ప్రధాన మంత్రి కార్యాలయం
శిమ్ లా లో ‘గరీబ్ కళ్యాణ్ సమ్మేళనాన్ని’ ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
‘‘130 కోట్ల మంది భారతీయులు నాకు ఉన్న కుటుంబం; ప్రజలారా మీరే నా జీవితం లో సర్వసం; మరి ఈ జీవనం మీ కోసమే’’
‘‘ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం, భారతదేశం లో ప్రతి ఒక్కరి గౌరవం కోసం, భారతీయుల లో ప్రతి ఒక్కరి భద్రత కోసం, అలాగే వారి సమృద్ధి కోసం, అందరికీ సంతోషకరమైన జీవనం కోసం మరియుశాంతి కోసం.. నేను చేయగలిగినదంతా చేస్తాను అనేటటువంటి నా సంకల్పాన్నిపునరుద్ఘాటిస్తున్నాను’’
‘‘సేవ, సుపరిపాలన మరియు పేదల సంక్షేమం.. ఇవి ప్రజల దృష్టి లోప్రభుత్వం యొక్క అర్థాన్ని మార్చివేశాయి’’
‘‘ఇంతకుముందు శాశ్వతం అని భావించినటువంటి సమస్యల కు ఒక శాశ్వత పరిష్కారమార్గాన్ని చూపించడాని కి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’’
‘‘మా ప్రభుత్వం ఒకటో రోజు నుంచి పేదల కు సాధికారిత ను కల్పించడాని కిప్రయత్నించింది’’
‘‘మేము ఓటు బ్యాంకు కోసం కాకుండా, ఒక ‘న్యూ ఇండియా’ నిర్మాణాని కి కృషి చేస్తున్నాము’’
‘‘100 శాతం సాధికారిత అంటే, అది భేద భావాన్ని మరియు తృప్తి పరచే ధోరణి ని అంతంచేయడం అని అర్థం. 100 శాతం సాధికారిత అంటే, ప్రతి పేద వ్యక్తి ప్రభుత్వ పథకాలతాలూకు పూర్తి ప్రయోజనాల ను అందుకోవడమని అర్థం’’
‘‘న్యూ ఇండియా యొక్క సత్త
Posted On:
31 MAY 2022 1:21PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ లోని శిమ్ లా లో జరిగిన ‘గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్’ ను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాన మంత్రి నాయకత్వం లోని ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకోవడాని కి గుర్తు గా ఈ వినూత్నమైన సార్వజనిక కార్యక్రమాన్ని దేశం అంతటా, రాష్ట్రాల రాజధానుల లో, జిల్లా ముఖ్య పట్టణాల లో మరియు కృషి విజ్ఞాన కేంద్రాల లో నిర్వహించడం జరుగుతోంది. దేశవ్యాప్తం గా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజల అభిప్రాయాల ను తెలుసుకోవడం కోసం వారితో నేరు గా భేటీ కావాలి అనే ఉద్దేశ్యం ఈ సమ్మేళనానికి ఉంది.
ప్రధాన మంత్రి ఇదే సందర్భం లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎమ్-కిసాన్) పథకం లో భాగం గా ఉద్దేశించిన ఆర్థిక ప్రయోజనాల తాలూకు 11వ కిస్తీ ని కూడా విడుదల చేశారు. ఇది 10 కోట్ల మంది కి పైగా లబ్ధిదారు రైతు కుటుంబాల కు దాదాపు గా 21,000 కోట్ల రూపాయల బదలాయింపున కు మార్గాన్ని సుగమం చేస్తున్నది. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి దేశవ్యాప్తం గా గల పిఎమ్-కిసాన్ లబ్ధిదారుల తో ముఖాముఖి మాట్లాడారు. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారిలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాజేన్ద్ర అర్లేకర్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జయ్ రామ్ ఠాకుర్ లతో పాటు కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్, తదితరులు ఉన్నారు.
లద్దాఖ్ కు చెందిన లబ్ధిదారు శ్రీ తాశీ టుండుప్ తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, లద్దాఖ్ లో పర్యటకుల ఆగమనం గురించి, అలాగే ప్రభుత్వ పథకాల తో శ్రీ తాశీ టుండుప్ కు ఎదురైన అనుభవాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు. సైన్యం ప్రతినిధి గా ఆయన అందించిన సేవల ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. పిఎమ్ఎవై, టాయిలెట్, గ్యాస్ కనెక్షన్, ఇంకా వ్యవసాయాని కి సంబంధించిన ప్రయోజనాల ను అందుకోవడం లో తాను ఎటువంటి సమస్య ను ఎదుర్కోలేదు అంటూ శ్రీ తాశీ తుండుప్ బదులిచ్చారు.
బిహార్ కు చెందిన శ్రీమతి లలితా దేవి గారు పిఎమ్ఎవై, ఉజ్జ్వల, స్వచ్ఛ్ భారత్ మరియు జల్ జీవన్ మిశన్ ల తాలూకు లబ్ధిదారుల లో ఒకరు గా ఉన్నారు. ఆయా పథకాలు తనకు జీవన సౌలభ్యం తో పాటు గౌరప్రదమైనటువంటి జీవనం కూడా లభించడాని కి ఏ విధం గా తోడ్పడిందీ ప్రధాన మంత్రి దృష్టి కి ఆమె తీసుకు వచ్చారు. ఒక ఇల్లు అనేది ఉందంటే అప్పుడు పిల్లల విద్య మరియు వివాహం వంటి అనేక అంశాలు సవ్యం గా జరిగిపోతాయి అని ప్రధాన మంత్రి అన్నారు.
ఏక్ రాష్ట్ర ఏక్ రేషన్ కార్డ్, పిఎమ్ గరీబ్ కళ్యాణ్ లతో పాటు మరెన్నో పథకాల లబ్ధిదారు పశ్చిమ త్రిపుర నివాసి శ్రీ పంకజ్ శని మాట్లాడుతూ, జెజెఎమ్, ఒఎన్ఒఆర్ సి, పిఎమ్ఎవై లతో పాటు విద్యుత్తు కనెక్షన్ వంటి అనేక పథకాల ప్రయోజనాల ను అతడు అందుకొన్నట్లు వెల్లడించారు. వన్ నేశన్, వన్ రేషన్ కార్డు వల్ల తాను బిహార్ నుంచి ప్రవాసం వచ్చినప్పటికీ కూడాను ఎటువంటి సమస్యల ను ఎదుర్కోలేదు అని ఆయన తెలియజేశారు.
ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుల లో ఒకరు అయిన కర్నాటక లోని కలబురగి కి చెందిన సంతోషి గారు మాట్లాడుతూ, ఆ పథకం తనకు ఎలా ఉపయోగపడిందీ వివరించారు. హెల్థ్ ఎండ్ వెల్ నెస్ సెంటర్, ఉచిత ఆరోగ్య పరీక్ష లు మరియు మందు లు ఆమె జీవితం లో అనేక మార్పుల ను తీసుకు వస్తున్నట్లు ఆమె తెలిపారు. తనతో మాట్లాడిన తీరు బాగుందని ప్రధాన మంత్రి ఆమె కు అభినందనల ను తెలియజేశారు. మీకు ప్రజాదరణ లభిస్తుంది, మీరు ఎన్నికల లో పోటీ చేయాలి అంటూ ప్రధాన మంత్రి చలోక్తి గా అన్నారు.
గుజరాత్ లోని మెహసాణా వాసి అయిన శ్రీ అరవింద్, పిఎమ్ ముద్ర యోజన లబ్ధిదారుల లో ఒకరు గా ఉన్నారు. ప్రధాన మంత్రి తో మాట్లాడుతున్నందుకు ఆయన సంతోషం తో ఉబ్బితబ్బిబ్బు అయ్యారు. తనకు ఉన్నటువంటి మండపాల అలంకరణ వ్యాపారం ప్రస్తుతం విస్తరణ కు నోచుకొన్నట్లు, డిజిటల్ పేమెంట్ విధానాన్ని తాను వ్యాప్తి లోకి తీసుకు వస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వ పథకాన్ని గురించి ఆయన దగ్గర ఉన్న ఉద్యోగుల కు వివరిస్తున్నందుకు, అలాగే ఉద్యోగాల ను ఇచ్చే వ్యక్తి గా ఎదిగినందుకు ఆయన ను ప్రధాన మంత్రి అభినందించారు. క్రీడల పట్ల ఉత్సాహాన్ని కనబరుస్తున్న ఆయన కుమార్తె కు కూడా ప్రధాన మంత్రి తన ఆశీర్వాదాన్ని ఇచ్చారు.
