ప్రధాన మంత్రి కార్యాలయం

ఫ్రాన్స్అధ్యక్షుని తో ప్రధాన మంత్రి సమావేశం తాలూకు పత్రికా ప్రకటన 

Posted On: 04 MAY 2022 8:03AM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కోపెన్ హేగన్ లో రెండో ఇండియా-నార్డిక్ సమిట్ ముగించి తిరుగుప్రయాణం లో 2022వ సంవత్సరం మే 4వ తేదీ న ఫ్రాన్స్ కు ఆధికారిక యాత్ర ను జరిపారు.


2. పేరిస్ లో, ప్రధాన మంత్రి ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయల్ మేక్రోన్ తో భేటీ అయ్యారు. వారు ఇద్దరు ముఖాముఖి గాను మరియు ప్రతినిధివర్గం స్థాయి లోను సమావేశమయ్యారు. రక్షణ, అంతరిక్షం, బ్లూ ఇకానమి, అణుశక్తి ని శాంతియుత ప్రయోజనాల కు వినియోగించడం మరియు ప్రజా సంబంధాలు సహా ద్వైపాక్షిక అంశాల కు సంబంధించి యావత్తు శ్రేణి ని గురించి ఉభయ నేత లు చర్చలు జరిపారు.
3. నేత లు ఇద్దరూ ప్రాంతీయంగాను మరియు ప్రపంచ స్థాయి లోను భద్రతపరమైనటువంటి దృష్టికోణాన్ని కూడా పరిశీలించారు. ప్రపంచ హితం కోసం భారతదేశం- ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఒక శక్తి గా ఎలాగ మలచవచ్చో అన్నదానిపైన వారు చర్చించారు. ప్రధాన మంత్రి ఫ్రాన్స్ సందర్శన రెండు దేశాల మధ్య గల బలమైన మైత్రి మరియు సౌహార్దాన్నే కాకుండా ఇరువురు నేత ల మధ్య స్నేహాన్ని, సౌహార్దాన్ని కూడా చాటిచెప్పింది.

4. వీలు పడినంత త్వరలో భారతదేశాన్ని సందర్శించేందుకు రండి అంటూ అధ్యక్షుడు శ్రీ మేక్రోన్ ను ప్రధాన మంత్రి ఆహ్వానించారు.

5. చర్చల అనంతరం ఒక సంయుక్త ప్రకటన ను జారీ చేయడమైంది. ఆ ప్రకటన ను ఇక్కడ చూడవచ్చును.

 

 

***



(Release ID: 1822910) Visitor Counter : 95