ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నేపాల్ లోని లుంబినికి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప‌ర్య‌ట‌న‌( మే 16,2022)

Posted On: 16 MAY 2022 6:09PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, 2022 మే 16న నేపాల్ లోని లుంబినికి అధికారిక ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు. నేపాల్ ప్ర‌ధాన‌మంత్రి రైట్ హాన‌ర‌బుల్ షేర్ బ‌హ‌దూర‌ర‌ర్ దేవ్‌బా ఆహ్వానం మేర‌కు బుద్ధ‌పూర్ణిమ ప‌ర్వ‌దినాన ప్ర‌ధాన‌మంత్రి ఈ ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు. ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీ నేపాల్ లో ప‌ర్య‌టించ‌డం ఇది ఐదో సారి కాగా. లుంబినికి వెళ్ల‌డం ఇది మొద‌టి సారి.
ప్ర‌ధాన‌మంత్రి నేపాల్‌కు చేరుకోగానే ఆయ‌న‌కు ప్ర‌ధాన‌మంత్రి దేవ్ బా, ఆయ‌న స‌తీమ‌ణి డాక్ట‌ర్ అర్జు రాణా దేవ్‌బా, ఆ దేశ హోంశాఖ మంత్రి శ్రీ‌ బాల‌కృష్ణ ఖండ్‌, విదేశీ వ్య‌వహారాల శాఖ మంత్రి డాక్ట‌ర్ నారాయ‌ణ్ ఖ‌డ‌క్‌, మౌలిక స‌దుపాయాలు, ర‌వాణా శాఖ మంత్రి కుమారి రేణు కుమారి యాద‌వ్‌, ఇంధ‌నం, జ‌ల‌వ‌న‌రులు, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కుమారి పంపా భుషాల్‌, సాంస్కృతిక‌,పౌర‌విమాన‌యాన శాఖ మంత్రి  శ్రీ‌ప్రేమ్ బ‌హ‌దూర్ అలె, విద్యాశాఖ మంత్రి శ్రీ‌దేవేంద్ర పౌడెల్‌, న్యాయ‌, పార్ల‌మెంట‌రీ వ్య‌వహారాల శాఖ మంత్రి శ్రీ గోవింద ప్ర‌సాద్ శ‌ర్మ‌, లుంబిని ప్రావిన్స్ ముఖ్య‌మంత్రి శ్రీ కుల్ ప్ర‌సాద్ కెసి త‌దిత‌రులు  హృద‌య‌పూర్వ‌క స్వాగ‌తం ప‌లికారు.

నేపాల్ చేరుకున్న అనంత‌రం ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, మాయాదేవి ఆల‌యాన్ని ద‌ర్శించారు. ఇక్క‌డే బుద్ధ ప‌ర‌మాత్మ జ‌న్మించిన ప్ర‌దేశం ఉంది. ఈ ఆల‌యంలో బౌద్ధ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రిగిన ప్రార్థ‌న కార్య‌క్ర‌మాల‌లో ప్ర‌ధానమంత్రి పాల్గొని కానుక‌ల స‌మ‌ర్పించారు.ప్ర‌ధాన‌మంత్రి అక్క‌డ దీపాలు వెలిగించారు. చారిత్ర‌క అశోక స్థంభాల‌ను ద‌ర్శించారు. లుంబిని గౌత‌మ బుద్ధుడి జ‌న్మ‌స్థ‌ల‌మ‌ని తెలిపే తొలి శిలాశాస‌నం ఇక్క‌డే ల‌భించింది. 2014 లో నేపాల్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి ఇక్క‌డికి తీసుకువ‌చ్చిన ప‌విత్ర‌ బోధి వృక్షానికి  నీరు పోశారు.

న్యూఢిల్లీలోని ఇంట‌ర్నేష‌న‌ల్ బుద్ధిస్ట్ కాన్ఫెడ‌రేష‌న్ (ఐబిసి)కి లుంబినిలోగ‌ల స్థ‌లంలో ఇండియా ఇంట‌ర్నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ బుద్ధిస్ట్ క‌ల్చ‌ర్‌, హెరిటేజ్ నిర్మాణానికి సంబంధించి నిర్వ‌హించిన శిలాన్యాస్ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్రమోదీ, నేపాల్ ప్ర‌ధాన‌మంత్రి దేవ్‌బా పాల్గొన్నారు.
2021 న‌వంబ‌ర్ లో లుంబిని డ‌వ‌ల‌ప్‌మెంట్ ట్ర‌స్ట్ ఐబిసికి కేటాయించింది. శిలాన్యాస్  కార్య‌క్ర‌మం అనంత‌రం, ప్ర‌ధానమంత్రి న‌మూనా బౌద్ధ కేంద్రాన్ని ఆవిష్క‌రించారు. ఇది నెట్ జీరో కాంప్లియంట్ క‌ల ప్ర‌పంచ శ్రేణి స‌దుపాయాలతో కూడిన ప్రార్థ‌న హాళ్ళు, మెడిటేష‌న్ సెంట‌ర్‌, లైబ్ర‌రీ, ఎగ్జిబిష‌న్ హాలు, కెఫ‌టేరియా, ఇత‌ర స‌దుపాయాలు క‌లిగి  ఉంటుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌ర‌లివ‌చ్చే  బౌద్ధ ప‌ర్యాట‌కులు,యాత్రికులు దీనిని సంద‌ర్శించ‌వ‌చ్చు.

 ఇరు దేశాల ప్ర‌ధాన‌మ‌మంత్రులు ద్వైపాక్షిక స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారు ఏప్రిల్ 2 న   న్యూఢిల్లీలో జ‌రిగిన‌ చ‌ర్చ‌ల‌కు కొన‌సాగింపుగా ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. వివిధ రంగాల‌లో స‌హ‌కారాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు వారు ప‌లు ప్ర‌త్యేక చొర‌వ‌ల గురించి చ‌ర్చించారు. ఇందులో సాంస్కృతిక‌, ఆర్ధిక‌, వాణిజ్య‌, అనుసంధాన‌త‌, ఇంధ‌నం, అభివృద్ధి భాగ‌స్వామ్యం త‌దిత‌ర అంశాలు ఉన్నాయి.
లుంబిని, కుషిన‌గ‌ర్ మ‌ధ్య సిస్ట‌ర్ సిటీ రిలేష‌న్స్ ఏర్ప‌ర‌చుకునేందుకు సూత్ర‌ప్రాయంగా ఇరువురు నాయ‌కులు అంగీక‌రించారు. ఈ న‌గ‌రాలు బౌద్ధానికి సంబంధించిన ప‌ర‌మ ప‌విత్ర ప్ర‌దేశాలు. ఇది ఇరుదేశాల మ‌ద్య బౌద్ధ వార‌స‌త్వానికి ద‌ర్ఫ‌ణం ప‌డుతుంది.

ఇరువురు ప్ర‌ధానంత్రులు ఇటీవ‌లి కాలంలో ద్వైపాక్షిక విద్యుత్ రంగ స‌హ‌కారంలో పురోగ‌తిపై సంతృప్తి వ్య‌క్తం చేశారు. ఇది విద్యుత్ ఉత్ప‌త్తి ప్రాజెక్టులు, విద్యుత్ స‌ర‌ఫ‌రా మౌలిక స‌దుపాయాలు,విద్యుత్ వాణిజ్యం త‌దిత‌రాల‌కు సంబంధించిన‌ది. నేపాల్ లో వెస్ట్ సేతి జ‌ల విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధ‌ఙ‌ని చేప‌ట్ట‌వ‌ల‌సిందిగా భార‌తీయ కంపెనీల‌ను నేపాల్ ప్ర‌ధాన‌మంత్రి దేవ్ బా ఆహ్వానించారు. నేపాల్ జ‌ల‌విద్యుత్ ఉత్ప‌త్తి అభివృద్ది విష‌యంలో భార‌త‌దేశం మ‌ద్ద‌తు నిస్తుంద‌ని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఈ దిశ‌గా కొత్త ప్రాజెక్టుల అవ‌కాశాల‌ను అన్వేషించాల్సిందిగా ఆస‌క్తిక‌ల భార‌తీయ డ‌వ‌ల‌ప‌ర్ల‌ను ప్రోత్స‌హిస్తామ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. విద్య‌, సాంస్కృతికంగా ఇచ్చిపుచ్చుకునేందుకు వీలుగా ఇరుదేశాల ప్ర‌జ‌ల‌ను మ‌రింత స‌న్నిహితం చేసేందుకు ఇరువురు ప్ర‌ధాన‌మంత్రులు అంగీక‌రించారు. ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గౌర‌వార్ధం, నేపాల్ ప్ర‌ధాన‌మంత్రి దేవ్ బా విందు ఇచ్చారు.

2566 వ‌ బుద్ధ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌లో ఇరువురు ప్రధాన‌మంత్రులు పాల్గొన్నారు. దీనిని నేపాల్ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో లుంబిని డ‌వ‌ల‌ప్‌మెంట్ ట్ర‌స్ట్ ఏర్పాటు చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన‌మంత్రి , పెద్ద సంఖ్య‌లో హాజ‌రైన బౌద్ధ స‌న్యాసులు,అధికారులు, బౌద్ధ‌ప్ర‌పంచంతో సంబంధాలు క‌లిగిన ప్ర‌ముఖుల‌నుద్దేశించి ప్ర‌సంగించారు.

2022 ఏప్రిల్ 1 నుంచి 3 వ‌ర‌కు నేపాల్ ప్ర‌ధాన‌మంత్రి దేవ్ బా ఢిల్లీ , వార‌ణాశిలో విజ‌య‌వంతంగా ప‌ర్య‌టించిన అనంత‌రం ఇప్పుడు ప్ర‌ధాన‌మంత్రి మ‌రోసారి నేపాల్ లో ప‌ర్య‌టించారు. ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు జ‌రిపిన ప‌ర్య‌ట‌న ఉభ‌య దేశాల మ‌ధ్య బ‌హుముఖ భాగ‌స్వామ్యానికి దోహ‌ద‌ప‌డింది. అలాగే  కీల‌క రంగాల‌లో  ప్ర‌త్యేకించి విద్య‌, సంస్కృతి, ఇంధ‌నం, ప్ర‌జ‌ల‌కు ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య ప‌ర‌స్ప‌ర రాక‌పోక‌లు వంటి వాటివిష‌యంలో అధునాత‌న స‌హ‌కారానికి  వీలు క‌ల్పించింది.
ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ లుంబిని ప‌ర్య‌ట‌న ఇండియా, నేపాల్ ల మ‌ధ్య గ‌ల లోతైన‌, సుసంప‌న్న‌మైన నాగ‌రిక‌తా అనుబంధాన్ని స్ప‌ష్టం చేస్తుంది.  ఇందుకు ఇరువైపులా ప్ర‌జ‌ల తోడ్పాడు, దీనిని పెంపొందించేందుకు వారి పాత్ర , కృషిని ప్రస్ఫుటం చేస్తుంది.

ప్ర‌ధాన‌మంత్రి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఖ‌రారైన ప‌త్రాల‌ను కింద చూడ‌వ‌చ్చు.

***

 


(Release ID: 1825901) Visitor Counter : 183