ప్రధాన మంత్రి కార్యాలయం

‘ఇన్ ఫ్రా గతి తాలూకు 8 సంవత్సరాలు’ వివరాల ను శేర్ చేసిన ప్రధాన మంత్రి

Posted On: 06 JUN 2022 3:00PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ #8YearsOfInfraGati హ్యాష్ ట్యాగ్ లో ప్రభుత్వం యొక్క 8 సంవత్సరాల పాలన లో జరిగిన మౌలిక సదుపాయాల అభివృద్ధి తాలూకు వివరాల ను శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మెరుగైన వాయు సంధానం.

మెట్రో రవాణా సదుపాయాని కి నోచుకొన్న మరిన్ని నగరాలు.

మౌలిక సదుపాయాల కల్పన కు రికార్డు స్థాయి లో ప్రోత్సాహం.

రైలు మార్గాల ను ఆధునికీకరించడం.

మన ప్రజల కోసమని తదుపరి తరం మౌలిక సదుపాయాల ను భారతతదేశం ఏ విధం గా కల్పిస్తోందో ఇదుగో ఇక్కడ చూడవచ్చును. #8YearsOfInfraGati”

‘‘8 సంవత్సరాల కాలం లో మౌలిక సదుపాయాల రంగం లో ఏ విధం గా అయితే వేగవంతమైన అభివృద్ధి జరిగిందో, అది న్యూ ఇండియాయొక్క శక్తియుక్తుల ను చాటి చెబుతోంది. రహదారులు, విమానాశ్రయాలు, రైల్వే సంబంధి మౌలిక సదుపాయాల కల్పన, ఇంకా నౌకాశ్రయాల నిర్మాణం తో పాటు గా ఈ రోజు న ‘పిఎమ్ గతి శక్తి’ మాధ్యమం ద్వారా ఈ రంగాని కి కొత్త వేగం లభిస్తోంది. #8YearsOfInfraGati”

అని పేర్కొన్నారు.

*****

DS/ST

 (Release ID: 1832137) Visitor Counter : 124