మంత్రిమండలి

దివ్యాంగ రంగంలో సహకారంపై భారత్‌ - చిలీ మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం

Posted On: 27 APR 2022 4:43PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న ఇవాళ సమావేశమైన కేంద్ర మంత్రిమండలి దివ్యాంగ రంగంలో స‌హ‌కారంపై భారత్‌-చిలీ మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలకు ఆమోదం తెలిపింది. భారత ప్రభుత్వంలోని దివ్యాంగ వ్యక్తుల సాధికారత విభాగం, చిలీ ప్రభుత్వాల మధ్య దివ్యాంగ రంగంలో సంయుక్త చర్యలద్వారా రెండు దేశాల మధ్య సహకారానికి ఈ ద్వైపాక్షిక ఒప్పందం తోడ్పడుతుంది. అదే సమయంలో భారత్‌-చిలీ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుంది.

   తదనుగుణంగా దివ్యాంగ రంగంలో ముఖ్యంగా కింద పేర్కొన్న అంశాలకు సంబంధించి సహకారానికి అంగీకరిస్తూ ఆసక్తి వ్యక్తీకరణ లేఖపై సంతకాలు పూర్తయ్యాయి:

  1. దివ్యాంగ విధానం-సేవల ప్రదానంపై సమాచారాన్ని పంచుకోవడం.
  2. సమాచారం-విజ్ఞానాల ఆదానప్రదానం.
  3. సహాయక పరికర సాంకేతికత పరిజ్ఞానంలో సహకారం.
  4. దివ్యాంగ రంగంలో పరస్పర ప్రయోజన ప్రాజెక్టుల అభివృద్ధి.
  5. వైకల్యం ముందస్తు గుర్తింపు-నివారణ.
  6. నిపుణులు, విద్యావేత్తలు.. ఇతర పరిపాలన సిబ్బంది మార్పిడి.

   ఈ అవగాహన ఒప్పందం అమలు వ్యయాన్ని భరించేందుకు ఒప్పంద సూత్రాలకు అనుగుణంగా ఒక యంత్రాంగం ఏర్పాటవుతుంది. నిధులు.. వనరుల లభ్యతకు తగినట్లు సంబంధిత కార్యకలాపాల ఖర్చును ప్రభుత్వాలు రెండూ పరస్పరం ప్రతి అవసరం ప్రాతిపదిన నిర్ణయిస్తాయి. ఉమ్మడి కార్యకలాపాల కోసం అంతర్జాతీయ ప్రయాణం/వసతి వ్యయాన్ని సందర్శక దేశం భరిస్తుంది. అయితే, సమావేశాల నిర్వహణ వ్యయాన్ని ఆతిథ్య దేశం భరిస్తుంది.

   విస్తృత శ్రేణిగల అంశాలపై ఉమ్మడి అభిప్రాయాల ప్రాతిపదికన భారత్‌-చిలీల మధ్య సౌహార్ద, స్నేహపూర్వక సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 2019-20లో 70 సంవత్సరాలు పూర్తయ్యాయి. అలాగే గౌరవనీయ చిలీ అధ్యక్షుడి 2005, 2009నాటి భారత సందర్శన సహా దేశాధినేతల పరస్పర పర్యటనలతో కాలక్రమంలో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడ్డాయి.

 

***



(Release ID: 1820840) Visitor Counter : 120