ఆయుష్

ప్రధాన మంత్రి యోగ పురస్కారాలు-2022కి నామినేషన్లను ఆహ్వానించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ


విజేతలను అంతర్జాతీయ యోగ దినోత్సవం 2022 జూన్ 21న ప్రకటిస్తారు

Posted On: 30 MAR 2022 10:49AM by PIB Hyderabad

ప్రధానమంత్రి యోగ దినోత్సవం-2022 పురస్కారాల కోసం కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నామినేషన్లలను ఆహ్వానించింది. ఈ ఏడాది జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగ దినోత్సవం నాడు విజేతల పేర్లను ప్రకటిస్తారు. 

2022 సంవత్సరానికి సంబంధించిన అవార్డు దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం మైగొవ్ ప్లాట్‌ఫారమ్‌ (https://innovateindia.mygov.in/pm-yoga-awards-2022/) లో అందుబాటులో ఉంది. దరఖాస్తులు/నామినేషన్‌లు ఆన్‌లైన్  ద్వారా మాత్రమే స్వీకరిస్తారు, హార్డ్‌కాపీని పంపకూడదు. ఇది భారతీయ మూలం ఉన్న వారి కోసం రెండు క్యాటగిరీలు, అంతర్జాతీయంగా రెండు క్యాటగిరీ లు ఉంటాయి. ఈ అవార్డుల కోసం దరఖాస్తుదారులు/నామినీలు యోగాకు విశేషమైన కృషి చేసి ఉండాలి మరియు యోగాపై లోతైన అవగాహన కలిగి ఉండాలి.

ఆసక్తి ఉన్న వ్యక్తులు మరియు సంస్థలు నామినేషన్ల ప్రక్రియ గురించి తెలుసుకోడానికి, పాల్గొనడానికి https://innovateindia.mygov.in/pm-yoga-awards-2022/ సైట్ లో  PMYA పేజీని యాక్సెస్ చేయవచ్చు. ఈ సంవత్సరం నామినేషన్ ప్రక్రియ 28 మార్చి, 2022న ప్రారంభమైంది. ఎంట్రీల స్వీకరణకు చివరి తేదీ 27 ఏప్రిల్ 2022.
 

దరఖాస్తుదారు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా ఈ అవార్డు ప్రక్రియ కింద పరిశీలన కోసం యోగా రంగంలో పనిచేస్తున్న ప్రముఖ వ్యక్తి లేదా సంస్థ ద్వారా వారిని నామినేట్ చేయవచ్చు. ఒక దరఖాస్తుదారుడు ఒక నిర్దిష్ట సంవత్సరంలో ఒక అవార్డు కేటగిరీకి, అంటే జాతీయ అవార్డు లేదా అంతర్జాతీయ అవార్డుకు మాత్రమే నామినేట్ చేయవచ్చు. 

ఎంపిక ప్రక్రియ పటిష్టంగా ఉంటుంది. దీని కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం, వాటి స్క్రీనింగ్ కమిటీ మరియు ఎవాల్యుయేషన్ కమిటీ (జ్యూరీ) ద్వారా ఎంపిక మరియు మూల్యాంకనాన్ని నిర్ణయించే రెండు కమిటీలు ఏర్పాటు చేశారు. మూల్యాంకన కమిటీ (జ్యూరీ) కేబినెట్ కార్యదర్శి అధ్యక్షతన ఉంటుంది.

మానవాళి యొక్క శారీరక మరియు మానసిక శ్రేయస్సు  యోగాయే మార్గమనే సందేశం ప్రస్తుత కోవిడ్-19 సమయంలోసందర్భోచితమైనది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది  ఆరోగ్యంగా ఉండటానికి యోగాను స్వీకరించారు. ఐక్యరాజ్యసమితి 2014 సంవత్సరంలో 69/131 తీర్మానం ద్వారా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన తర్వాత యోగాకు అంతర్జాతీయ గుర్తింపు మరింత విస్తృతంగా వచ్చింది. 

ఈ సంవత్సరం, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 ప్రచారం మార్చి 13న  ప్రారంభమైంది. జూన్ 21, 2022 వరకు 100 సంస్థలతో కూడిన 100 నగరాలపై 100 రోజుల కౌంట్‌డౌన్ కేంద్రీకృతమై ఉంది. ఆజాది కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకోవడానికి, 75వ తేదీన యోగా ప్రదర్శన కూడా ఉంటుంది. 21 జూన్ 2022న వారసత్వ సాంస్కృతిక కేంద్రాలలో యోగా ప్రదర్శనలు, వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు నిర్వహిస్తారు. డబ్ల్యూ.హెచ్.ఓ కి సంబంధించిన mYoga App, Namastey యాప్, Y-బ్రేక్ అప్లికేషన్ మరియు వివిధ వ్యక్తుల-కేంద్రీకృత కార్యక్రమాలను ఉపయోగించి మంత్రిత్వ శాఖ యోగా ప్రయోజనాలను ప్రచారం చేస్తుంది. ఫోటో పోటీ, క్విజ్, చర్చ, ప్రతిజ్ఞ, పోల్ సర్వే, జింగిల్ మొదలైన వాటితో సహా మైగొవ్  ప్లాట్‌ఫారమ్‌లో కార్యక్రమాలు జరుగుతాయి. .

 

 

****



(Release ID: 1811327) Visitor Counter : 155