ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్యామ్ జీ కృష్ణ వర్మ గారి వర్ధంతి సందర్భం లో  ఆయన నుస్మరించుకున్న ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 30 MAR 2022 9:48AM by PIB Hyderabad

శ్రీ శ్యామ్ జీ కృష్ణ వర్మ కు ఆయన వర్థంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

మన స్వాతంత్య్ర పోరాటాని కి శ్యామ్ జీ కృష్ణ వర్మ గారు అందించిన మరపురానటువంటి తోడ్పాటు ను చూసుకొని భారతదేశం లో ప్రతి ఒక్కరు గర్వపడుతున్నారు అని ప్రధాన మంత్రి అన్నారు. 2003వ సంవత్సరం లో జెనేవా నుంచి ఆ మహనీయ స్వాతంత్య్ర యోధుని చితాభస్మాన్ని తిరిగి భారతదేశాని కి రప్పించడాన్ని గురించి కూడా ఆయన గుర్తు కు తెచ్చుకొన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘సాహసి అయిన శ్యామ్ జీ కృష్ణ వర్మ గారి ని ఆయన వర్ధంతి సందర్బం లో స్మరించుకొంటున్నాను. మన స్వాతంత్య్ర సమరాని కి ఆయన అందించిన మరపురానటువంటి తోడ్పాటు ను చూసి భారతదేశం లో ప్రతి ఒక్క వ్యక్తి గర్విస్తున్నారు. 2003వ సంవత్సరం లో ఆయన చితాభస్మాన్ని జెనేవా నుంచి వాపసు రప్పించ గలగడం నా జీవనం లో అన్నింటి కంటే విశేషమైన క్షణాల లో ఒకటి గా ప్రకాశిస్తూ ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.

***

DS/ST

 

 


(రిలీజ్ ఐడి: 1811340) సందర్శకుల సూచీ సంఖ్య : : 193