యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కామన్వెల్త్ మరియు ఆసియా క్రీడల్లో పాల్గొనే అథ్లెట్ల శిక్షణ కోసం క్రీడా మంత్రిత్వ శాఖ రూ. 190 కోట్లు ఖర్చు చేస్తోంది.


భారత జట్ల ఎంపిక సజావుగా సాగడం కోసం ఎన్ఎస్ఎఫ్ల గుర్తింపును పునరుద్ధరించింది.

నాడు పోస్టు చేయడమైనది: 04 APR 2022 4:12PM by PIB Hyderabad

కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ 33 క్రీడా విభాగాలకు సంబంధించిన వార్షిక క్యాలెండర్ ఆఫ్ ట్రైనింగ్ & కాంపిటీషన్స్ (ఏసీటీసీ)ని ఖరారు చేసింది. అంతేకాకుండా వివిధ జాతీయ క్రీడా సమాఖ్యలకు (నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లు) సహాయంగా 2022–-23 ఆర్థిక సంవత్సరానికి రూ.259 కోట్లు కేటాయించింది. ఇందులో కామన్వెల్త్ గేమ్స్2022, ఆసియాగేమ్స్ 2022 లో పాల్గొనే అథ్లెట్ల శిక్షణ కోసం, పరికరాలు, మరియు సిబ్బంది కోసం రూ.190 కోట్లు ఖర్చు చేస్తారు. 2022 సంవత్సరానికి వారి ప్రణాళికాబద్ధమైన పోటీ మరియు శిక్షణ క్యాలెండర్‌పై 33 ఎన్ఎస్ఎఫ్లతో వివరణాత్మక చర్చల ఆధారంగా బడ్జెట్ నిర్ణయించబడింది. -23, ఆగస్ట్, 2022లో యూకేలోని బర్మింగ్‌హామ్‌లో జరగబోయే కామన్వెల్త్ గేమ్స్ (సీడబ్లూజీ) మరియు సెప్టెంబర్ 2022లో చైనాలోని గ్వాంగ్‌జౌలో జరిగే ఆసియా క్రీడలలో పాల్గొనే అథ్లెట్ల శిక్షణ మరియు పోటీ అవసరాలకు సంబంధించిన ప్రతిపాదనలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ రెండు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఈవెంట్‌లలో పాల్గొనే అథ్లెట్లకు అందిస్తున్న సహాయసహకారాలను మరింత పెంచడానికి మంత్రిత్వశాఖ చురుగ్గా సంప్రదింపులు జరుపుతూ.. అవసరమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతోంది. ఇప్పటికే మంత్రిత్వ శాఖ ఆమోదించిన 33 ఫెడరేషన్‌ల ఏసీటీసీలతో పాటు, మరో 3 ఎన్ఎస్ఎఫ్ల ఏసీటీసీలపై  సంప్రదింపుల సమావేశాలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన బడ్జెట్‌లు కూడా త్వరలో ఖరారు కానున్నాయి.

కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 2022-–23 సంవత్సరానికి జాతీయ క్రీడా సమాఖ్యలు సమర్పించిన శిక్షణ మరియు పోటీలకు సంబంధించిన ప్రణాళికలు మరియు ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించిందని,  ముఖ్యంగా రాబోయే కామన్వెల్త్ గేమ్స్ 2022, ఆసియా గేమ్స్2022 మరియు పారా ఏషియన్ గేమ్స్ 2022లకు సంబంధించి ఏసీటీసీలు ఆమోదించబడ్డాయన్నారు. అథ్లెట్ల సన్నాహకానికి నిధులు అడ్డంకి కాబోవని, క్రీడాకారులకు, ఎన్‌ఎస్‌ఎఫ్‌లకు అవసరమైన అన్ని సహాయ, సహకారాన్ని మంత్రిత్వ శాఖ అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులు మరియు జట్లు తమ శిక్షణపై పూర్తిగా దృష్టి సారించాలని మరియు వారి అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చాలని,  తద్వారా రాబోయే ఈవెంట్‌లలో గరిష్ట సంఖ్యలో పతకాలు సాధించి, దేశం గర్వించేలా చేయాలని మంత్రి అనురాగ్ ఠాకూర్ పిలుపునిచ్చారు.

1 మార్చి, 2022 నుంచి అమలులోకి వచ్చిన.. సవరించిన నిబంధనల ఆధారంగా2022–-23 కోసం ఏసీటీసీల కింద జాతీయ క్రీడా సమాఖ్యలకు నిధులు అందించబడ్డాయి. మారుతున్న క్రీడా అవసరాలను తీర్చడానికి పథకం కింద గణనీయమైన పెంపుదలలకు నిర్ణయం తీసుకున్నారు.

సవరించిన నిబంధనల ప్రకారం..  జాతీయ ఛాంపియన్‌షిప్‌లకు  రూ.51 లక్షలు కేటాయించారు. అధిక ప్రాధాన్యత, ప్రాధాన్యత మరియు భారతీయ సాంప్రదాయ క్రీడల ప్రాతిపదికన ఈ కేటాయింపులు జరిగాయి. మరియు గతంలో 'అదర్స్'గా పిలువబడే జనరల్ కేటగిరీ క్రీడలకు రూ.22 లక్షలకు బదులుగా రూ.30 లక్షలు(అన్ని కేటగిరీల క్రీడా విభాగాలకు ముందుగా నిర్ణయించిన ప్రకారం) కేటాయించారు.   జనరల్ స్పోర్ట్స్ ట్రైనింగ్ కిట్ (ట్రాక్ సూట్లు, టీ-షర్టులు, షార్ట్‌లు, వార్మ్ అప్ షూస్ మొదలైనవి) కోసం భత్యం రెండింతలు చేశారు. ఒక్కో అథ్లెట్కు జాతీయ శిబిరాలకు సంవత్సరానికి ఒకసారి అథ్లెట్‌కు రూ.20,000 అందజేస్తారు. దేశంలో అంతర్జాతీయ టోర్నమెంట్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి జాతీయ క్రీడా సమాఖ్యలను ప్రోత్సహించడం కోసం, సహాయం మొత్తం గతంలో  రూ.30 లక్షలు ఇస్తుండగా దానిని కోటి రూపాయలకు పెంచారు.  అర్హత కలిగిన మరియు అత్యుత్తమ నాణ్యత గల సహాయక సిబ్బందిని ఆకర్షించడానికి వేతనం గణనీయంగా పెంచబడింది. క్రీడా వైద్యులు, వైద్యుల వేతనాన్ని లక్ష రూపాయల వరకు పెంచారు. హెడ్ ఫిజియోథెరపిస్టులకు, ఫిజియో థెరపిస్టులకు వరుసగా రూ.2 లక్షలు, రూ.1.5లక్షలు పెంచారు. గతంలో వీరికి నెలకు రూ.80వేలు మాత్రమే చెల్లించేవారు.

అంతేకాకుండా రాబోయే మెగా స్పోర్ట్స్ ఈవెంట్లకు క్రీడాకారులను సిద్ధం చేసి, వారి ప్రయత్నాలలో ఎటువంటి అడ్డంకులు ఎదురవకుండా చూసేందుకు క్రీడా మంత్రిత్వశాఖ 2022 సంవత్సరానికిగాను అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలంచి.. 2011, స్పోర్ట్స్ కోడ్ నిబంధలనకు అనుగుణంగా ఉన్న 38 జాతీయ క్రీడా సమాఖ్యల గుర్తింపులను పునరుద్ధరించింది. మరికొన్ని జాతీయ క్రీడా సమాఖ్యల గుర్తింపు పునరుద్ధరణ పరిశీలనలో ఉంది. 


(రిలీజ్ ఐడి: 1813491) సందర్శకుల సూచీ సంఖ్య : : 171
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Tamil , Kannada