ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మే 6న ‘జిటో కనెక్ట్‌-2022’ ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించనున్న ప్రధానమంత్రి

Posted On: 05 MAY 2022 6:53PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 మే 6న  ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమం ద్వారా జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిర్వహించే ‘జిటో కనెక్ట్-2022’ ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగిస్తారు.

జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జిటో) ప్రపంచమంతటాగల జైనులను ఏకం చేసే ఒక అంతర్జాతీయ సంస్థ. ఇందులో భాగంగా పరస్పర నెట్‌వర్కింగ్-వ్యక్తిగత సమాలోచనల ద్వారా వ్యాపారం, పరిశ్రమలకు సంబంధించి వారికి సహాయం చేసేందుకు ఇది కృషి చేస్తుంది. ఈ మేరకు ‘జిటో కనెక్ట్‌-2022’ను పుణేలోని గంగాధామ్ అనెక్స్‌లో మే 6 నుంచి 8 వరకు మూడు రోజులపాటు నిర్వహిస్తారు. వ్యాపారం, ఆర్థిక వ్యవస్థ సంబంధిత విభిన్న అంశాలపై బహుళ దఫాలుగా ఇందులో చర్చాగోష్ఠులుంటాయి.


(Release ID: 1823190) Visitor Counter : 184