మంత్రిమండలి

ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మార్కెట్‌ ప్లేస్ – ప్రత్యేక ప్రయోజన వాహకం GeM - SPV ప్రయోజనకారిగా విస్తరించడానికి క్యాబినెట్ ఆమోదం, తద్వారా ప్రభుత్వ సంస్థల సేకరణలో పోటీ ధరలు పొందడంలో సహకార సంఘాలకు సహాయకారి.

Posted On: 01 JUN 2022 4:38PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో, ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తున్న ఆన్లైన్ మార్కెట్ వ్యవస్థ-GeMలో కొనుగోలుదారులుగా సహకార సంఘాలను సేకరణను అనుమతించేందుకు వ్యాపార మద్దతును విస్తరించేందుకు ప్రభుత్వం  ఆమోదం తెలిపింది.

 

ప్రభుత్వ కొనుగోలుదారుల కోసం బహిరంగ పారదర్శక సరకు సేకరణ వేదికను రూపొందించడానికి భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వ్యర్యంలో ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మార్కెట్‌ ప్లేస్ (GeM) ఆన్లైన్ పోర్టల్ ను ఆగష్టు 9, 2016న ప్రారంభించింది. ఏప్రిల్ 12, 2017న కేంద్ర మంత్రివర్గం ఆమోదం మేరకు 17 మే, 2017న నేషనల్ పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌గా ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ (GeM SPV) పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ గా ఆమోదం పొంది ఏర్పాటు అయ్యింది. ప్రస్తుతం, ఈ విపణి వేదిక అన్ని ప్రభుత్వ కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్త సంస్థలు, స్థానిక సంస్థలు మొదలైన కొనుగోలుదారులకై సేకరణార్థం తెరిచి ఉంది:. ఇప్పటికే అమలులో ఉన్న ఆదేశాల ప్రకారం, ప్రైవేట్ రంగ కొనుగోలుదారుల ఉపయోగం కోసం GeM అందుబాటులో లేదు. సరఫరాదారులు (విక్రేతలు) మాత్రం ప్రభుత్వం లేదా ప్రైవేట్, అన్ని విభాగాల నుంచి ఉండవచ్చు.

 

లబ్ధిదారుల సంఖ్య:

8.54 లక్షలకు పైగా నమోదిత సహకార సంఘాలు వారి 27 కోట్ల మంది సభ్యులు ఈ ప్రయత్నం వల్ల ప్రయోజనం పొందుతారు. దేశవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులు, విక్రేతలందరికీ GeM పోర్టల్ అందుబాటులో ఉంటుంది.

వివరాలు:

1. సాధారణ వినియోగ వస్తువులు, సేవల ఆన్‌లైన్ సేకరణను సులభతరం చేయడానికి GeM ఇప్పటికే ఒక స్టాప్ పోర్టల్‌గా తగినంతగా అభివృద్ధి చెందింది. ఇది పారదర్శకంగా, సమర్ధవంత అనుకూల ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది.  వేగవంతమైన సేకరణకు సహకార సంఘాలు  GeM నుంచి వస్తువులు, సేవలను అందించడానికి అనుమతులు పొందుతాయి.

2. సహకార సంఘాలను GeMలో కొనుగోలుదారులుగా నమోదు చేసుకోవడానికి అనుమతించడం ద్వారా సరసమైన ధరలను పొందడంలో బహిరంగ  పారదర్శక ప్రక్రియ ద్వారా సహకార సంస్థలకు  ప్రభుత్వం సహాయపడుతుంది.

3. GeMలో ఆన్‌బోర్డ్ చేయాల్సిన సహకార సంఘాల చెల్లుబాటు జాబితా - - GeM SPVతో సంప్రదించి సహకార మంత్రిత్వ శాఖ  నిర్ణయిస్తుంది. ఇది GeMలో కొనుగోలుదారులుగా కోఆపరేటివ్‌లో బోర్డింగ్‌లో వేగాన్ని నిర్ణయించేటప్పుడు GeM వ్యవస్థ, సాంకేతిక సామర్థ్యం  లాజిస్టిక్స్ అవసరాలు వంటి పరిగణనలను  నిర్ధారిస్తుంది.

