ప్రధాన మంత్రి కార్యాలయం

బనాస్ కాంఠా లోని దియోదర్ లో బనాస్ డెయరి సంకుల్ లో అనేక అభివృద్ధి పథకాలను దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి;  మరికొన్ని అభివృద్ధి పథకాల కు ఆయనశంకుస్థాపన చేశారు


బనాస్ సాముదాయిక రేడియో కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి

బనాస్ కాంఠా జిల్లా లోని దియోదర్ లో 600 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో ఒకకొత్త పాడి సంబంధి భవన సముదాయాన్ని మరియు బంగాళాదుంపల ప్రోసెసింగ్ ప్లాంటు నునిర్మించడం జరిగింది

పాలన్ పుర్ లో గల బనాస్ డెయరి ప్లాంటు లో జున్ను ఉత్పత్తుల తయారీ కిఉద్దేశించి ప్లాంటుల ను విస్తరించడమైంది

గుజరాత్ లోని దామా లో సేంద్రియ ఎరువు, ఇంకా బయోగ్యాస్ ప్లాంటుల నునెలకొల్పడమైంది

ఖిమానా, రతన్ పురా- భీల్ డీ, రాధన్ పుర్, ఇంకా థావర్ లలో 100 టన్నుల సామర్ధ్యం కలిగి ఉండే నాలుగుగోబర్ గ్యాస్ ప్లాంటుల కు శంకుస్థాపన చేశారు

‘‘గడచిన కొన్ని సంవత్సరాల లో, బనాస్ డెయరి స్థానిక సముదాయాల కు, ప్రత్యేకించి రైతుల కు మరియు మహిళల కుసాధికారిత ను కల్పించే కేంద్రం గా మారిపోయింది’’

‘‘వ్యవసాయ రంగం లో బనాస్ కాంఠా తనదైన ముద్ర ను వేసిన విధానం ప్రశంసనీయం.  రైతులు కొంగొత్తసాంకేతికతల ను అవలంబించారు, నీటి ని సంరక్షించడం పై శ్రద్ధ వహించారు, మరి వాటి తాలూకు ఫలితాలు అందరి ఎదుటాఉన్నాయి’’

‘‘విద్య సమీక్ష కేంద్రం గుజరాత్ లో 54,000 పాఠశాల లు, 4.5 లక్షల మంది టీచర్ లు మరియు 1.5 కోట్ల మంది విద్యార్థుల శక్తి యొక్క చైతన్యకేంద్రం గా రూపుదిద్దుకొన్నది’’

‘‘నేను మీ యొక్క పొలాల్లో ఓ భాగస్వామి వలె మీతో పాటు ఉంటాను’’

Posted On: 19 APR 2022 1:02PM by PIB Hyderabad

గుజరాత్ లోని బనాస్ కాంఠా జిల్లా లో గల దియోదర్ లో 600 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో నిర్మాణం జరిగిన ఒక కొత్త డెయరి కాంప్లెక్స్ ను మరియు బంగాళాదుంపల ప్రోసెసింగ్ ప్లాంటు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న దేశ ప్రజల కు అంకితం చేశారు. ఈ నూతన డెయరి కాంప్లెక్స్ ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు గా ఉంది. ఇది రోజు కు దాదాపు 30 లక్షల లీటర్ ల పాల ను ప్రోసెస్ చేయడానికి, సుమారు 80 టన్నుల వెన్న ను, ఒక లక్ష లీటర్ ల ఐస్ క్రీమ్ ను, 20 టన్నుల ఘనీకృత పాల (ఖోయా) ను మరియు 6 టన్నుల చాక్ లెట్ ల ఉత్పత్తి కి వీలు కల్పిస్తుంది. పొటాటో ప్రోసెసింగ్ ప్లాంటు లో ఫ్రెంచ్ ఫ్రైజ్, ఆలూ చిప్స్, ఆలూ టిక్కీ, పేటీ లు మొదలైన ప్రోసెస్డ్ పొటాటో ప్రోడక్ట్ స్ ను తయారు చేసేందుకు ఏర్పాటు లు ఉన్నాయి. వీటి లో చాలా వరకు ఇతర దేశాల కు ఎగుమతి అవుతాయి. ఈ ప్లాంటు లు స్థానిక రైతుల కు సాధికారిత ను కల్పించి, ఆ ప్రాంతం లోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ను బలపరుస్తాయి. బనాస్ కమ్యూనిటీ రేడియో స్టేశను ను కూడా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేశారు. వ్యవసాయాని కి, పశుపాలన కు సంబంధించిన విజ్ఞాన శాస్త్ర సంబంధమైనటువంటి సమాచారాన్ని రైతుల కు అందించడం కోసం ఈ సాముదాయిక రేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేయడమైంది. ఈ రేడియో స్టేశన్ ఇంచుమించు 1700 గ్రామాల కు చెందిన 5 లక్షల మంది కి పైగా రైతుల కు ఉపయోగపడనుంతుంది. పాలన్ పుర్ లోని బనాస్ డెయరి ప్లాంటు లో జున్ను ఉత్పత్తులకు సంబంధించిన, పాల విరుగుడు తేట ఉత్పత్తుల కు సంబంధించిన సామర్ధ్యాన్ని విస్తరించిన విభాగాల ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేశారు. గుజరాత్ లో దామా లో స్థాపించినటువంటి సేంద్రియ ఎరువు మరియు బయోగ్యాస్ ప్లాంటు ను కూడా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేశారు. ఖిమానా, రతన్ పురా- భీల్ డీ, రాధన్ పుర్ మరియు థావర్ లలో ఏర్పాటు కానున్న 100 టన్నుల సామర్ధ్యం కలిగిన నాలుగు గోబర్ గ్యాస్ ప్లాంటుల కు సైతం ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారి లో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయీ పటేల్ తదితరులు ఉన్నారు.

