ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

"ప్రపంచ మలేరియా దినోత్సవం 2022" సభలో డాక్టర్ మన్సుఖ్ మాండవియా కీలకోపన్యాసం చేశారు.


"మలేరియాపై మన సమిష్టి పోరాటంలో నిర్ధారణ మరియు చికిత్స మాత్రమే కాదు..స్వచ్ఛత మరియు సామాజిక అవగాహన కూడా ముఖ్యమైనవి"

"భారత ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా 2015తో పోలిస్తే 2021లో మలేరియా కేసులు 86.45% తగ్గాయి మరియు మలేరియా సంబంధిత మరణాలు 79.16% తగ్గాయి"

2022 ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీ, లక్నో, భువనేశ్వర్ మరియు నాగ్‌పూర్‌లోని రైల్వే స్టేషన్‌ల్లో దీపాలంకరణ చేయనున్నారు

Posted On: 25 APR 2022 1:10PM by PIB Hyderabad

"రోగ నిర్ధారణ మరియు చికిత్స మాత్రమే కాదు..మన వ్యక్తిగత మరియు సమాజ పరిసరాలలో స్వచ్ఛత మరియు మలేరియా నియంత్రణ మరియు నివారణకు సంబంధించిన సామాజిక అవగాహన మలేరియాపై  సమిష్టి పోరాటంలో మరియు 2030 నాటికి దేశం నుండి మలేరియాను నిర్మూలించాలనే మా లక్ష్యాన్ని చేరుకోవడంలో ముఖ్యమైనవి" అని  2022 ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని చేసిన ప్రసంగంలో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా తెలిపారు. "ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ప్రగతిశీల పటిష్టతను నొక్కి చెప్పడం మరియు బహుళ-రంగాల సమన్వయం మరియు సహకారాన్ని మెరుగుపరచడం అవసరం" అని ఆయన స్పష్టం చేశారు.

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25ని 'ప్రపంచ మలేరియా దినోత్సవం'గా పాటిస్తారు. ఈ సంవత్సరం థీమ్ "గ్లోబల్ మలేరియా వ్యాధి భారాన్ని తగ్గించడానికి మరియు జీవితాలను రక్షించడానికి ఆవిష్కరణలను ఉపయోగించుకోవడం"

 



image.png



జాతీయ మరియు ఉప జాతీయ ప్రయత్నాల ద్వారా మలేరియా నిర్మూలనకు ప్రాధాన్యత ఇవ్వాలని డాక్టర్ మాండవ్య పిలుపునిచ్చారు. భారతదేశ మలేరియా నిర్మూలన ప్రణాళికను ముందుకు తీసుకెళ్లడానికి మరియు మెరుగైన ఆరోగ్యం, జీవన నాణ్యత మరియు పేదరిక నిర్మూలనకు దోహదపడేందుకు తగిన పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో సాంకేతికత మరియు ఆవిష్కరణలను ఉపయోగించుకోవడంలో సహాయపడతాయని ఆయన నొక్కి చెప్పారు. రోగనిర్ధారణ, సకాలంలో మరియు సమర్థవంతమైన చికిత్స మరియు వెక్టర్ నియంత్రణ చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆశాలు, ఎఎన్‌ఎంలతో పాటు భాగస్వామ్య సంస్థలతో గ్రౌండ్ లెవెల్ ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ కార్యకర్తలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రైవేట్ ప్రాక్టీషనర్‌లతో పాటు ప్రైవేట్ రంగం వారి మలేరియా కేసు నిర్వహణ మరియు రిపోర్టింగ్ మరియు సంబంధిత కార్యకలాపాలను జాతీయ కార్యక్రమంతో సమలేఖనం చేయాలని ఆయన సూచించారు. "మనం వినూత్న సాంకేతికత వినియోగంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో భారతదేశం యొక్క "ఈ-సంజీవని" టెలి-కన్సల్టేషన్ మరియు టెలి-రిఫరెన్సింగ్ కోసం మార్గాన్ని చూపింది. ఇది మలేరియాతో సహా వివిధ ఆరోగ్య సంరక్షణ సమస్యల నిర్ధారణ మరియు చికిత్స కోసం రౌండ్ స్థాయిలలో విస్తృతంగా ఉపయోగించబడుతోందని పేర్కొన్నారు.



image.png



మలేరియా నిర్మూలనలో సాధించిన విజయాన్ని కూడా కేంద్ర ఆరోగ్య మంత్రి వివరించారు. “మలేరియా సంభవం మరియు మరణాలను తగ్గించడంలో భారతదేశం అద్భుతమైన పురోగతిని సాధించింది. ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా 2015తో పోలిస్తే 2021లో మలేరియా కేసులు 86.45% తగ్గాయి మరియు మలేరియా సంబంధిత మరణాలు 79.16% తగ్గాయి. దేశంలోని 124 జిల్లాల్లో ‘జీరో మలేరియా' కేసులు నమోదయ్యాయి. మలేరియా నిర్మూలన కోసం  లక్ష్యం దిశగా ఇది ఒక ప్రధాన ముందడుగు అని అయితే మలేరియా రహిత భారతదేశం అనే కలను నెరవేర్చడానికి ఇంకా మరింత చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ మాండవ్య అన్నారు.
 


image.png



కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ “2030 నాటికి మలేరియాను నిర్మూలించే దిశగా ఒక మిషన్ మోడ్‌లో పని జరుగుతోంది. ఆ మేరకు రాష్ట్రాలపై భారం తగ్గించేందుకు  మలేరియా నివారణ కోసం మౌలిక సదుపాయాల మెరుగుదల మరియు ప్రయోగశాల మద్దతు వంటి ఆంశాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తోంది. పరీక్షలు మరియు చికిత్సలో మరింత కృషి చేస్తే 2030 నాటికి భారతదేశం మలేరియా నిర్మూలన కలను సాధిస్తుందని ఆమె ఉద్ఘాటించారు.

సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రపంచ మలేరియా దినోత్సవం 2022ని పురస్కరించుకుని న్యూఢిల్లీ, లక్నో, భువనేశ్వర్ మరియు నాగ్‌పూర్‌లోని రైల్వే స్టేషన్‌లు నారింజ మరియు ఊదా రంగులతో ప్రకాశిస్తాయి.

ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ వెక్టర్ మేనేజ్‌మెంట్ 2022కి సంబంధించిన మాన్యువల్‌ను విడుదల చేశారు. 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనతో పాటు మలేరియాను నిర్మూలించేందుకు తగిన ప్రవర్తన మరియు పద్ధతులకు కట్టుబడి ఉంటామని ఉన్నతాధికారులు ప్రతిజ్ఞ చేశారు. మలేరియా నిర్మూలనలో ఆదర్శప్రాయమైన కృషి చేస్తున్న రాష్ట్రాలను కూడా సత్కరించారు.

కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ ; ఏఎస్ అండ్ ఎండీ(ఎన్‌హెచ్‌ఎం) శ్రీ. వికాస్ షీల్ ; డాక్టర్ హర్మీత్ సింగ్ గ్రేవాల్, జేఎస్‌ (ఎంఓహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ); డాక్టర్ అతుల్ గోయెల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్; డాక్టర్ సుజీత్ సింగ్, డైరెక్టర్, ఎన్‌సిడిసి; డాక్టర్ తనూ జైన్, డైరెక్టర్, ఎన్‌సివిబిడిసి; మరియు ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్‌లోని డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి డాక్టర్ రోడెరిక్ ఆఫ్రిన్ కూడా సమావేశంలో పాల్గొన్నారు.



 

****



(Release ID: 1819843) Visitor Counter : 245