ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సెమికన్ ఇండియా కాన్ఫరెన్స్ 2022 ను ప్రారంభించిన ప్రధాన మంత్రి


‘‘భారతదేశాన్ని ‘గ్లోబల్ సెమికండక్టర్ సప్లయ్ చైన్ స్ లో ఒక కీలక భాగస్వామి గా నిలపాలిఅన్నది మన అందరి ధ్యేయం గా ఉంది’’

‘‘ఆరోగ్యం మరియు సంక్షేమం మొదలుకొని ఇన్ క్లూజన్, ఇంకా సశక్తీకరణ సహా పాలన తాలూకు అన్ని రంగాల లోనూ పరివర్తనను తీసుకు రావడం కోసం డిజిటల్ టెక్నాలజీ ని మనం ఉపయోగించుకొంటున్నాం’’

‘‘తదుపరి సాంకేతిక క్రాంతి లో నాయకత్వ పాత్ర ను పోషించడాని కి భారతదేశం రంగాన్నిసిద్ధం చేస్తున్నది’’

‘‘ప్రపంచం లో అత్యంత వేగవంతమైనటువంటి స్టార్ట్అప్ ఇకోసిస్టమ్ ను కలిగివుండడంద్వారా పటిష్టమైన ఆర్థిక వృద్ధి దిశ లో భారతదేశం పయనిస్తున్నది’’

‘‘వ్యాపార నిర్వహణ లో సౌలభ్యాన్ని మెరుగుపరచడాని కి విస్తృత స్థాయి లోసంస్కరణల ను భారతదేశం తీసుకు వచ్చింది.’’

సెమికండక్టర్ డిజైన్ రంగం లోఅసాధారణమైన ప్రతిభావంతులు దండిగా ఉన్నారు.  వారు ప్రపంచం లోని సెమికండక్టర్డిజైన్ ఇంజినీర్ లలో దాదాపు గా 20 శాతానికి సమానం అని చెప్పవచ్చు’’

‘‘సెమికండక్టర్స్ వినియోగం లో భారతదేశం స్థాయి 2026 సంవత్సరాని కి 80 బిలియన్ డాలర్ లను మరియు 2030వ సంవత్సరాని కల్లా 110 బిలియన్ డాలర్ లను మించిపోవచ్చన్న అంచనాలుఉన్నాయి’’

‘‘వందేళ్ల లో ఒక సారి తలెత్తే మహమ్మారి తో మానవాళి పోరాటం జరుపుతుండగా, భారతదేశం మన ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ఒక్కటే కాకుండా మన ఆర్థిక వ్యవస్థ యొక్క స్వస్థత ను కూడా మెరుగుపరచసాగింది’’

‘‘పరిశ్రమ శాయశక్తులా కృషి చేస్తూ ఉన్నప్పుడు, ప్రభుత్వం తప్పక మరింత పాటుపడవలసిందే’’

‘‘టెక్నాలజీ ని వినియోగించుకోవడం, రిస్క్ తీసుకోవడం భారతదేశాని కితెలిసిన విద్యలే’’

‘‘మేము అండదండల ను అందించేటటువంటి విధానపరమైన చొరవల నుతీసుకోవడం ద్వారా పరిస్థితుల ను మీకు అనుకూలం గా మేం మలచివేశాం.  భారతదేశం వ్యాపారంచేయడాని కి పట్టం కడుతుంది అని మనం చాటాం’’

Posted On: 29 APR 2022 11:21AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెమికన్ ఇండియా కాన్ఫరెన్స్ 2022 ను ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించి, ఆ సందర్భం లో తన ఆలోచనల ను వెల్లడి చేశారు. ఈ కార్యక్రమం లో పాలుపంచుకున్న వారి లో కేంద్ర మంత్రులు, సెమికండక్టర్ పరిశ్రమ కు చెందిన ప్రముఖులు, ఇన్వెస్టర్ లు, విద్యారంగ ప్రముఖులు మరియు దౌత్య రంగ ప్రముఖులు తదితరులు ఉన్నారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగం మొదట్లో అందరి కీ స్వాగతం పలుకుతూ, ఈ సమావేశం భారతదేశం లో జరుగుతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వర్తమాన ప్రపంచం లో సెమికండక్టర్స్ యొక్క అత్యధిక మహత్వపూర్ణమైనటువంటి పాత్ర ను గురించి ఆయన ప్రముఖం గా ప్రస్తావిస్తూ, ‘‘గ్లోబల్ సెమికండక్టర్ సప్లయ్ చైన్ స్ లో ఒక కీలక భాగస్వామ్య దేశం గా భారతదేశాన్ని నిలబెట్టాలి అనేది మన అందరి ధ్యేయం గా ఉంది. హై-టెక్, హై క్వాలిటీ, ఇంకా హై రిలయబిలిటీ సూత్రం ఆధారం గా ఈ దిశ లో కృషిచేయాలి అని మనం కోరుకొంటున్నాం’’ అన్నారు.

