ఆర్థిక మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి ముద్రా యోజన ప్రారంభం నుంచి ఇంతవరకు రూ.18.60 లక్షల కోట్ల విలువైన 34.42 కోట్ల పైగా రుణ ఖాతాలు
సామాజిక న్యాయం కోసం ప్రధానమంత్రి ముద్ర యోజన: గౌరవ ప్రధాన మంత్రి 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' దార్శనికతకు నిజమైన స్ఫూర్తి: కేంద్ర ఆర్థిక మంత్రి
రుణ సహాయం కోసం ఆశగా ఎదురుచూసే 'ఆకాంక్షిత జిల్లాల' పెరుగుతున్న లబ్ధిదారులకు పిఎమ్ఎంవై ద్వారా రుణ ప్రవాహం: ఆర్థిక శాఖ సహాయ మంత్రి
Posted On:
08 APR 2022 8:00AM by PIB Hyderabad
విలక్షణ మౌలిక లక్షణాలతో ఆర్థిక సమ్మిళితానికి దోహదం చేసిన ప్రధాన మంత్రి ముద్ర యోజన (పి ఎం ఎం వై) ఏడవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భం లో ఈ పథకం ప్రధాన అంశాలు, దాని విజయాలను చూద్దాం.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2015, ఏప్రిల్ 8వ తేదీన కార్పొరేట్, వ్యవసాయేతర చిన్న/సూక్ష్మ పరిశ్రమలకు రూ. 10 లక్షల వరకు రుణాలు అందించడం కోసం ప్రధాన మంత్రి ముద్ర యోజన (పి ఎం ఎం వై ) ను ప్రారంభించారు.
ఈ పథకం 7వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, కేంద్ర ఆర్థిక & కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి. నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, “ఆదాయ కల్పన కార్యకలాపాల కల్పన కోసం ఈ పథకం కింద రూ.18.60 లక్షల కోట్ల మేర 34.42 కోట్లకు పైగా రుణ ఖాతాలు తెరవడం విశేషం” అన్నారు.
పి ఎమ్ ఎమ్ వై ద్వారా వ్యాపార వాతావరణం , పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం అనే అంశంపై ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, "ఈ పథకం ముఖ్యంగా చిన్న వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడింది. ఇంకా అట్టడుగు స్థాయిలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడంలో సహాయపడింది. 68% కంటే ఎక్కువ రుణ ఖాతాలు మహిళలకు మంజూరు అయ్యాయి. 22% రుణాలు ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి ఎటువంటి రుణం పొందని కొత్త పారిశ్రామికవేత్తలకు ఇవ్వబడ్డాయి‘‘ అన్నారు.
ముద్రా లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, ఇతర ఔత్సాహికులు కూడా ముందుకు వచ్చి ఈ పథకాన్ని ఉపయోగించు కోవడం ద్వారా దేశ నిర్మాణ ప్రక్రియలో పాలుపంచుకోవాలని శ్రీమతి. సీతారామన్ విజ్ఞప్తి చేశారు. “ఇప్పటి వరకు మంజూరు చేసిన మొత్తం రుణాలలో 51% ఎస్ సి/ ఎస్ టి/ ఓ బి సి వర్గానికి అందించడం ద్వారా ప్రధాన మంత్రి ముద్రా యోజన ఆచరణ లో సామాజిక న్యాయం కోసం నిలిచింది. అలాగే ప్రధాన మంత్రి ఆశించిన విధంగా 'సబ్కా సాత్, సబ్కా వికాస్' నిజమైన స్ఫూర్తిని కలిగి ఉంది‘‘ అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి (ఎం ఓ ఎస్ ) డాక్టర్ భగవత్
కిషన్‌రావ్ కరాద్ మాట్లాడుతూ, “ సూక్ష్మ, చిన్న , మధ్యతరహా పరిశ్రమలకు ఎలాంటి అడ్డంకులు, అవాంతరాలు లేకుండా సంస్థాగత రుణాన్ని అందించడమే ప్రధాన మంత్రి ముద్రా యోజన (పి ఎం ఎం వై) ప్రారంభించడం వెనుక ఉన్న చోదక శక్తి‘‘ అని అన్నారు.
"ఈ పథకం ప్రారంభమైన గత ఏడేళ్ల నుంచి 34.42 కోట్ల మంది ఖాతాదారులకు సహాయం అందించడం ద్వారా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విజయవంతంగా చేరువైంది" అని డాక్టర్ భగవత్
కిషన్‌రావ్ కరాద్ అన్నారు.
‘‘నీతి ఆయోగ్ గుర్తించిన 'ఆకాంక్షాత్మక జిల్లాల' నుండి పెరుగుతున్న లబ్ధిదారులకు ఈ పథకం నిరంతరాయంగా రుణాలను అందించగలిగింది, తద్వారా రుణాలు అందుబాటు.లో లేక ఇబ్బందులు పడే జిల్లాలకు రుణ ప్రవాహాన్ని సులభతరం చేసింది" అని ఆర్థిక శాఖ మంత్రి చెప్పారు.
