ప్రధాన మంత్రి కార్యాలయం

దేశం ప్రస్తుతం స్వచ్ఛత తాలూకు నూతన గాథల ను లిఖిస్తోంది: ప్రధాన మంత్రి

Posted On: 18 APR 2022 11:34AM by PIB Hyderabad

ప్రజల భాగస్వామ్యం అనేది దేశం యొక్క అభివృద్ధి కి ఒక కొత్త శక్తి ని అందించింది, మరి దీని కి స్వచ్ఛ్ భారత్ అభియాన్ ఒక ఉదాహరణ గా ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

టాయిలెట్ ల నిర్మాణం కావచ్చు, లేదా వ్యర్థాల ను పరిష్కరించడం కావచ్చు, వారసత్వాన్ని పరిరక్షించడం కావచ్చు, లేదా స్వచ్ఛత కోసం స్పర్థ కావచ్చు.. స్వచ్ఛత రంగం లో దేశం కొత్త కథల ను వ్రాస్తున్నది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ప్రజల భాగస్వామ్యం ఏ విధం గా ఏ దేశం యొక్క అభివృద్ధి లో అయినా సరికొత్త శక్తి ని నింపగలుగుతుంది అనే దానికి స్వచ్ఛ భారత్ అభియాన్ ఒక ప్రత్యక్ష ప్రమాణం గా నిలుస్తుంది. టాయిలెట్ ల నిర్మాణం కావచ్చు, లేదా వ్యర్థ పదార్థాల ను పరిష్కరించడం కావచ్చు, లేదా చరిత్రాత్మక కట్టడాల సంరక్షణ కావచ్చు, లేదా పారిశుధ్యం సంబంధి పోటీ కావచ్చు.. దేశం ప్రస్తుతం స్వచ్ఛత రంగం లో ప్రతి రోజూ కొత్త కొత్త కథల ను వ్రాస్తున్నది’’ అని పేర్కొన్నారు.

****

DS/ST

 

 



(Release ID: 1817761) Visitor Counter : 138