సెమికండక్టర్ సాంకేతిక విజ్ఞానం రంగం లో ఒక ఆకర్షణీయమైనటువంటి పెట్టుబడి గమ్యస్థానం గా భారతదేశం ఉంటున్నందుకు గల ఆరు కారణాల ను ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు.

ఒకటో కారణం ఏమిటి అంటే అది 1.3 బిలియన్ మంది భారతీయుల ను కలపడం కోసం ఒక డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను భారతదేశం నిర్మిస్తూ ఉండడమే అని ప్రధాన మంత్రి అన్నారు. ఆర్థిక సేవల ను అన్ని వర్గాల వారి చెంత కు తీసుకు పోవడం, బ్యాంకింగ్ మరియు డిజిటల్ పేమెంట్ రెవలూశన్ రంగం లో భారతదేశం ఇటీవల వేసిన పెద్ద అడుగుల ను గురించి ఆయన అభివర్ణిస్తూ, ‘‘ఆరోగ్యం మొదలుకొని సంక్షేమం, ఇన్ క్లూఝన్, ఇంకా సశక్తీకరణ ల వరకు పాలన సంబంధి రంగాలు అన్నిటి ద్వారా జీవనం లో పరివర్తన ను తీసుకు రావడం కోసం డిజిటల్ టెక్నాలజీ ని మనం వినియోగిస్తున్నాం’’ అని అన్నారు.

రెండో కారణాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, బ్రాడ్ బ్యాండ్ తో ఆరు వందల వేల గ్రామాల ను జోడించడం, 5జి, ఐఒటి మరియు స్వచ్ఛ శక్తి సంబంధి సాంకేతిక విజ్ఞానం .. వీటిలో సామర్ధ్యాల పెంపుదల కు పెట్టుబడి వంటి చర్యల ను తీసుకొంటూ భారతదేశం తదుపరి సాంకేతిక విప్లవ ఆవిష్కరణ కు నాయకత్వం వహించడాని కి రంగాన్ని సిద్ధం చేస్తోందని ఆయన అన్నారు.

మూడో కారణం ఏమిటి అంటే అది భారతదేశం ప్రపంచం లో కెల్లా అత్యంత వేగం గా వృద్ధి చెందుతూ ఉన్నటువంటి స్టార్ట్అప్ ఇకోసిస్టమ్ తో బలమైన ఆర్థిక వృద్ధి దిశ లో పయనిస్తూ ఉండడం అనేదే అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం యొక్క సెమికండక్టర్స్ వినియోగ స్థాయి 2026వ సంవత్సరాని కల్లా 80 బిలియన్ డాలర్ లను మించిపోయి, మరి 2030వ సంవత్సరాని కల్లా 110 బిలియన్ డాలర్ ల స్థాయి కి చేరుకొంటుందన్న అంచనా ఉంది అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

నాలుగో కారణం భారతదేశం వ్యాపార నిర్వహణ లో సౌలభ్యాన్ని మెరుగు పరచడాని కి అనేకమైన సంస్కరణల ను ప్రవేశ పెట్టడమే అని ప్రధాన మంత్రి అన్నారు. 25,000 కు పైగా నియమాల పాలన అగత్యాన్ని అంతం చేయడం, లైసెన్స్ ల ఆటో-రిన్యూవల్ దిశ లో ముందంజ వేయడం, డిజిటైజేశన్ ద్వారా నియంత్రణ సంబంధి ఫ్రేంవర్క్ లో వేగం పెంచడం లతో పాటు ప్రపంచం లో అత్యంత అనుకూలమైన పన్నుల సంబంధి వ్యవస్థల లో ఒక వ్యవస్థ ను కలిగివుండడం గురించి ప్రధాన మంత్రి తెలియజేశారు.

అయిదో కారణాన్ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, 21వ శతాబ్ది అవసరాల ను దృష్టి లో పెట్టుకొని భారతదేశం లోని యువతీ యువకుల కు శిక్షణ ను ఇప్పించడండం లో, నైపుణ్యాల కు మెరుగులు దిద్దడం లో భారీ పెట్టుబడి ని పెట్టడం జరుగుతోంది అన్నారు. ‘‘మన దేశం లో చేయి తిరిగినటువంటి సెమికండక్టర్ డిజైన్ ప్రతిభావంతులు అధికం గా ఉన్నారు. వీరి సంఖ్య ప్రపంచం లో ఇప్పుడున్న సెమికండక్టర్ డిజైన్ ఇంజీనియర్ లలో 20 శాతాని కి సమానం గా ఉంది. అగ్రగామి 25 సెమికండక్టర్ డిజైన్ కంపెనీల లో దాదాపు గా అన్ని కంపెనీ లు వాటి యొక్క డిజైన్ లేదా పరిశోధన అభి వృద్ధి (ఆర్ ఎండ్ డి) కేంద్రాల ను మన దేశం లో ఏర్పాటు చేశాయి’’ అని ఆయన అన్నారు.

ఆరో కారణాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, భారతదేశం లో తయారీ రంగం రూపు రేఖల ను మార్చివేసే దిశ లో అనేక చర్యల ను తీసుకోవడమైందని తెలిపారు. ‘‘వంద సంవత్సరాల వ్యవధి లో ఒకసారి విరుచుకుపడే మహమ్మారి తో మానవాళి తలపడిన కాలం లో భారతదేశం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగు పరచడం ఒక్కటే కాకుండా ఆర్థిక వ్యవస్థ స్వస్థత ను కూడా మెరుగుపరచింది’’ అని ఆయన అన్నారు. ‘‘కీలకమైన 14 రంగాల లో 26 బిలియన్ డాలర్ లకు పైగా విలువైన ప్రోత్సాహకాల ను అందిస్తున్న ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహాకాలపథకాల ను గురించి ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రస్తావించారు. రాబోయే 5 సంవత్సరాల లో, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం రెకార్డు స్థాయి లో వృద్ధి ని నమోదు చేసేందుకు అవకాశం ఉందని ఆయన అన్నారు. ఇటీవలే ప్రకటించిన సెమి -కన్ ఇండియా ప్రోగ్రామ్ ను గురించి కూడా శ్రోతల కు శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. ఈ ప్రోగ్రామ్ మొత్తం వ్యయం పది బిలియన్ డాలర్ లకు పైగానే అని ఆయన అన్నారు. సెమికండక్టర్స్, డిస్ ప్లే మేన్యుఫేక్చరింగ్, ఇంకా డిజైన్ ఇకోసిస్టమ్స్ లో పెట్టుబడి పెట్టే కంపెనీల కు ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని అందించడం ఈ ప్రోగ్రామ్ ఉద్దేశ్యం అని ఆయన చెప్పారు.

ప్రభుత్వం పక్షాన సమర్థన తాలూకు అవసరాన్ని ప్రధాన మంత్రి అంగీకరించారు. వ్యాపార నిర్వహణ కు అనువైన వాతావరణాన్ని కల్పించడాని కి ప్రభుత్వం ఉత్తమమైనటువంటి ప్రయత్నాల ను చేస్తుంది అంటూ సభికుల కు ప్రధాన మంత్రి హామీ ని ఇచ్చారు. ‘‘పరిశ్రమ శాయశక్తుల కృషి చేస్తూ ఉన్నప్పుడు, ప్రభుత్వం అవశ్యం మరింత గా పాటుపడాలి’’ అని ఆయన అన్నారు. ప్రపంచం లో ఒక సరికొత్త క్రమం రూపుదాల్చుతోందని ప్రధాన మంత్రి చెప్తూ, అందివస్తున్నటువంటి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసింది గా సూచించారు. ‘‘వృద్ధి ని ప్రోత్సహించేటటువంటి వాతావరణాన్ని ఏర్పరచడానికి మేం గత కొన్నేళ్ళుగా కఠోర శ్రమ చేశాం. టెక్నాలజీ అన్నా, నష్టభయానికి ఎదురొడ్డడం అన్నా అది భారతదేశాని కి తెలిసిన విద్యే. సమర్ధనపూర్వకమైనటువంటి విధానపరమైన చొరవల ను తీసుకోవడం ద్వారా మేం పరిస్థితుల ను మీకు అనుకూలం గా మలచాం. వ్యాపారం చేయడాని కి భారతదేశం పట్టం కడుతుంది అని మేం నిరూపించాం’’ అని ప్రధాన మంత్రి చెప్తూ, తన ప్రసంగాన్ని ముగించారు.

***

DS/AKP/AK

 

 

 

 

 


(Release ID: 1821475) Visitor Counter : 239