సమావేశం స్థలం లో, హిమాచల్ ప్రదేశ్ లోని సిర్ మౌర్ కు చెందిన సమా దేవి గారు తాను పిఎమ్ఎవై, పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి, ఆయుష్మాన్ యోజన మరియు సిఎమ్ గృహణి సువిధా యోజన ల లబ్ధిదారు ను అని పరిచయం చేసుకొన్నారు. ఆమె తో వ్యవసాయ కార్యకలాపాల ను గురించి ప్రధాన మంత్రి చర్చించారు.
సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ మహత్తరమైనటువంటి సందర్భం లో తాను హిమాచల్ ప్రదేశ్ కు విచ్చేసినందుకు సంతోషిస్తున్నట్టు వెల్లడించారు. పిఎమ్ కిసాన్ పథకం ద్వారా 10 కోట్ల మంది కి పైగా రైతులు వారి బ్యాంకు ఖాతాల లో డబ్బు ను అందుకోవడం పట్ల ప్రధాన మంత్రి అభినందనల ను తెలియజేస్తూ, రైతుల కు శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి 8 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భం లో పిఎమ్ కేర్స్ ఫార్ చిల్డ్రన్ స్కీము లో భాగం గా ప్రయోజనాల ను విడుదల చేయడం తనకు సంతృప్తి గా ఉంది అని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎమ్-కిసాన్) పథకం కింద ఆర్థిక ప్రయోజనాల ను శిమ్ లా నుంచి దేశవ్యాప్తం గా విడుల చేయడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 130 కోట్ల మంది ప్రజల కు సేవ చేసే అవకాశాన్ని తనకు ఇచ్చినందుకు ప్రజల కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
కరోనా మహమ్మారి వల్ల తల్లి తండ్రుల ను కోల్పోయిన పిల్లల బాధ్యత ను నిన్నటి రోజు న పిఎమ్ కేర్స్ ఫార్ చిల్డ్రన్ ద్వారా స్వీకరించినందుకు కూడా ప్రధాన మంత్రి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భం లో హిమాచల్ ప్రదేశ్ కు తరలి రావాలంటూ తనకు అందిన సూచన ను తాను వెనువెంటనే ఆమోదించినట్లు ఆయన చెప్తూ, దీనికి కారణం ఆ రాష్ట్రం తనకు కర్మ భూమి గా ఉండింది అన్నారు. ప్రధాన మంత్రి తన ను తాను ఎల్లవేళలా ఒక ప్రధాన మంత్రి గా కాక 130 కోట్ల మంది ప్రజల తో కూడిన కుటుంబం లో ఒక సభ్యుని గానే భావిస్తానని పేర్కొన్నారు. ‘‘ఏదైనా ఒక ఫైలు పైన సంతకం పెట్టేటప్పుడు మాత్రమే ప్రధాన మంత్రి బాధ్యత ను స్వీకరిస్తాను అని ఆయన అన్నారు. ఆ క్షణం గడిచీ గడవడం తోనే నేను ఎంతమాత్రం ప్రధాన మంత్రి గా ఉండను, నేను మీ కుటుంబం లో సభ్యుడి ని అయిపోతాను, అలాగే 130 మంది దేశవాసుల కు ఒక ప్రధాన సేవకుడి గా ఉంటాను. నేను దేశాని కి ఏమైనా చేయగలుగుతున్నాను అంటే గనుక అది 130 కోట్ల మంది దేశ ప్రజల ఆశీర్వాదాలు మరియు వారి శుభాకాంక్షల వల్ల’’ అని ఆయన అన్నారు. ‘‘130 కోట్ల మంది పౌరుల తో కూడిన నా కుటుంబం యొక్క ఆశల తో, ఆకాంక్షల తో ముడిపడ్డాను, నాకున్నదల్లా ఈ కుటుంబమే. మీ ప్రజలు అందరు నా జీవనం లో సర్వస్వం, మరి ఈ జీవితం ఉన్నది మీ కోసమే’’ అని ప్రధాన మంత్రి చెప్తూ భావోద్వేగాని కి లోనయ్యారు. ప్రభుత్వం 8 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకొంటూ ఉన్నందున ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం, భారతదేశం లో ప్రతి ఒక్కరి గౌరవం కోసం, భారతదేశం లో అందరి భద్రత కోసం, భారతదేశం లో ప్రతి ఒక్కరి సమృద్ధి కోసం మరియు వారు ఒక సంతోషకరమైనటువంటి జీవనాన్ని అందుకోవడం కోసం, శాంతియుతం గా జీవించడం కోసం తాను చేయగలిగినది ఏదైనా సరే చేస్తాను అనేటటువంటి తన యొక్క సంకల్పాన్ని మరొక్క మారు స్పష్టం చేశారు.