ఈ కార్యక్రమాని కి హాజరు కావడానికన్నా ముందు, బనాస్ డెయరి తో తనకు ఉన్న అనుబంధాన్ని గురించి ప్రధాన మంత్రి ట్విటర్ లో తన మనోభావాల ను పొందుపరచారు. 2013 మరియు 2016 సంవత్సరాల లో బనాస్ డెయరి ని తాను సందర్శించినప్పటి ఛాయాచిత్రాల ను కూడా ట్వీట్ కు జత చేశారు. ‘‘గత కొన్నేళ్ళ లో, బనాస్ డెయరి స్థానిక సముదాయాలు, ప్రత్యేకించి రైతుల కు మరియు మహిళల కు సాధికారిత కల్పన లో ఒక కేంద్రస్థానం గా మారిపోయింది. మరీ ముఖ్యం గా వివిధ ఉత్పత్తుల ను తయారు చేయడం లో ఈ డెయరి ప్రదర్శిస్తున్నటువంటి నూతన ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే నాకు గర్వంగా ఉంటోంది. తేనె పట్ల వారు అదే పని గా తీసుకొంటున్న శ్రద్ధ కూడా మెచ్చుకోదగ్గదిగా ఉంది.’’ అని ప్రధాన మంత్రి అన్నారు. బనాస్ కాంఠా ప్రజల ప్రయాస లు మరియు వారి లో తొణికిసలాడుతున్నటువంటి ఉత్సాహాన్ని కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘‘బనాస్ కాంఠా ప్రజానీకాన్ని వారి యొక్క కఠోర శ్రమ, ఇంకా వారి లో ఆటు పోటుల ను ఎదుర్కొనే స్థైర్యం.. వీటి ని నేను కొనియాడదలచాను. వ్యవసాయం లో ఈ జిల్లా వేసిన ముద్ర అభినందనీయమైంది గా ఉంది. రైతు లు కొత్త కొత్త సాంకేతిక మెలకువలను అలవరచుకొన్నారు, నీటి ని ఆదా చేయడం పై శ్రద్ధ వహించారు, మరి వీటి తాలూకు ఫలితాల ను అంతా గమనించవచ్చును.’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

 

ప్రధాన మంత్రి ఈ రోజు న తన ప్రసంగం మొదట్లో, మాత అంబా జీ యొక్క పవిత్రమైనటువంటి భూమి కి ఇవే నమస్సులు అని పేర్కొన్నారు. బనాస్ ప్రాంత మహిళల దీవెనల ను గురించి ఆయన ప్రస్తావించి, వారి అజేయ స్ఫూర్తి పట్ల తన గౌరవాన్ని వ్యక్తం చేశారు. భారతదేశం లో మాతృమూర్తుల మరియు సోదరీమణుల సశక్తీకరణ ద్వారా గ్రామాల తాలూకు ఆర్థిక వ్యవస్థ ను ఎలా బలోపేతం చేయవచ్చో అనేది, అలాగే సహకార ఉద్యమం ఆత్మనిర్భర భారత్ ప్రచార ఉద్యమాని కి ఏ విధం గా అండదండల ను అందించ గలదనేది ఎవరైనా ఇట్టే గ్రహించవచ్చును అని ప్రధాన మంత్రి అన్నారు. వారాణసీ లో కూడా ఒక భవన సముదాయాన్ని నెలకొల్పినందుకు గాను బనాస్ కాంఠా ప్రజల కు మరియు బనాస్ డెయరి కి కాశీ యొక్క పార్లమెంటు సభ్యుని గా ప్రధాన మంత్రి తన కృతజ్ఞత ను వెలిబుచ్చారు.

బనాస్ డెయరి లో కార్యకలాపాల విస్తరణ ను గురించి ప్రధాన మంత్రి చెబుతూ, బనాస్ డెయరి కాంప్లెక్స్, జున్ను తయారీ ప్లాంటు, పాల విరుగుడు తేట ప్లాంటు.. ఇటువంటివి అన్నీ కూడా పాడి రంగం విస్తరణ లో ముఖ్యమైనవి. అయితే, బనాస్ డెయరి స్థానిక రైతుల ఆదాయాన్ని పెంచడాని కి ఇతర వనరుల ను కూడా ఉపయోగించుకోవచ్చును అని నిరూపించింది అని ప్రధాన మంత్రి అన్నారు. బంగాళా దుంపలు, తేనె, ఇంకా ఇతర సంబంధి ఉత్పత్తులు రైతు ల ప్రారబ్ధాన్ని మార్చుతున్నాయి అని ఆయన అన్నారు. పాడి రంగం ఫూడ్ ఆయిల్ మరియు వేరుసెనగల వంటి వాటి లోకి కూడా విస్తరిస్తోందని పేర్కొన్నారు. ఇది వోకల్ ఫార్ లోకల్ (స్థానిక ఉత్పత్తుల కొనుగోలు కు మొగ్గు చూపడం) అనే ప్రచార ఉద్యమాని కి కూడా దన్ను గా నిలబడుతోంది అని ఆయన అన్నారు. గోబర్ ధన్ లో పాడి సంబంధి ప్రాజెక్టు లను ఆయన ప్రశంసిస్తూ, చెత్త నుంచి సంపద ను సృష్టించాలి అనే దిశ లో ప్రభుత్వ ప్రయాసల కు సమర్థన గా అటువంటి ప్లాంటుల ను దేశం అంతటా ఏర్పాటు చేయడం ద్వారా డెయరి ప్రాజెక్టు లు సహాయకారి అవుతున్నాయన్నారు. పల్లెల లో స్వచ్ఛత ను పరిరక్షించడం ద్వారా ఈ ప్లాంటు లు లాభపడతాయి. పేడ (గోబర్) ద్వారా రైతుల కు ఆదాయాన్ని సమకూర్చుతాయి. విద్యుత్తు ఉత్పత్తి కి దోహదపడుతాయి; ఇంకా, ప్రాకృతిక ఎరువు తో భూమి కి సురక్ష చేకూరుతుంది అని ఆయన వివరించారు. ఆ తరహా ప్రయాస లు మన పల్లెల ను, మన మహిళల ను పటిష్టపరుయి; ధరణి మాత ను పరిరక్షిస్తాయి అని ఆయన అన్నారు.

గుజరాత్ వేసిన ముందంజల ను చూస్తే తనకు గర్వం గా ఉంది అని ప్రధాన మంత్రి అంటూ, నిన్నటి రోజు న విద్య సమీక్ష కేంద్రాన్ని తాను చుట్టి వచ్చిన సంగతి ని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి నాయకత్వం లో ఆ కేంద్రం కొత్త శిఖరాల ను అందుకొంటోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం ఈ కేంద్రం 54,000 పాఠశాలల తో పాటుగా, 4.5 లక్షల మంది టీచర్ లతో, 1.5 కోట్ల మంది విద్యార్థుల తో గుజరాత్ లో ఒక చైతన్యభరితమైనటువంటి కేంద్రం గా మారిపోయింది. ఈ కేంద్రం లో ఎఐ, మశీన్ లర్నింగ్, బిగ్ డేటా ఎనాలిటిక్స్ ల వంటివి నెలకొన్నాయి. ఈ కార్యక్రమం లో భాగం గా చేపట్టిన చర్యల తో పాఠశాలల్లో హాజరు 26 శాతం మేరకు మెరుగు పడింది అని ఆయన వివరించారు. ఇటువంటి ప్రాజెక్టు లు దేశం లో విద్య రంగ ముఖచిత్రం లో దూరగామి పరివర్తనల ను తీసుకు రాగలుగుతాయి అని ఆయన అన్నారు. ఈ తరహా కేంద్రాన్ని అధ్యయనం చేసి, ఇటువంటి కేంద్రాన్ని నెలకొల్పుకోవలసింది గా ఇతర రాష్ట్రాల కు, అధికారుల కు, సంబంధిత వర్గాల కు ప్రధాన మంత్రి సూచన చేశారు.

