ప్రధాన మంత్రి కార్యాలయం
ఫాస్ట్ రిటైలింగ్ కంపెనీ లిమిటెడ్ యొక్క చైర్ మన్, ప్రెసిడెంట్ మరియు సిఇఒ శ్రీ తదాశీ యానాయి తో సమావేశమైనప్రధాన మంత్రి
Posted On:
23 MAY 2022 12:14PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యూనీక్లో కు మాతృ సంస్థ అయినటువంటి ఫాస్ట్ రిటేలింగ్ కంపెనీ లిమిటెడ్ చైర్ మన్, ప్రెసిడెంట్ మరియు సిఇఒ శ్రీ తదాశీ యానాయి తో టోక్యో లో ఈ రోజు న సమావేశమయ్యారు. ఈ సమావేశం లో వారు భారతదేశం లో శరవేగం గా వృద్ధి చెందుతున్న వస్త్రాల మరియు దుస్తుల బజారు మరియు భారతదేశం లో టెక్స్ టైల్ ప్రాజెక్టు ల కోసం తీసుకు వచ్చినటువంటి ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహకం (పిఎల్ఐ) పథకం లో భాగం గా అందివస్తున్న పెట్టుబడి అవకాశాల పై చర్చించారు. వారు పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పన్నుల విధానం మరియు శ్రమబలం రంగాలు సహా భారతదేశం లో విదేశీ పెట్టుబడిదారుల కు వ్యాపారాన్ని చేయడం లో సౌలభ్యాని కి సంబంధించినటువంటి వివిధ సంస్కరణల ను గురించి కూడా చర్చించారు.
వస్త్రాల ఉత్పత్తి కి ఒక ప్రముఖ కేంద్రం గా మారాలని భారతదేశం తలపెట్టిన యాత్ర లో, మరీ ముఖ్యం గా టెక్స్ టైల్ మేన్యుఫాక్చరింగ్ లో సాంకేతిక విజ్ఞానం ఉపయోగం లో యూనీక్లో మరింత ఎక్కువ భాగస్వామ్యాన్ని వహించాలి అంటూ ప్రధాన మంత్రి ఆహ్వానం పలికారు. వస్త్ర రంగాన్ని మరింత గా పటిష్ట పరచడం లక్ష్యం గా ప్రారంభించినటువంటి పిఎమ్-మిత్ర పథకం లో కూడాను పాలుపంచుకోవలసింది గా కూడాను యూనీక్లో ను ప్రధాన మంత్రి ఆహ్వానించారు.
***
(Release ID: 1827777)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam