ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

14,704 కి తగ్గిన దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య; 707 తర్వాత 15,000 కంటే తక్కువ


గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 1,259

183.82 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం

12-14 ఏళ్ల వారికి 1.50 కోట్లకు పైగా టీకా డోసులు నిర్వహణ

Posted On: 30 MAR 2022 9:57AM by PIB Hyderabad

రోజురోజుకూ తగ్గుతూ వస్తున్న దేశవ్యాప్త కేసుల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. 707 తర్వాత దేశవ్యాప్త క్రియాశీల కేసులు 15,000 కంటే తగ్గి, 14,704 కు దిగివచ్చాయి. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో క్రియాశీల కేసులు 0.03 శాతం. రెండేళ్ల క్రితం, 2020 ఏప్రిల్ 21వ తేదీన 14,759 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 1,233 కొత్త కేసులు నమోదయ్యయాయి. 

భారతదేశ రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 1,876 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,24,87,410 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో మొత్తం 6,24,022 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 78.85 కోట్లకు పైగా ( 78,85,56,935 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు, రోజువారీ పాజిటివ్‌ రేట్లలో తగ్గుదల కొనసాగుతోంది. వారపు పాజిటివిటీ రేటు 0.25 శాతం వద్ద, రోజువారీ పాజిటివిటీ రేటు 0.20 శాతం వద్ద ఉంది.

 

 

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 183.82 కోట్ల ( 1,83,82,41,743 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,19,19,610 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 1.50 కోట్లకు పైగా ( 1,50,55,291 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10403582

రెండో డోసు

9998306

ముందు జాగ్రత్త డోసు

4445103

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18413039

రెండో డోసు

17506270

ముందు జాగ్రత్త డోసు

6838374

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

15055291

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

57027194

రెండో డోసు

37729295

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

554469705

రెండో డోసు

464931719

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202722920

రెండో డోసు

185097617

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126719220

రెండో డోసు

115296186

ముందు జాగ్రత్త డోసు

11587922

ముందు జాగ్రత్త డోసులు

2,28,71,399

 మొత్తం డోసులు

1,83,82,41,743

 

****



(Release ID: 1811326) Visitor Counter : 159