4. GeM సహకార సంస్థల కోసం ప్రత్యేక ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను అందిస్తుంది, ఇప్పటికే ఉన్న పోర్టల్‌లో అదనపు వినియోగదారులకు మద్దతు ఇవ్వడానికి సాంకేతిక మౌలిక సదుపాయాలను అందిస్తుంది, అలాగే అందుబాటులో ఉన్న సంప్రదింపు కేంద్రాలు, ఇన్-ఫీల్డ్ శిక్షణ, ఇతర సహాయ సేవల ద్వారా ఆన్‌బోర్డింగ్ లావాదేవీల ప్రయాణాల కోసం సహకార సంస్థలకు సహాయం అందిస్తుంది.

5. పెరిగిన పారదర్శకత, సామర్థ్యం పోటీధరల నుంచి ప్రయోజనం పొందేందుకు, వస్తువులు సేవల సేకరణ కోసం GeM ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకునేలా సహకార సంఘాలను ప్రోత్సహించడానికి సహకార మంత్రిత్వ శాఖ అవసరమైన సలహాలను కాలానుగుణంగా జారీ చేస్తుంది.

6. GeM పోర్టల్ లో విక్రేత సంఘాల ప్రయోజనాలను రక్షించడానికి  సకాలంలో చెల్లింపులను నిర్ధారించడానికి, చెల్లింపు వ్యవస్థల విధానాలను సహకార మంత్రిత్వ శాఖతో సంప్రదించి GeM నిర్ణయిస్తుంది.

 

 అమలు వ్యూహం  లక్ష్యాలు:

 

GeM పోర్టల్‌లో అవసరమైన ఫీచర్లు కార్యాచరణల సృష్టి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, హెల్ప్‌డెస్క్, శిక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం సహకార సంస్థల ఆన్‌బోర్డింగ్ వంటి తగిన చర్యలను GeM సంస్థ  ప్రారంభిస్తుంది,  మైలురాళ్లు,  ముఖ్యమైన తేదీల సమాచారం  వంటి నిర్వహణ  సహకార మంత్రిత్వ శాఖ చేస్తుంది. సహకార మంత్రిత్వ శాఖ  GeM (వాణిజ్యం  పరిశ్రమల మంత్రిత్వ శాఖ) మధ్య పరస్పర సహకారంతో వ్యవస్థ నడుస్తుంది.

ఉపాధి కల్పన సంభావ్యత-ప్రభావం:

సాధారణ వినియోగ వస్తువులు  సేవల ఆన్‌లైన్ సేకరణను సులభతరం చేయడానికి ఇది ఇప్పటికే వన్ స్టాప్ పోర్టల్‌గా తగినంతగా అభివృద్ధి అయినందున GEM నుంచి వస్తువులు  సేవలను సేకరించేందుకు సహకార సంఘాలను అనుమతించాలని సహకార మంత్రిత్వ శాఖ కోరింది. ఇది పారదర్శక, సమర్ధ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంటుంది  సేకరణలో వేగవంతమైనది. పై సందర్భంలో, సహకార సంఘాలు వారికి అవసరమైన వస్తువులు, సేవల కొనుగోలుదారులుగా GeMలో నమోదు చేసుకోవడానికి అనుమతించడం, బహిరంగ  పారదర్శక ప్రక్రియ ద్వారా పోటీ ధరలను పొందడంలో సహకార సంస్థలకు సహాయం చేస్తుంది. అంతేకాకుండా, సొసైటీలు 27 కోట్ల కంటే ఎక్కువ మంది సభ్యులనుకలిగి ఉన్నందున, GeM ద్వారా సేకరణ అమ్మకందారులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చడమే కాకుండా, సహకార సంఘాల విశ్వసనీయతను కూడా పెంచుతుంది.

క్రియాత్మక అవసరాలు, సాంకేతిక వనరులను నిర్వహించడం,  బహుళ వాటాదారులతో లావాదేవీలు వంటి అధునాతన సేకరణ పోర్టల్‌ నిర్వహణ అంశాలను అమలు చేయడంపై కూడా GeM గొప్ప అవగాహనను అభివృద్ధి చేసింది. దేశంలో సేకరణ  వ్యవస్థను రూపొందించడంలో గొప్ప అనుభవాన్ని సహకార సంఘాలకు కూడా సేకరణ ప్రక్రియలలో సమర్థత  పారదర్శకతను ఉత్పత్తి చేయడానికి గణనీయంగా ఉపయోగించవచ్చు. ఇది సహకార సంస్థల కోసం మొత్తం “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”ని మెరుగుపరుస్తుంది, అదే సమయంలో GeM నమోదిత విక్రేతలకు కూడా పెద్ద కొనుగోలుదారుల ఆధారాన్ని అందిస్తుంది.

