ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశాని కిమరియు జపాన్ కు మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్సరాలు కావడంపట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
28 APR 2022 11:39AM by PIB Hyderabad
భారతదేశాని కి మరియు జపాన్ కు మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్సరాలు కావడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మన సంబంధాలు ప్రతి ఒక్క రంగం లో అవి వ్యూహాత్మకం కావచ్చు, ఆర్థికం కావచ్చు, లేదా ప్రజా సంబంధాలు కావచ్చు.. గాఢతరం అయ్యాయి అని కూడా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి వరుస ట్వీట్ లలో -
‘‘భారతదేశాని కి మరియు జపాన్ కు మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్సరాలు అవుతూ ఉన్న సందర్భం లో, అవి వ్యూహాత్మకం కావచ్చు, ఆర్థికం కావచ్చు, లేదా ప్రజా సంబంధాలు కావచ్చు.. మన బంధం ప్రతి ఒక్క రంగం లో గాఢతరం అయ్యాయి అనే అంశం నాకు సంతోషాన్ని ఇస్తోంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
నా మిత్రుడు, ప్రధాని శ్రీ కిశిదా @kishida230 ఇటీవల వార్షిక శిఖర సమ్మేళనం కోసమని భారతదేశాన్ని సందర్శించడం మన ప్రత్యేక వ్యూహాత్మక మరియు ప్రపంచ భాగస్వామ్యాన్ని కోవిడ్ అనంతర కాలం లో గాఢతరం చేసుకోవడం కోసం మార్గసూచీ ని అందించింది. ఈ లక్ష్యాన్ని సాధించడాని కి ప్రధాని శ్రీ కిశిదా తో కలసి పని చేయడాన్ని కొనసాగించాలి అని నేను ఆవ పడుతున్నాను’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1820910)
Visitor Counter : 187
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam