ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 కొత్త వేరియంట్‌ XE-పై కీలక నిపుణులు మరియు అధికారులతో జరిగిన సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


కొత్త వేరియంట్‌ వెలుగుచూసే, కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పర్యవేక్షణ, నిఘాను పెంచాలని అధికారులను ఆదేశించిన మంత్రి

Posted On: 12 APR 2022 11:57AM by PIB Hyderabad

కోవిడ్ -19 కొత్త వేరియంట్‌  XE-పై కీలక నిపుణులు మరియు అధికారులతో  కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు సమీక్షించారు. నిపుణులు, అధికారులు మంత్రి అధ్యక్షతన సమావేశం అయ్యారు. సమావేశంలో మంత్రి  దేశంలో కోవిడ్-19 కేసుల పరిస్థితిని సమీక్షించారు.కొత్త  వేరియంట్‌ వెలుగుచూసే, కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో  పర్యవేక్షణ, నిఘాను పెంచాలని  అధికారులను ఆయన ఆదేశించారు.  

 

వైద్య మౌలిక సదుపాయాలు మరియు వనరుల లభ్యతను సమీక్షించిన డాక్టర్ మాండవీయ  కోవిడ్ చికిత్సకు అవసరమైన అవసరమైన మందులు మరియు ఔషధాల లభ్యతను నిరంతరం సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న టీకా కార్యక్రమాన్ని  పూర్తి స్థాయిలో నిర్వహించాలనిఅర్హులందరికీ టీకాలు వేయాలని ఆయన సూచించారు. .

 

ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడుఆరోగ్యం డాక్టర్ వి.కె. పాల్  ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాఐసిఎంఆర్ డిజి డాక్టర్ బలరామ్ భార్గవఎన్‌టిఎజిఐ డాక్టర్ ఎన్‌కె అరోరా మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు  పాల్గొన్నారు.

 

***



(Release ID: 1816025) Visitor Counter : 131