మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా "కిసాన్ భగీదారీ ప్రథమ్త హమారీ" కార్య‌క్ర‌మం


- దేశమంతటా సుమారు 2000 ప్ర‌దేశాల‌ నుండి లక్ష కంటే ఎక్కువ మంది రైతులు పాల్గొన్నారు

Posted On: 29 APR 2022 11:36AM by PIB Hyderabad

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమల‌ మంత్రిత్వ శాఖ  వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి  ఏప్రిల్ 25 నుండి 30, 2022  వరకు వారం రోజుల పాటు "కిసాన్ భగీదారీ ప్రాథమిక హమారీ" ప్రచార కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తోంది. ఈ ప్రచార కార్య‌క్ర‌మం నాలుగో రోజున, 28 ఏప్రిల్ 2022న మ‌త్స్యశాఖ‌
(డీఓఎఫ్‌), పశుసంవర్ధక మ‌రియు పాడిపరిశ్రమ శాఖ (డీఏహెచ్‌డీ)తో కలిసి  వర్చువ‌ల్ విధానంలో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది. మత్స్య, పశుసంవర్థక మ‌రియు  పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలను గురించి మత్స్యకారులు, చేపల పెంపకందారులు, పశువులు,పాడి రైతులు మరియు ఇతర భాగ‌స్వామ్య ప‌క్షాల వారికి  సామూహికంగా అవగాహన కల్పించడం, ప్రయోజనాలను పొందేలా వారిని ప్రోత్సహించడం ఈ అవగాహన  కార్య‌క్ర‌మం ముఖ్య ఉద్దేశం. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పరుషోత్తం రూపాలా ఈ కార్యక్రమానికి విచ్చేసి, ఉపాధి మరియు జీవనోపాధిలో మత్స్య పరిశ్రమ మరియు పశుసంవర్ధక రంగానికి గల ప్రాముఖ్యతను గురించి తెలియజేశారు. వివిధ రాష్ట్రాల రైతులతో సంభాషించి ప్రోత్సహించారు. వారు మంత్రిత్వ శాఖ యొక్క వివిధ పథకాల క్రింద ప్రయోజనాలను పొందేందుకు. ఈ కార్యక్రమం ఎంత‌గానో దోహదం చేస్తుంద‌ని అన్నారు.  కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమల‌ శాఖ  స‌హ‌య మంత్రులు శ్రీ సంజీవ్ కుమార్ బల్యాన్, డాక్టర్ ఎల్ మురుగన్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. డీఏహెచ్‌డీ| సంయుక్త కార్య‌ద‌ర్శి
డాక్టర్ ఓపీ చౌదరి  ఈ సంద‌ర్భంగా కార్య‌క్ర‌మానికి విచ్చేసిన అతిథులను మరియు పాల్గొనేవారిని స్వాగతం ప‌లికారు.ఈ త‌ర‌హా కార్య‌క్ర‌మంపై త‌న ఆలోచనలను పంచుకున్నారు. ఈ సెషన్‌లో రైతులు మరియు వ్యవసాయ సంస్థలకు అనుబంధంగా ఉన్న డీఓఎఫ్ యొక్క ప్రధాన పథకం "ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై)", మత్స్య మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఎఫ్ఐడీఎఫ్‌) మరియు కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ)తో పాటు ఎన్ఎల్ఎం/ ఆర్‌జీఎంజ‌/ ఏహెచ్ఐడీఎఫ్‌ యొక్క వివిధ వ్యవస్థాపకత పథకాలను మ‌త్స్య మ‌రియు అనుబంధ కార్య‌క‌లాపాల‌ను గురించి ప్ర‌ధానంగా వివ‌రించారు. ఈవెంట్ డీఏహెచ్‌డీ యొక్క అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. అనేక మంది వ్యక్తులు ఆన్‌లైన్‌లో ఈ కార్య‌క్ర‌మంలో చేరారు. భారతదేశం అంతటా దాదాపు 2000 ప్ర‌దేశాల  నుండి  లక్ష కంటే ఎక్కువ మంది రైతులు సెషన్‌లో పాల్గొన్నారు.  కేంద్ర ప్ర‌భుత్వ ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ జాయింట్ సెక్రటరీ శ్రీ సాగర్ మెహ్రా ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా రైతులు వారి ఉత్సాహం మరియు చురుకైన భాగస్వామ్యానికి ధన్యవాదాలు తెలుపుతూ తన ముగింపు వ్యాఖ్యలు చేశారు.  మ‌త్స్యశాఖలో గ‌త‌  వ్యవస్థాపక అవకాశాలను ప్రోత్సహించడానికి, ప్రస్తుతం ఉన్న రైతులను ప్రోత్సహించడానికి మత్స్య పారిశ్రామికవేత్తల విజయగాథల వీడియోల రూపంలో ప్రదర్శించారు.

***

 


(Release ID: 1821491) Visitor Counter : 254