ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పరమ పూజనీయుడు డాక్టర్ శ్రీ‌ శ్రీ ‌శ్రీ శివ‌కుమార స్వామిగళు కు ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి సమర్పించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 01 APR 2022 11:38AM by PIB Hyderabad

 పూజనీయుడు, గౌరవాన్వితుడు అయిన డాక్టర్ శ్రీ‌ శ్రీ ‌శ్రీ శివ‌కుమార స్వామిగళు కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సమర్పించారు.

 

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -

 ‘‘పూజనీయుడు, గౌరవాన్వితుడు అయిన డాక్టర్ శ్రీ‌ శ్రీ ‌శ్రీ శివ‌కుమార స్వామిగళు కు ఆయన జయంతి నాడు నేను శ్రద్ధాంజలి ని సమర్పిస్తున్నాను.  వారు అసంఖ్యాక జనుల హృదయాల లో కొలువై ఉన్నారు.  మనం ఆయన అందించిన సాటి లేనటువంటి సాముదాయిక సేవ తో పాటు, విద్య కు మరియు ఆరోగ్య సంరక్షణ కు ఆయన కట్టబెట్టిన ప్రాధాన్యాన్ని కూడా సదా స్మరించుకొందాం.  మనం ఆయన కన్న కలల ను పూర్తి చేయడం కోసం నిరంతరం కృషి చేద్దాం.’’ అని పేర్కొన్నారు.

 


(రిలీజ్ ఐడి: 1812559) సందర్శకుల సూచీ సంఖ్య : : 196