మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ (జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం) ఆదేశ పత్రాన్ని ప్రారంభించనున్న ధర్మేంద్ర ప్రధాన్
Posted On:
28 APR 2022 12:46PM by PIB Hyderabad
కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 29 ఏప్రిల్ 2022న జాతీయ పాఠ్య ప్రణాళిక వ్యవస్థ (ఎన్సీఎఫ్) ఆదేశ పత్రాన్ని ప్రారంభించనున్నారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 నాలుగు రంగాలలో జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్‌వర్క్‌లను (ఎన్సీఎఫ్) అభివృద్ధి చేయాలని సిఫార్సు చేసింది. వీటిలో- పాఠశాల విద్య , బాల్య సంరక్షణ , విద్య (ఈసీసీఈ), ఉపాధ్యాయ విద్య , వయోజన విద్య ఉంటాయి.
కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ అశ్వత్నారాయణ ; డాక్టర్ బీసీ నగేష్, ప్రాథమిక , మాధ్యమిక విద్య మంత్రి, కర్ణాటక ప్రభుత్వం; డాక్టర్ కె. కస్తూరిరంగన్, జాతీయ పాఠ్యప్రణాళిక వ్యవస్థ జాతీయ స్టీరింగ్ కమిటీ చైర్‌పర్సన్; విద్యా మంత్రిత్వ శాఖలోని పాఠశాల విద్య , అక్షరాస్యత విభాగం కార్యదర్శి అనితా కర్వాల్ , నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) డైరెక్టర్ ప్రొఫెసర్ డీపీ సక్లానీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వీటి అభివృద్ధికి ఇన్‌పుట్‌లను అందించడం కోసం నాలుగు పాఠ్య ప్రణాళిక చట్రాలు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం 2020 దృక్కోణాల ఆధారంగా 25 థీమ్‌లను మూడు వర్గాల క్రింద గుర్తించడం జరిగింది. ఇవి 1. పాఠ్యాంశాలు , బోధనాశాస్త్రం 2. క్రాస్-కటింగ్ సమస్యలు 3. ఇతర ముఖ్యమైన ప్రాంతాలు. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం, 2020 వ్యవస్థాగత మార్పులపై, సంస్కరణలపై దృష్టి సారిస్తుంది.
తప్పనిసరి పత్రసహిత జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం అభివృద్ధి ప్రక్రియ, దాని అంచనా నిర్మాణం , లక్ష్యాలు , నాలుగు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రాల అభివృద్ధిని తెలియజేసే జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం 2020 నుండి కొన్ని ప్రాథమిక సూత్రాలను వివరిస్తుంది. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రాన్ని జిల్లా నుండి రాష్ట్ర స్థాయి , తరువాత జాతీయ స్థాయి వరకు సహకారం , సంప్రదింపుల ప్రక్రియ ద్వారా రూపొందించడం జరుగుతోంది. ఈ ఆదేశ పత్రంలో ‘జాతీయ పాఠ్యప్రణాళిక వ్యవస్థ అభివృద్ధి కోసం పొజిషన్ పేపర్ల మార్గదర్శకాలు’ అంతర్భాగంగా ఉంటాయి. టెక్ ప్లాట్‌ఫారమ్ , మొబైల్ యాప్ సహాయంతో పాఠశాల/జిల్లా/రాష్ట్ర స్థాయిలో చాలా విస్తృత సంప్రదింపులతో పాఠ్యప్రణాళిక వ్యవస్థ మొత్తం ప్రక్రియ పేపర్‌లెస్ పద్ధతిలో ఉంటుంది.
***
(Release ID: 1821066)
Visitor Counter : 307
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada