ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అంబులెన్సులను జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.మన్‌సుఖ్ మాండవీయ

Posted On: 04 APR 2022 10:51AM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా.మన్‌సుఖ్ మాండవీయ, సహాయ మంత్రి డా. భారతి ప్రవీణ్ పవార్ 33 అంబులెన్స్‌లను (13 అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌లు, 20 బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌లు) జెండా ఊపి ప్రారంభించారు. న్యూదిల్లీలోని నిర్మాణ్ భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. కేంద్ర రసాయనాలు & ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖుబా కూడా ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.

 

 

అంబులెన్స్‌ల ద్వారా అందించే సౌకర్యాలు, సేవల గురించి కేంద్ర మంత్రులకు అధికారులు వివరించారు.

మన దేశంలో కొవిడ్ ప్రతిస్పందన కోసం కేటాయించిన నిధుల నుంచి కొంత మొత్తాన్ని...  ఏఎల్‌ఎస్‌ అంబులెన్స్‌లు, బీఎల్‌ఎస్‌ అంబులెన్స్‌లు, సంచార ఆరోగ్య కేంద్రాలు, సంచార రక్త సేకరణ వాహనాల కోసం 'ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్‌ రెడ్ క్రెసెంట్ సొసైటీస్' (ఐఎఫ్‌ఆర్‌సీ) కేటాయించింది. ఆరోగ్యం, విపత్తు ప్రతిస్పందన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ శాఖలకు ఈ 33 అంబులెన్స్‌లను అందించారు. ఆయా శాఖలకు పంపుతున్న మొత్తం వైద్య వాహనాల్లో ఇవి ఒక భాగం.

కొవిడ్‌-19పై చేస్తున్న పోరాటంలో ఐఆర్‌సీఎస్‌ ముఖ్య పాత్ర పోషించింది, మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడంలో ఘనంగా దోహదపడింది. దేశవ్యాప్తంగా రక్త లభ్యతను పెంచడానికి ఈ సంస్థ అనేక శిబిరాలు నిర్వహించింది ఈ సంస్థ చేపట్టిన విస్తృత శ్రేణి కార్యకలాపాలు ఐఆర్‌సీఎస్‌ సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచాయి. 

****



(Release ID: 1813091) Visitor Counter : 141