ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఐఎస్ బి హైదరాబాద్ లో జరిగిన పిజిపి క్లాస్ గ్రాడ్యుయేశన్ సెరిమని నిఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి


దేశ ఆర్థిక రంగంలో, వ్యాపార రంగం లో ఐఎస్ బి విద్యార్థులకు ఉన్న పాత్ర ను ఆయనగుర్తించారు

‘‘భారతదేశం వ్యాపారాని కి పెద్ద పీట ను వేస్తోంది అని ప్రస్తుతం ప్రపంచంగ్రహిస్తున్నది’’

‘‘మీరు మీ యొక్క వ్యక్తిగత లక్ష్యాల ను, దేశం యొక్క లక్ష్యాల తో జోడించవలసిందిఅంటూ మీకు నేను సూచన చేయదలచుకొన్నాను’’

‘‘గడచిన మూడు దశాబ్దాలు గా రాజకీయ అస్థిరత్వం కొనసాగుతూ వచ్చినందువల్ల, దేశంలో రాజకీయ ఇచ్ఛాశక్తి లోపించింది; మరి దేశం సంస్కరణల కు, ప్రధాన నిర్ణయాల కు దూరం గాఉండిపోయింది’’

‘‘ప్రస్తుతం వ్యవస్థ లో ప్రభుత్వం సంస్కరణ లను తీసుకువస్తోంది, అధికారి వర్గం పనిచేస్తోంది మరియు ప్రజల భాగస్వామ్యంఒక మార్పున కు దారి తీస్తున్నది’’

‘‘భారతదేశాన్ని భవిష్యత్తు కాలం కోసం సిద్ధం గా ఉంచాలిఅంటే భారతదేశాన్ని ఆత్మనిర్భరత కలిగివుండేటట్టు గా మనం మలచాలి;  వ్యాపార రంగం లోవృత్తి నిపుణులు అయిన మీకు అందరికీ దీనిలో ఓ పెద్ద పాత్రంటూ ఉంది మరి’’

Posted On: 26 MAY 2022 3:41PM by PIB Hyderabad

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి), హైదరాబాద్ కు 20 సంవత్సరాల కాలం పూర్తి అయిన సందర్భం లో ఏర్పాటైన ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. 2022వ సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (పిజిపి) క్లాస్ యొక్క గ్రాడ్యుయేశన్ సెరిమని ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ముందుగా ఈ విద్య సంస్థ కు దీని వర్తమాన గౌరవాని కి అర్హమైందిగా మలచడం లో తోడ్పాటు ను అందించిన వారందరికి నమస్సుల ను అర్పించారు. పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ ఈ సంస్థ ను 2001వ సంవత్సరం లో దేశాని కి అంకితం చేశారు అని ఆయన గుర్తు కు తీసుకు వచ్చారు. అప్పటి నుంచి చూస్తే, ఐఎస్ బి నుంచి 50,000 మంది కి పైగా ఎగ్జిక్యూటివ్ లు ఉత్తీర్ణులు అయ్యారు. ప్రస్తుతం ఆసియా లోని అగ్రగామి బిజినెస్ స్కూల్స్ లో ఐఎస్ బి స్థానాన్ని సంపాదించుకొంది. ఐఎస్ బి నుంచి ఉత్తీర్ణత పొందిన వృత్తి నిపుణులు అగ్ర కంపెనీల లో నాయకత్వ స్థానాల లో ఉంటూ, మరి దేశ వ్యాపారాని కి ఒక వేగ గతి ని అందిస్తున్నారు. ఇక్కడ నుంచి వచ్చిన విద్యార్థులు వందల కొద్దీ స్టార్ట్-అప్స్ ను ఏర్పాటు చేశారు. యూనికార్న్ స్ ను సృష్టించడం లో వారు ఒక పాత్ర ను పోషించారు. ‘‘ఇది ఐఎస్ బి కార్యసాధనల లో ఒకటి. మరి అంతే కాకుండా ఇది యావత్తు దేశాని కి గర్వకారణం గా నిలిచింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రస్తుతం భారతదేశం జి20 దేశాల సమూహం లో అత్యంత వేగం గా వృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. స్మార్ట్ ఫోన్ డేటా కన్సూమర్ స్ విషయాని కి వస్తే భారతదేశం ఒకటో స్థానం లో ఉంది. ఇంటర్ నెట్ ను వినియోగించే వ్యక్తుల సంఖ్య ను మనం పరిశీలించామంటే గనక భారతదేశం ప్రపంచం లో కెల్లా రెండో స్థానం లో ఉంది అని ఆయన అన్నారు. గ్లోబల్ రిటైల్ ఇండెక్స్ లో భారతదేశం ప్రపంచం లో రెండో స్థానం లో నిలిచింది అని ఆయన చెప్పారు. ప్రపంచం లో కెల్లా మూడో అతి పెద్ద స్టార్ట్-అప్ ఇకోసిస్టమ్ భారతదేశం లో ఉంది. ప్రపంచం లో మూడో అతి పెద్ద వినియోగదారుల బజారు భారతదేశం లో ఉంది. భారతదేశం ప్రస్తుతం వృద్ధి పరం గా ఒక ప్రధానమైన కేంద్రం గా తెర మీద కు వస్తున్నది. కిందటి సంవత్సరం లో, అత్యధిక స్థాయి లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్ డిఐ) భారతదేశాని కి తరలివచ్చింది. ప్రస్తుతం భారతదేశం వ్యాపారాని కి పెద్ద పీట ను వేస్తోంది అనే విషయాన్ని ప్రపంచం అర్థం చేసుకొంటోంది అని ఆయన అన్నారు.

తరచు గా భారతదేశం కనుగొన్న పరిష్కారాల ను ప్రపంచం అంతటా అమలుపరచడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి చెప్పారు. ‘‘ఈ కారణం గా ముఖ్యమైనటువంటి ఈ రోజు న, నేను మిమ్మల్ని ఒకటి కోరదలచాను.. మీ యొక్క వ్యక్తిగత లక్ష్యాల ను దేశం యొక్క లక్ష్యాల తో జోడించుకోండి’’ అని ఆయన అన్నారు.

సంస్కరణ ల ఆవశ్యకత అనేది దేశం లో ఎప్పటికీ ఉండింది. అయితే, లేనిదల్లా రాజకీయ సంకల్ప శక్తి అని ప్రధాన మంత్రి అన్నారు. గడచిన మూడు దశాబ్దాల లో రాజకీయ అస్థిరత్వం అదే పని గా ఏర్పడుతూ వచ్చినందువల్ల దేశం లో చాలా కాలం పాటు రాజకీయ ఇచ్ఛాశక్తి లో లోపం అగుపించింది. ఈ కారణం గా దేశం సంస్కరణ ల జోలి కి పోలేదు, పెద్ద నిర్ణయాల ను తీసుకోవడాని కి దూరం గా ఉండిపోయింది. 2014వ సంవత్సరం నుంచి, మన దేశం రాజకీయ సంకల్పాన్ని గమనిస్తూ వస్తోంది. అంతేకాదు, సంస్కరణల ను అదేపని గా చేపట్టడం జరుగుతోంది. ఎప్పుడైతే సంస్కరణల ను దృఢ దీక్ష తో, రాజకీయ శక్తి తో చేపట్టడం జరిగిందో అప్పుడు ప్రజల సమర్థన ఖాయం గా లభిస్తుంది అని ఆయన అన్నారు. డిజిటల్ పేమెంట్స్ ను ప్రజలు అనుసరిస్తూ ఉండడం దీనికి ఒక ఉదాహరణ గా ఉంది అని ఆయన చెప్పారు.

మహమ్మారి కాలం లో ఆరోగ్య రంగం యొక్క బలం, ఆటుపోటుల ను ఎదుర్కొనే శక్తి నిరూపణ అయింది అని ప్రధాన మంత్రి అన్నారు. కోవిడ్ టీకామందుల ను గురించి ఆయన ప్రస్తావించి, విదేశీ వేక్సీన్స్ అందుబాటు లోకి వస్తాయో, రావో అనేటటువంటి ఆందోళనలు ఇక్కడ రేకెత్తసాగాయి. అయితే, భారతదేశం తన సొంత టీకామందుల ను అభివృద్ధి పరచింది. భారతదేశం లో చాలా వేక్సీన్ లను సిద్ధం చేయడం జరిగింది. 190 కోట్ల కు పైగా డోజు లను ప్రజల కు ఇప్పించడం జరిగింది. భారతదేశం ప్రపంచం లో 100 కు పైగా దేశాల కు వేక్సీన్ లను పంపించింది కూడా అని ఆయన అన్నారు. వైద్య విద్య యొక్క విస్తరణ ను గురించి సైతం ప్రధాన మంత్రి వివరించారు.

సంస్కరణ ప్రక్రియ లో అధికారి వర్గం మొక్కవోని తోడ్పాటుల ను అందించింది అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రభుత్వ పథకం సఫలం అయింది అంటే ఆ ఖ్యాతి ప్రజల భాగస్వామ్యానిది అని ఆయన చెప్పారు. ప్రజలు సహకరించారా అంటే అప్పుడు తక్షణ ఫలితాలు, ఉత్తమ ఫలితాలు తప్పక ఒనగూరుతాయి అని ఆయన అన్నారు. ఇప్పుడున్న వ్యవస్థ లో, ప్రభుత్వం సంస్కరణల ను తీసుకువస్తోంది, అధికారి వర్గం ఆచరణ లోకి తీసుకు వస్తోంది మరి ప్రజల భాగస్వామ్యం పరివర్తన కు దారి తీస్తున్నది అని ఆయన అన్నారు. సంస్కరించడం, అమలుపరచడం, మార్పు ను తీసుకు రావడం అనేటటువంటి ఈ యొక్క విధానాన్ని అధ్యయనం చేయండంటూ ఐఎస్ బి విద్యార్థుల కు ఆయన సూచించారు.

2014వ సంవత్సరం తరువాత కాలం లో ప్రతి ఒక్క క్రీడ లో మనం గొప్ప ప్రదర్శన ను గమనిస్తున్నాం అంటే దాని కి అతి పెద్ద కారణం మన క్రీడాకారుల లో ఏర్పడిన ఆత్మవిశ్వాసం అని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. సరి అయిన ప్రతిభ ను కనుగొనడం జరిగింది అంటే ప్రతిభ కు సరి అయిన అవకాశాల ను కల్పించడం జరిగింది అంటే, మరి ఎంపిక పారదర్శకం గా జరిగిందా అంటే అప్పుడు, శిక్షణ కు, పోటీపడడానికి మెరుగైన వసతి సదుపాయాలు అమరాయా అంటే అప్పుడు అప్పుడు విశ్వాసం అంకురిస్తుంది అని ఆయన వివరించారు. ఖేలో ఇండియా మరియు టాప్స్ (TOPS) స్కీము ల వంటి సంస్కరణ ల కారణం గా క్రీడల లో చోటు చేసుకొన్న మార్పు మన కళ్ళెదుట కనిపిస్తూనే ఉంది అని ఆయన అన్నారు. అదే విధం గా మహత్వాకాంక్ష భరిత జిల్లాల కార్యక్రమం అనేది పనితీరు కు, విలువ జోడింపున కు, ఉత్పాదకత కు, అలాగే సార్వజనిక విధాన రంగం లో ప్రేరణ కు ఒక గొప్ప ఉదాహరణ గా నిలచింది అని ఆయన అన్నారు.

 

దేశం లో వ్యాపార రంగం లో పరిస్థితులు అంతకంతకు మార్పు నకు లోనవుతున్నాయి అనే అంశాన్ని గురించి ప్రధాన మంత్రి వ్యాఖ్యానిస్తూ, సంఘటిత, అసంఘటిత, చిన్న, పెద్ద వ్యాపారాలు వాటి వాటి పరిధుల ను విస్తరించుకొంటున్నాయి. దీని ద్వారా లక్షల, కోట్ల మంది కి ఉపాధి లభిస్తోంది అన్నారు. చిన్న వ్యాపారాలు వృద్ధి చెందడాని కి మరిన్ని అవకాశాల ను ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన స్పష్టం చేశారు. ఆ వ్యాపారాలు స్థానికం గాను, ప్రపంచ స్థాయి లోను కొత్త కొత్త బజారు లతో జత కలిసేటట్లుగా వాటికి సాయపడాలి అని ఆయన అన్నారు. ఆ వ్యాపారాల లో ఉన్న అపారమైన అవకాశాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి, భారతదేశాన్ని రాబోయే కాలాని కి తగినట్లు సిద్ధం చేయాలి అంటే గనక అందుకోసం మనం భారతదేశం ఆత్మనిర్భరత ను సాధించేటట్లు గా చూడాలి అని నొక్కిచెప్పారు. ఐఎస్ బి వంటి సంస్థల విద్యార్థుల కు దీనిలో ఒక గొప్ప పాత్ర ఉంటుంది అని ఆయన అన్నారు. ‘‘వ్యాపార రంగం లో వృత్తి నిపుణులు అయిన మీకందరికీ దీని లో ఒక ప్రధానమైన పాత్రంటూ ఉంది. మరి ఇది మీరు దేశాని కి సేవ చేసేందుకు ఒక గొప్ప అవకాశం కాగలదు’’ అని చెప్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

 


<

***

DS/AK


(Release ID: 1828529) Visitor Counter : 276