చేరిన వ్యయం:

GeM SPV ప్రతిపాదిత  విధానానికి మద్దతు ఇవ్వడానికి ఇప్పటికే ఉన్న ఆన్లైన్ సేకరణ వేదిక   సంస్థను ప్రభావితం చేస్తూనే ఉంటుంది, దీనికి అదనపు సాంకేతిక అవస్థాపన  అదనపు శిక్షణ  మద్దతు వనరులపై కొంత పెట్టుబడులు అవసరం కావచ్చు. ఈ పెరుగుతున్న ఖర్చులను కవర్ చేయడానికి, సహకార మంత్రిత్వ శాఖతో పరస్పర సంప్రదింపుల ద్వారా నిర్ణయించుకోవడానికి, సహకార సంస్థల నుంచి తగిన లావాదేవీ రుసుమును GeM వసూలు చేయవచ్చు. ఇటువంటి ఛార్జీలు ఇతర ప్రభుత్వ కొనుగోలుదారులకు GeM విధించే ఛార్జీల కంటే ఎక్కువగా ఉండకూడదు. GeM కోసం కార్యకలాపాల స్వీయ-స్థిరతను నిర్ధారించడానికి ఇది ప్రణాళిక రచిస్తుంది.  అందువల్ల ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక చిక్కులు ఉండవు.

నేపథ్య:

GeM SPV , ప్రారంభమైననాటి నుంచి గణనీయమైన పురోగతిని సాధించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరానికి 84.5% కంటే ఎక్కువగా స్థూల వాణిజ్య విలువ (GMV) పెరిగింది. పోర్టల్ ఆర్ధిక సంవత్సరం  2021-22లో వాణిజ్య విలువలో 178% వృద్ధిని అందించింది.  ఆర్ధిక సంవత్సరం 2021-22లోనే 1 లక్ష కోట్ల రూపాయలను దాటింది, ఇది ఆర్ధిక సంవత్సరం 2020-21 వరకు సంచిత GMV కంటే చాల ఎక్కువ.
 

 

ఆర్థిక సంవత్సరం

 వార్షిక స్థూల సరుకుల విలువ (రూపాయలలో)

 గత ఏడాది కంటే వృద్ధి

 

 

 

 

 

 

2018-19

 

16,972 కోట్లు

 

 

 

2019-20

 

22,580 కోట్లు

 

33%

 

2020-21

 

38,280 కోట్లు

 

70%

 

2021-22

 

106760 కోట్లు

 

178%

 

 

 

ప్రపంచ బ్యాంక్  నేషనల్ ఎకనామిక్ సర్వే-2021తో సహా వివిధ స్వతంత్ర అధ్యయనాలు, వాణిజ్యంలో మరింత భాగస్వామ్యానికి  తక్కువ ఖర్చుతో కూడిన ఎంపికలను అందించడానికి GeM  సామర్థ్యం కారణంగా గణనీయమైన పొదుపులను ఊహించాయి.

భారతదేశంలో సహకార ఉద్యమం గణనీయంగా అభివృద్ధి చెందింది, భారతదేశంలోని వెనుకబడిన తరగతుల అభివృద్ధి అవసరాలు తీర్చడంలో, ముఖ్యంగా వ్యవసాయం, బ్యాంకింగ్  గృహనిర్మాణ రంగాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం 8.54 లక్షల సహకార సంఘాలు ఇప్పటికే నమోదై ఉన్నాయి. ఈ సహకార సంఘాలు సమిష్టిగా పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి విక్రయిస్తాయి. సహకార సంఘాలను "కొనుగోలుదారులు"గా నమోదు చేసుకోవడం అనేది GeM  ప్రస్తుత కార్యాచరణలో లో లేదు.

 

***(Release ID: 1830306) Visitor Counter : 239