ఆయుష్

మైసూర్ లో జరగనున్న 8వ అంతర్జాతీయ యోగ దినోత్సవం ప్రధానమంత్రి నాయకత్వంలో సామూహిక యోగ ప్రదర్శనాలు

Posted On: 23 MAY 2022 4:39PM by PIB Hyderabad

8వ అంతర్జాతీయ యోగ దినోత్సవం ప్రధాన కార్యక్రమం 2022 జూన్ 22 న కర్ణాటక లోని మైసూర్ లో జరుగుతుందని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్భానంద్ సోనోవాల్ ఈరోజు ప్రకటించారు. అంతర్జాతీయ యోగ దినోత్సవంలో భాగంగా సామూహిక యోగ ప్రదర్శనలను ( ప్రధాన కార్యక్రమం ) మైసూర్ లో నిర్వహించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు.

" ఆజాది కా అమృత్ మహోత్సవ " కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్బంగా ఈరోజు ఏడాది దేశంలో ఎంపిక చేసిన 75 ప్రాంతాల్లో అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తామని మంత్రి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి గుర్తింపు లభించేలా కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు.

ఈరోజు మీడియా ప్రతినిధులతో మాట్లాడిన శ్రీ సోనోవాల్ ఈఏడాది సామూహిక యోగ ప్రదర్శనలతో పాటు ' గార్డియన్ రింగ్ ' కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు.'గార్డియన్ రింగ్' లో విదేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాల్లో జరిగే యోగ కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేస్తామని అన్నారు. సూర్యుడు ఉదయించే దేశమైన జపాన్ నుంచి స్థానిక కాలమానం   ఉదయం 6 గంటలకు ప్రసారాలు ప్రారంభించాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు.

అంతర్జాతీయ యోగ దినోత్సవం జరిగేంత వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతాయని శ్రీ సోనోవాల్ వివరించారు. దీనిలో భాగంగా హైదరాబాద్ లో మే 27 న ప్రత్యేక సన్నాహక కార్యక్రమం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ లో జరిగే కార్యక్రమంలో దాదాపు పది వేల మంది పాల్గొని యోగ చేస్తారని చెప్పారు.

కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్, కేంద్ర మంత్రులు, సినీ తారలు, క్రీడాకారులు, ప్రముఖ యోగా గురువులు, యోగా నిపుణులు, యోగాతో సంబంధం ఉన్న రంగాలకు చెందిన ప్రతినిధులు, స్థానిక యోగ సంస్థలు, ప్రజలు పాల్గొంటారని మంత్రి వివరించారు. ఇంతకుముందు శివదోల్ (50 వ కౌంట్ డౌన్ కార్యక్రమం మే 2 న ), ఎర్రకోట (75 వ కౌంట్ డౌన్ కార్యక్రమం ఏప్రిల్ 7 న ) లలో భారీ ఎత్తున సన్నాహక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.

***



(Release ID: 1827820) Visitor Counter : 134