దేశంలో ఆర్థిక చేర్పు (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) కార్యక్రమం అమలు మూడు స్తంభాలపై ఆధారపడి ఉంది, అవి బ్యాంకింగ్ ది అన్‌బ్యాంక్డ్, సెక్యూరింగ్ ది అన్‌సెక్యూర్డ్ ఫండింగ్ ది అన్‌ఫండ్డ్. ఈ మూడు లక్ష్యాలను కొనసాగుతున్న ముద్ర యోజన పథకం సాంకేతికతను ఉపయోగించుకోవడం బహుళ-స్టేక్‌హోల్డర్ల సహకార విధానాన్ని అవలంబించడం ద్వారా సాధిస్తోంది. అదే సమయంలో ఆర్థిక సేవలకు దూరంగా ఉన్న, వెనుకబడిన వారికి కూడా లబ్ది చేకూరుస్తోంది.
ఆర్థిక చేర్పు మూడు స్తంభాలలో ఒకటి - అయిన ఫండింగ్ ది అన్ ఫండింగ్- పి ఎం ఎం వై ద్వారా ఎఫ్ ఐ ఎకోసిస్టమ్ లో ప్రతిబింబిస్తుంది, ఇది చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణ ప్రాప్యతను అందించే లక్ష్యంతో అమలు జరుగుతోంది.
వివిధ చొరవల ద్వారా వర్ధమాన పారిశ్రామికవేత్తల నుండి కష్టపడి పనిచేసే రైతుల వరకు అన్ని వాటాదారుల ఆర్థిక అవసరాలపై పి ఎం ఎం వై దృష్టి పెట్టింది.
అట్టడుగున ఉన్న ,ఇప్పటివరకు సామాజిక-ఆర్థికంగా నిర్లక్ష్యానికి గురైన తరగతులకు ఆర్థిక సహాయం అందించడంలో ఇది కీలకమైన చొరవ, ప్రధాన మంత్రి ముద్ర యోజన స్వీయ-విలువ ,స్వతంత్ర్య భావనతో పాటు లక్షలాది మంది కలలు ,ఆకాంక్షలకు రెక్కలు ఇచ్చింది.
పి ఎం ఎం వై ప్రధాన ఉద్దేశాలు, గడిచిన ఏడు సంవత్సరాల్లో దాని విజయాలను మనం ఇప్పుడు చూద్దాం:
ప్రధాన మంత్రి ముద్రా యోజన (పిఎమ్ ఎమ్ వై) ప్రధాన అంశాలు:
*పి ఎం ఎం వై కింద మెంబర్ లెండింగ్ ఇనిస్టిట్యూషన్ లు (ఎం ఎల్ ఐ) - బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్ బిఎఫ్ సి), మైక్రో ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ లు (ఎం ఎఫ్ ఐ), ఇతర ఫైనాన్షియల్ మధ్యవర్తులు అనే రుణగ్రహీతల ఎదుగుదల లేదా అభివృద్ధి , ఫండింగ్ అవసరాలను సూచించే 'శిశు', 'కిశోర్' 'తరుణ్' అనే మూడు కేటగిరీల ద్వారా రూ. 10 లక్షల వరకు రుణాలు అందించబడతాయి.
i.శిశు: రూ. 50,000 వరకు రుణాలను కవర్ చేస్తుంది.
ii. కిషోర్: రూ. 50,000 కంటే ఎక్కువ మరియు రూ. 5 లక్షలు వరకు
రుణాలను కవర్ చేస్తుంది.
III.తరుణ్: రూ. 5 లక్షల కంటే ఎక్కువ మరియు రూ. 10 లక్షలు వరకు రుణాలను కవర్ చేస్తుంది.
*కొత్త తరం ఔత్సాహిక యువతలో ఆంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో, కిషోర్ ,తరుణ్ కేటగిరీల తర్వాత శిశు కేటగిరీ రుణాలపై ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది.
*శిశు, కిషోర్ ,తరుణ్ కింద సూక్ష్మ పరిశ్రమల రంగం అభివృద్ధి , పెరుగుదల పరిధి, మొత్తం లక్ష్యంలో, ముద్ర ద్వారా అందిస్తున్న ఉత్పత్తులు వివిధ రంగాలు / వ్యాపార కార్యకలాపాల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి.
*పౌల్ట్రీ, డెయిరీ, తేనెటీగల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు సహా, తయారీ, ట్రేడింగ్ ,సేవా రంగాలలో ఆదాయాన్ని వృద్ధి చేసే కార్యకలాపాల కోసం టర్మ్ లోన్ గానూ, వర్కింగ్ క్యాపిటల్ గానూ కూడా పిఎమ్ ఎమ్ వై కింద రుణాలు అందించబడతాయి.
*వడ్డీ రేటును ఆర్ బిఐ మార్గదర్శకాల ప్రకారం రుణ సంస్థలు నిర్ణయిస్తాయి. వర్కింగ్ క్యాపిటల్ సదుపాయం ఉన్నట్లయితే, రుణగ్రహీత రాత్రంతా కలిగి ఉన్న డబ్బుపై మాత్రమే వడ్డీ వసూలు చేస్తారు.
ముద్రా పథకం విజయాలు (25.03.2022 నాటికి)
*పథకం ప్రారంభించినప్పటి నుండి 25.03.2022 నాటికి 34.42 కోట్ల కంటే ఎక్కువ ఖాతాలకు రూ. 18.60 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేశారు. మొత్తం రుణాలలో సుమారు 22% కొత్త పారిశ్రామికవేత్తలకు మంజూరు చేశారు.
*రూ.3.07 లక్షల కోట్ల మంజూరు చేయబడ్డ మొత్తంతో 4.86 కోట్ల పిఎమ్ ఎమ్ వై రుణాల ఖాతాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (25.03.2022 నాటికి) పొడిగింపు
*మొత్తం రుణాల్లో సుమారు 68% రుణాలు మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మంజూరు చేశారు.
*రుణాల సగటు టిక్కెట్ సైజు సుమారు రూ. 54,000/-
*రుణాల్లో 86% 'శిశు' కేటగిరీకి చెందినవి.
*దాదాపు 22% రుణాలు కొత్త ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇచ్చారు.
*ఎస్సీ, ఎస్టీ రుణగ్రహీతలకు 23 శాతం రుణాలు ఇచ్చారు. సుమారు 28% రుణాలు ఒబిసి రుణగ్రహీతలకు మంజూరు చేశారు. (మొత్తం 51% రుణాలు ఎస్ సి/ఎస్ టి/ఒబిసి కేటగిరీల రుణగ్రహీతలకు మంజూరు చేశారు.)
*సుమారు 11% రుణాలు మైనారిటీ కమ్యూనిటీ రుణగ్రహీతలకు ఇచ్చారు.
కేటగిరీల వారీగా వివరాలు :
కేటగిరీ
|
రుణాల సంఖ్య (%)
|
మంజూరైన మొత్తం (%)
|
శిశు
|
86%
|
42%
|
కిశోర్
|
12%
|
34%
|
తరుణ్
|
2%
|
24%
|
మొత్తం
|
100%
|
100%
|
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఒక్క 2020-21 ఆర్థిక సంవత్సరం మినహా ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి లక్ష్యాలను సాధించారు. సంవత్సరం వారీగా మంజూరు అయిన మొత్తం వివరాలు దిగువ చూడవచ్చు:
సంవత్సరం
|
మంజూరైన రుణాల సంఖ్య (కోట్లలో)
|
మంజూరైన మొత్తం
(రూ. లక్ష కోట్లు)
|
2015-16
|
3.49
|
1.37
|
2016-17
|
3.97
|
1.80
|
2017-18
|
4.81
|
2.54
|
2018-19
|
5.98
|
3.22
|
2019-20
|
6.22
|
3.37
|
2020-21
|
5.07
|
3.22
|
2021-22 (25.03.2022 నాటికి)*
|
4.86
|
3.07
|
మొత్తం
|
34.42
|
18.60
|
*తాత్కాలిక
ఇతర సంబంధిత సమాచారం
అర్హత కలిగిన రుణగ్రహీతలందరికీ పి ఎం ఎం వై కింద 12 నెలలకు మంజూరు చేసిన శిశు రుణాల సకాల చెల్లింపుపై 2% వడ్డీ రాయితీ.
*ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ (ఏ ఎన్ బి పి) కింద 14.05.2020 న కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన ఈ పథకం అపూర్వమైన పరిస్థితికి ఒక నిర్దిష్ట ప్రతిస్పందనగా రూపు దిద్దుకుంది. అట్టడుగున ఉన్న రుణగ్రహీతలకు వారి రుణ భారాన్ని తగ్గించడం ద్వారా ఆర్థిక ఒత్తిడిని నివారించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
*2020 జూన్ 24న కేంద్ర మంత్రివర్గం ఈ పథకానికి ఆమోదం తెలిపింది.
*భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్- స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ ఐ డీ బీ ఐ) కు రూ.775 కోట్లు విడుదలయ్యాయి.
*పథకం అమలు: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పి ఎస్ బి), ప్రైవేట్ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్ ఆర్ బి), స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్ ఎఫ్ బి), నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్ బి ఎఫ్ సి) , మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ (ఎంఎఫ్ఐ) వంటి అన్ని కేటగిరీల ఎంఎల్ఐల ద్వారా.
పనితీరు: 25.03.2022 నాటికి, సిడ్బీకి విడుదల చేసిన రూ.775 కోట్లలో రూ.658.25 కోట్లకు పైగా సబ్సిడీ మొత్తాన్ని రుణగ్రహీతల ఖాతాల్లో జమ చేయడం కోసం ఎం ఎల్ ఐలకు
ఎస్ ఐ డీ బీ విడుదల చేసింది.
****
(Release ID: 1814723)
Visitor Counter : 249
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam