ప్రధాన మంత్రి కార్యాలయం
మే 31వ తేదీ నాడు శిమ్ లా ను సందర్శించనున్న ప్రధాన మంత్రి; ‘గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్’ లో ఆయన పాలుపంచుకొంటారు
మోదీ ప్రభుత్వాని కి ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భం లో దేశం అంతటాగరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ ను నిర్వహించడం జరుగుతున్నది
దీని లో భాగం గా దేశవ్యాప్తం గా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రజల తో నేరు గామాట్లాడుతారు
తొమ్మిది కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాల యొక్క కార్యక్రమాల లబ్ధిదారుల తోప్రధాన మంత్రి మాట్లాడుతారు
పిఎమ్-కిసాన్ యొక్క 11వ కిస్తీ ని కూడా ప్రధాన మంత్రి విడుదల చేస్తారు
Posted On:
30 MAY 2022 12:29PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 మే 31వ తేదీ నాడు హిమాచల్ ప్రదేశ్ లోని శిమ్ లా ను సందర్శించనున్నారు. ఇంచుమించు ఉదయం 11 గంటల కు, ప్రధాన మంత్రి ‘గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్’ లో పాలుపంచుకొంటారు. ప్రధాన మంత్రి నాయకత్వం లో ప్రభుత్వాని కి ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయినందుకు గుర్తు గా ఈ వినూత్నమైనటువంటి సార్వజనిక కార్యక్రమాన్ని దేశవ్యాప్తం గా రాష్ట్ర రాజధానుల లో, జిల్లా ముఖ్య పట్టణాల లో మరియు కృషి విజ్ఞాన కేంద్రాల లో నిర్వహించడం జరుగుతున్నది. ఈ సమ్మేళనం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ను గురించి ప్రజల అభిప్రాయాల ను తెలుసుకొనేందుకు ప్రయత్నించడం లో భాగం గా దేశం అంతటా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రజల తో ప్రత్యక్షం గా కలుసుకొనే అవకాశాన్ని కల్పిస్తోంది.
‘గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్’ ఉదయం సుమారు 9 గంటల 45 నిమిషాల కు ఆరంభం అవుతుంది. దీనిలో ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, విధాన సభ సభ్యులు, ఇంకా ఇతర ఎన్నికైన ప్రజా పతినిధులు దేశం అంతటా తమ తమ స్థానాల లో ప్రజల తో నేరు గా మాట్లాడనున్నారు. 11 గంటల వేళ కు ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో పాల్గొంటారు. రాష్ట్ర స్థాయి లో, స్థానిక స్థాయి లో వివిధ కార్యక్రమాల ను గురించి ప్రస్తావించడం ద్వారా సమ్మేళనాని కి జాతీయ స్థాయి ని సంతరించడం జరుగుతుంది. సమ్మేళనం సాగే క్రమం లో ప్రధాన మంత్రి భారత ప్రభుత్వం యొక్క తొమ్మొది మంత్రిత్వ శాఖలు/, విభాగాలకు చెందిన వివిధ కార్యక్రమాల లబ్ధిదారుల తో ముఖాముఖి మాట్లాడుతారు.
దేశవ్యాప్తం గా నిర్వహించే అరమరికలు లేనటువంటి ఈ సంవాదం యొక్క ఉద్దేశ్యం ప్రజల తో స్వతంత్రమైనటువంటి మరియు నిర్మొహమాటమైనటువంటి ప్రతిస్పందన ను రాబట్టుకోవడం, ప్రజల జీవనం లో సంక్షేమ పథకాల ప్రభావాన్ని అర్థం చేసుకోవడమూ, వివిధ ప్రభుత్వ కార్యక్రమాల ను కలిపివేయడం మరియు ఆయా కార్యక్రమాల ఫలితాలు అందరికీ అందుతున్నదీ, లేనిదీ తెలుసుకోవడమూ ను. దేశ పౌరుల జీవన సౌలభ్యాన్ని మెరుగు పరచడం కోసం ప్రభుత్వ కార్యక్రమాల వ్యాప్తి ని మరియు పంపిణీ ని మరింత సమర్ధం గా అమలు అయ్యేటట్లు చూడడం అన్నది దీని లోని ప్రయాస గా ఉంది.
ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎమ్-కిసాన్) పథకం లో భాగం గా ఆర్థిక లబ్ధఇ తాలూకు పదకొండో కిస్తీ ని కూడా విడుదల చేయనున్నారు. దీనితో 10 కోట్ల మంది కి పైగా లబ్ధిదారు రైతు కుటుంబాల కు దాదాపు గా 21,000 కోట్ల రూపాయల రాశి బదిలీ కి మార్గం సుగమం కానుంది. ఈ సందర్భం లో, ప్రధాన మంత్రి దేశవ్యాప్తం గా ఉన్నటువంటి (పిఎమ్-కిసాన్) లబ్ధిదారుల తో మాట్లాడనున్నారు.
***
(Release ID: 1829487)
Visitor Counter : 187
Read this release in:
Marathi
,
Tamil
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam