ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్ లోని భరూచ్ లో ఒక కర్మాగారం లో దుర్ఘటన కారణం గా ప్రాణ నష్టం జరగడంపట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని ప్రకటించారు
నాడు పోస్టు చేయడమైనది:
11 APR 2022 2:11PM by PIB Hyderabad
గుజరాత్ లో గల భరూచ్ లో ఒక కర్మాగారం లో దుర్ఘటన జరిగి ప్రాణనష్టాని కి దారితీయడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి మృతుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతున, గాయపడిన వారికి 50,000 రూపాయల వంతున పరిహారాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘భరూచ్ లోని ఒక కార్ఖానా లో దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం జరగడం పట్ల ప్రధాన మంత్రి @narendramodi దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు ఆయన సంతాపాన్ని తెలియజేశారు.
పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి తలా 2 లక్షల రూపాయల పరిహారాన్ని మృతుల దగ్గరి సంబంధికుల కు ఇవ్వడం జరుగుతుంది; గాయపడిన వారికి 50,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది’’ అని తెలిపింది.
******
DS/ST
(రిలీజ్ ఐడి: 1815635)
సందర్శకుల సూచీ సంఖ్య : : 187
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam