ప్రధాన మంత్రి కార్యాలయం

మే 13 న మధ్య ప్రదేశ్ స్టార్ట్-అప్ కాన్ క్లేవ్ జరిగే సందర్భం లో మధ్య ప్రదేశ్స్టార్ట్-అప్ పాలిసీ ని మొదలుపెట్టనున్న ప్రధాన మంత్రి

Posted On: 12 MAY 2022 12:34PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం మే 13వ తేదీ నాటి రాత్రి 7 గంటల కు ఇందౌరో లో ఏర్పాటయ్యే మధ్య ప్రదేశ్ స్టార్ట్-అప్ కాన్ క్లేవ్ ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు. అదే కార్యక్రమం లో మధ్య ప్రదేశ్ స్టార్ట్-అప్ పాలిసీ ని ఆయన మొదలుపెడతారు. స్టార్ట్-అప్ ఇకోసిస్టమ్ కు ప్రోత్సాహాన్ని అందించేదిగా ఉండేటటువంటి ‘మధ్య ప్రదేశ్ స్టార్ట్ -అప్ పోర్టల్’ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు.

స్టార్ట్-అప్ ఇకో సిస్టమ్ కు చెందిన వివిధ వర్గాలు మధ్య ప్రదేశ్ స్టార్ట్-అప్ కాన్ క్లేవ్ లో పాలుపంచుకొంటాయి. అంటే ప్రభుత్వం యొక్క మరియు ప్రైవేటు రంగం యొక్క విధాన రూపకర్తలు, నూతన ఆవిష్కర్త లు, నవ పారిశ్రామికవేత్త లు, విద్య రంగ ప్రముఖులు, ఇన్ వెస్టర్ లు, మార్గదర్శకులు మరియు ఇతర సంబంధిత ప్రముఖులు ఈ కాన్ క్లేవ్ లో పాల్గొంటారన్నమాట. కాన్ క్లేవ్ పురోగమించే క్రమం లో వైవిధ్యభరితమైన సదస్సుల ను నిర్వహించడం జరుగుతుంది. వాటిలో- పరస్పర సంప్రదింపుల సదస్సు కూడా ఒకటి. దీనిలో స్పీడ్ మెంటారింగ్ కు చోటు కల్పిస్తారు. విద్య సంస్థల ప్రముఖుల తో మరియు స్టార్ట్-అప్ రంగ ప్రముఖుల తో స్టార్ట్-అప్స్ భేటీ కి కూడాద అవకాశం కల్పిస్తారు. స్టార్ట్-అప్ ను ప్రారంభించడం ఎలా..?, స్టార్ట్-అప్ లకు విధాన రూపకర్త ల వద్ద నుంచి మార్గదర్శకత్వం; నవ పారిశ్రామికవేత్తల కు ఆర్థిక సహాయాలు అందే మార్గాలను గురించి వివరించే ఒక సదస్సు, అలాగే ఇన్ వెస్టర్ లతో భేటీ అయ్యి వారి మద్ధతు ను పొందడానికి గాను స్టార్ట్-అప్స్ వాటి వాటి ఆలోచనల ను వెల్లడి చేసే సదస్సు తో పాటు గా మధ్య ప్రదేశ్ లో స్టార్ట్-అప్ ఇకోసిస్టమ్ ను ప్రోత్సహించడం కోసం, ఇంకా బ్రాండ్ వేల్యూ ను గురించిన అవగాహన సదస్సు వంటివి కూడా ఉంటాయి. కొత్త కొత్త ఆవిష్కరణల ను గురించి మరియు నూతన ధోరణుల ను గురించి కళ్ళ కు కట్టే ఒక స్టార్ట్-అప్ ఎక్స్ పో ను సమావేశ ప్రాంగణం లో ఏర్పాటు చేయడం జరుగుతుంది.

 

***



(Release ID: 1825087) Visitor Counter : 118