాల రూపకల్పన, అభివృద్ధిలో కూడా నిమగ్నమై ఉన్నారు.  దీనికి ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బంది బృందం మద్దతు ఇస్తుంది - మనోరా పీక్, దేవస్తాల్ అనే రెండు క్యాంపస్‌లలో కార్యకలాపాలు నిర్వహిస్తారు.

నీస్ గురించి:

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ (నీస్) జపాన్‌లోని ఇది ఇంటర్ డిసిప్లినరీ, సమగ్ర పద్ధతిలో విస్తృతమైన పర్యావరణ పరిశోధనలను చేపట్టే ఏకైక పరిశోధనా సంస్థ.  పర్యావరణ పరిరక్షణపై శాస్త్రీయ పరిశోధనలను రూపొందించడానికి నీస్ పనిచేస్తుంది. నీస్ ప్రాథమిక పరిశోధన, డేటా సేకరణ, విశ్లేషణ, పర్యావరణ నమూనాల సంరక్షణ, సదుపాయం ద్వారా ఇన్‌స్టిట్యూట్ పరిశోధన పునాదిని ఏకీకృతం చేయడం వంటి పరిశోధన ప్రాజెక్టులపై పని చేస్తోంది. నీస్ పర్యావరణ పరిశోధనను కొనసాగించడానికి నాలుగు కీలక అంశాలు (సింథసైజ్, ఇంటిగ్రేట్, ఎవాల్వ్, నెట్‌వర్క్ = నీస్ వ్యూహాలు)గా విశ్వసిస్తుంది.

 

***



(Release ID: 1832228) Visitor Counter : 114