ప్రధాన మంత్రి గుజరాతీ భాష లో కూడా మాట్లాడారు. బనాస్ డెయరి సాధించిన పురోగతి పట్ల ఆయన తన సంతోషాన్ని మరోసారి వ్యక్తం చేసి, బనాస్ మహిళ ల ఉత్సాహాన్ని ప్రశంసించారు. బనాస్ కాంఠా లో మహిళ లు వారి పశుగణాన్ని వారి సంతానం లాగా సంరక్షిస్తున్నారు అంటూ వారికి ఆయన ప్రణామాన్ని ఆచరించారు. బనాస్ కాంఠా ప్రజల పట్ల ప్రధాన మంత్రి తన ప్రేమ ను పునరుద్ఘాటిస్తూ, తాను ఎక్కడి కి వెళ్ళినప్పటి కీ కూడాను వారి తో ఎల్లప్పటకీ బంధాన్ని కలిగివుంటానని పేర్కొన్నారు. ‘‘మీ పొలాల్లో ఒక భాగస్వామి మాదిరి గా నేను ఉంటాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

బనాస్ డెయరి దేశం లో ఒక కొత్త ఆర్థిక శక్తి ని సృష్టించింది అని ప్రధాన మంత్రి అన్నారు. బనాస్ డెయరి ఉద్యమం ఉత్తర్ ప్రదేశ్, హరియాణా, రాజస్థాన్, ఒడిశా (సోమ్ నాథ్ నుంచి జగన్నాథ్ దాకా), ఆంధ్ర ప్రదేశ్ మరియు ఝార్ ఖండ్ వంటి రాష్ట్రాల లో రైతుల కు మరియు పశువుల ను పెంచే సముదాయాల కు సహాయకారి గా ఉంటోందని ప్రధాన మంత్రి అన్నారు. పాడి రంగం ప్రస్తుతం రైతుల ఆదాయాని కి తోడ్పడుతోంది అని ఆయన అన్నారు. 8.5 లక్షల కోట్ల రూపాయల పాల ను ఉత్పత్తి చేయడం ద్వారా పాడి రంగం సాంప్రదాయిక ఆహార ధాన్యాల కంటె కూడా రైతుల కు- మరీ ముఖ్యం గా కమతాలు చిన్నవి అయిపోయిన, పరిస్థితులు జటిలం గా మారిపోయిన చోట్ల- ఇంకా కాస్త పెద్దదైన ఆదాయ మాధ్యమం గా ఎదుగుతున్నది అని ఆయన అన్నారు. రైతుల ఖాతాల లోకి ప్రత్యక్ష ప్రయోజనం బదలాయింపు ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఇంతకు మునుపు రూపాయి లో కేవలం 15 పైసలు మాత్రమే లబ్ధిదారు కు చేరాయి అంటూ ఓ ప్రధాని గతం లో అభివర్ణించిన విధం గా కాకుండా ప్రస్తుతం ప్రయోజనాలు పూర్తి గా లబ్ధిదారుల కు అందుతున్నాయి అని పేర్కొన్నారు.

ప్రాకృతిక వ్యవసాయం పై ప్రధాన మంత్రి తన శ్రద్ధ ను గురించి నొక్కి చెప్తూ, జల సంరక్షణ ను, బిందు సేద్యాన్ని బనాస్ కాంఠా అక్కున చేర్చుకున్నట్లు గుర్తు కు తీసుకు వచ్చారు. నీటి ని వారు ప్రసాదంగా మరియు బంగారం గా పరిగణిస్తూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంవత్సరం లో మొదలుపెట్టి 2023వ సంవత్సరం లో స్వాతంత్య్ర దినం వచ్చే సరికల్లా 75 భవ్య సరోవరాల ను నిర్మించాలి అంటూ ప్రధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

 

******

DS

 

 

 



(Release ID: 1818084) Visitor Counter : 170