2014వ సంవత్సరం కంటే ముందటి కాలం లో, అవినీతి ని వ్యవస్థ లోని ఒక ముఖ్య భాగం గా ఇదివరకటి ప్రభుత్వం భావించింది, అప్పట్లో అవినీతి పై పోరాడే బదులు దానికి ప్రభుత్వం లొంగిపోయింది, ఆ కాలం లో దేశం పథకాల కోసం ఉద్దేశించిన డబ్బును ఆ సొమ్ము ఆపన్నుల కు చేరే కంటే ముందే లూటీ కి గురి కావడాన్ని చూస్తూ మిగిలిపోయింది అని చెప్తూ ప్రధాన మంత్రి విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం జన్ ధన్-ఆధార్-మరియు మొబైల్ (జెఎఎమ్) త్రయం కారణం గా లబ్ధిదారు లకు చెందిన డబ్బు జన్ ధన్ బ్యాంకు ఖాతాల లో నేరు గా జమ అవుతోంది అని కూడా ఆయన వివరించారు. ఇదివరకు వంట ఇంటి లో పొగ పీల్చుతూ ఇబ్బంది పడవలసిన అగత్యం అంటూ ఉండేది. ఇవాళ ఉజ్జ్వల పథకం ద్వారా ఎల్ పిజి సిలిండర్ లను అందుకొనే సదుపాయం లభించింది. ఇంతకు మునుపు ఆరుబయలు ప్రాంతాల లో మల మూత్రాదుల విసర్జన తాలూకు లజ్జాకరమైన స్థితి ఉండేది. ప్రస్తుతం పేదలు టాయిలెట్ ల సదుపాయాని కి నోచుకొని గౌరవాన్ని పొందారు. ఇంతకు ముందు చికిత్స కోసం డబ్బు అప్పు చేసేందుకు నిస్సహాయ స్థితి ని ఎదుర్కోవలసి వచ్చేది. ప్రస్తుతం ప్రతి పేద వ్యక్తి కి ఆయుష్మాన్ భారత్ యొక్క అండదండ లు లభిస్తున్నాయి. ఇంత క్రితం మూడుసార్లు తలాక్ తాలూకు భయం పీడించేది. ప్రస్తుతం ఒకరి హక్కుల కోసం పోరాడే ధైర్యం చిక్కింది అని ఆయన అన్నారు.
సంక్షేమ పథకాలు, సుపరిపాలన, పేదల సంక్షేమం (సేవ, సుశాసన్ అవుర్ గరీబ్ కల్యాణ్) అనేవి ప్రజల దృష్టి లో ప్రభుత్వం అంటే ఉన్న అర్థాన్ని మార్చివేశాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తోంది. అవి ప్రధాన మంత్రి గృహ నిర్మాణ పథకాలు కావచ్చు, ఉపకార వేతనాలు కావచ్చు లేదా పింఛను పథకాలు కావచ్చు.. సాంకేతిక విజ్ఞానం యొక్క సహాయం తో అవినీతి కి ఉన్న ఆస్కారాన్ని చాలా మేరకు తగ్గించివేయడమైంది అని ఆయన అన్నారు. ఇదివరకు శాశ్వతం గా భావించినటువంటి సమస్యల కు ప్రభుత్వం ఒక శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం కోసం ప్రయత్నిస్తున్నది అని ఆయన అన్నారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిబిటి) 9 కోట్ల నకిలీ పేరుల ను ప్రయోజనాల జాబితా ల నుంచి తొలగించడం ద్వారా చోరీ మరియు దారి మళ్ళింపు ల తాలూకు అన్యాయాని కి స్వస్తి పలికింది అని ఆయన అన్నారు.
పేద వ్యక్తి కి సాధికారిత ను కల్పించినప్పుడు, పేదల రోజువారీ సంఘర్షణ తగ్గినప్పుడు, అప్పుడు ఆ వ్యక్తి తన పేదరికాన్ని దూరం చేసుకోవడాని కి ఒక కొత్త శక్తి ని పుంజుకొంటారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ విధమైన ఆలోచన సరళి తో, మా ప్రభుత్వం ఒకటో రోజు నుంచే పేదల కు సాధికారిత ను అందించడాన్ని మొదలు పెట్టింది. మేం ఆ వ్యక్తి యొక్క జీవనం లో ప్రతి బాధ ను తగ్గించేందుకు ప్రయత్నించాం అని ఆయన అన్నారు. ‘‘దేశం లో దాదాపు గా ప్రతి ఒక్క కుటుంబం ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి ని పొందుతోంది అని నేను చెప్పగలను’’ అని ఆయన అన్నారు.
హిమాచల్ ప్రదేశ్ లోని ప్రతి ఒక్క కుటుంబం సాయుధ బలగాల కు తోడ్పాటు ను అందిస్తోంది అని ప్రధాన మంత్రి అంటూ, నాలుగు దశాబ్దాల నిరీక్షణ అనంతరం ‘వన్ ర్యాంక్, వన్ పెన్షన్’ ను అమలు చేసింది ఈ ప్రభుత్వమే. పూర్వ సైనికోద్యోగుల కు బకాయిల ను కూడా ఇచ్చింది అని ఆయన అన్నారు. లోని ప్రతి ఒక్క కుటుంబం ఎంతగానో లబ్ధి ని పొందింది. వోట్ బ్యాంకు రాజకీయాలు మన దేశం లో దశాబ్దాల తరబడి సాగాయి. మరి దేశాని కి అవి ఎంతో నష్టాన్ని తెచ్చిపెట్టాయి అని ఆయన అన్నారు. మేం ఒక వోట్ బ్యాంకు ను కాక ఒక న్యూ ఇండియా ను నిర్మించడం కోసం పని చేస్తున్నాం అని ఆయన అన్నారు.
వంద శాతం లబ్ధి ని లబ్ధిదారుల లో ప్రతి ఒక్కరి కి చేకూర్చాలి అని మేం చొరవ ను తీసుకొన్నాం అని ప్రధాన మంత్రి చెప్పారు. లబ్ధిదారులు గా అందరూ ఉండాలి అని ప్రభుత్వం ఒక ప్రతిజ్ఞ ను స్వీకరించింది అని ఆయన అన్నారు. 100 శాతం సాధికారిత అంటే దాని అర్థం భేద భావాన్ని సమాప్తి చేయడం, సిఫారసుల ను తొలగించడం, తృప్తి పరచే వైఖరి కి స్వస్తి పలకడం అని ప్రధాన మంత్రి అన్నారు. 100 శాతం సాధికారిత అంటే దాని అర్థం ప్రతి పేద వ్యక్తి ప్రభుత్వ పథకాల తాలూకు ప్రయోజనాల ను పూర్తి గా అందుకోవడం అని ఆయన వివరించారు.
వృద్ధి చెందుతున్న దేశం యొక్క స్థాయి ని గురించి ప్రధాన మంత్రి వ్యాఖ్యానిస్తూ, ఇవాళ భారతదేశం తప్పనిసరి అయ్యి స్నేహ హస్తాన్ని చాచడం లేదు గాని సాయం అందిస్తాం అంటూ తన చేతి ని ముందుకు చాచుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. కరోనా కాలం లో సైతం, మనం మందుల ను, టీకా మందుల ను 150 కి పైగా దేశాల కు పంపించాం అని ఆయన వివరించారు.
రాబోయే తరాల కు ఉజ్వల భవిష్యత్తు కోసం, 21వ శతాబ్ది కి చెందిన ఉజ్జ్వల భారతదేశం కోసం కృషి చేయవలసిన అవసరం ఉంది అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ఏ భారతదేశం అంటే దాని యొక్క గుర్తింపు కొరత కాక ఆధునికత అయి ఉండేటటువంటిది. మన సామర్ధ్యం ఎదుట ఏ లక్ష్యం అయినప్పటికీ అది అసాధ్యం కానేకాదు అని ఆయన అన్నారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచం లో అత్యంత వేగం గా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల లో ఒకటి అని కూడా ఆయన అన్నారు. రెకార్డు స్థాయి విదేశీ పెట్టుబడులు ఇవాళ భారతదేశాని కి తరలి వస్తున్నాయి, ఇవాళ భారతదేశం ఎగుమతుల లో రెకార్డుల ను సృష్టిస్తోంది అని ఆయన చెప్పారు. ‘‘అందరూ ముందడుగు వేసి మరి మన దేశం యొక్క ప్రగతి యాత్ర లో మన వంతు పాత్ర ను పోషించాలి’’ అని చెప్తూ, ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
***
DS/AK
(Release ID: 1829782)
Visitor Counter : 241
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam