మంత్రిమండలి
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటుకు సవరించిన ఖర్చు అంచనాలకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరానికి అదనపు ఫండింగ్ 820 కోట్ల రూపాయలు, మొత్తం పెట్టుబడి ప్రస్తుతం 2255 కోట్ల రూపాయలు.
Posted On:
27 APR 2022 4:51PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐసిపిబి) ఏర్పాటుకు సవరించిన ప్రాజెక్టు పెట్టుబడికి ఆమోదం తెలిపింది. దీనిని 1435 కోట్ల రూపాయలనుంచి 2255 కోట్ల రూపాయలకు పెంచి రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా ఈక్విటీని సమకూరుస్తారు. అలాగే రెగ్యులేటరీ అవసరాలు, సాంకేతికతను అప్‌గ్రేడ్ చేయాడానికి మరో 500 కోట్ల రూపాయలను భవిష్యత్ లో నిధులను సమకూర్చడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ ప్రాజెక్టు లక్ష్యం, అందుబాటులో, చవకగా బ్యాంకింగ్ సేవలను సామాన్యుడికి అందుబాటులోకి తేవడం. బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని వారికి అడ్డంకులు తొలగించడం, ఇంటివద్దకే బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం. ఈ ప్రాజెక్టు , తక్కువ నగదు చలామణి కి సంబంధించి భారత ఆర్ధిక వ్యవస్థ దార్శనికతకు అద్దం పడుతుంది. అలాగే ఇది ఆర్ధిక ప్రగతికి, ఆర్థిక సమ్మిళితత్వానికి దోహదపడుతుంది.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 2018 సెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా 650 బ్రాంచ్‌లు, కంట్రోలింగ్ ఆఫీసులలో ప్రారంభమైంది. ఐపిపిబి కి 1.36 లక్షల పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. ఇవి బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి. 1.89 లక్షల పోస్ట్‌మెన్, గ్రామీణ్ డాక్ సేవక్ లు స్మార్ట్ ఫోన్, బయోమెట్రిక్ పరికరాల ద్వారా ఇంటిగుమ్మం వద్దకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెస్తున్నారు.
ఐపిపిబి ని ప్రారంభించినప్పటి నుంచి ఇది 5.25 కోట్ల ఖాతాలను ప్రారంభించింది. సుమారు 82 కోట్ల ఆర్థిక లావాదేవీలు సుమారు రూ 1,61.811 కోట్ల రూపాయల మేరకు జరిగాయి . దీనికి తోడు 765 లక్షల ఎఇపిఎస్ లావాదేవీలు సుమారు 21 వేలా 343 కోట్ల రూపాయల మేరకు జరిగాయి. 5 కోట్ల ఖాతాలలో్ 77 శా3తం ఖాతాలు గ్రామీణ ప్రాంతాలలో ప్రారంభమైనవి. ఇందులో 48 శాతం మహిళా కస్టమర్లు. వెయ్యి కోట్ల డిపాజిట్లు కలిగి ఉంది. సుమారు 40 లక్షల మంది మహిళా కస్టమర్లు ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటి ) కింద 2500 కోట్ల రూపాయలు తమ ఖాతాలో అందుకున్నారు. సుమారు 7.8 లక్షల ఖాతాలు పాఠశాల విద్యార్థుల పేరుమీద ప్రారంభించారు.
ఆకాంక్షిత జిల్లాలలో ఐపిపిబి సుమారు 95.71 లక్షల ఖాతాలను తెరిచింది. ఇందులో సుమారు 602 లక్షల లావాదేవీలు రూ 19,487 కోట్ల రూపాయల మేరకు జరిగాయి. వామపక్ష తీవ్రవాదం (ఎల్ డబ్ల్యు ఇ ) ఉన్న జిల్లాలలో 67.20 లక్షల ఖాతాలను ఐపిపిబి ప్రారంభించింది. సుమారు426 లక్షల లావాదేవీలలో 13, 460 కోట్ల రూపాయలు బదిలీ అయింది.
ఈ ప్రతిపాదన ల మొత్తం ఆర్థిక వ్యయం రూ.820 కోట్లు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవడం ద్వారా భారతదేశం అంతటా ఆర్థిక సేవలను మరింతగా పెంచే లక్ష్యంతో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌కు ఈ నిర్ణయం సహాయం చేస్తుంది.
***
(Release ID: 1820882)
Visitor Counter : 221
Read this release in:
Odia
,
Assamese
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam