మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఒత్తిడి లేని పరీక్షల నిర్వహణకు పరీక్ష పె చర్చ ఒక ప్రజా ఉద్యమంగా సాగాలి .... శ్రీ ధర్మేంద్ర ప్రధాన్


2022 ఏప్రిల్ 1న ప్రధానమంత్రి పరీక్ష పె చర్చ అయిదో విడత చర్చా కార్యక్రమం

కార్యక్రమంలో వర్చువల్ విధానంలో పాల్గోనున్న దేశ విదేశాలకు చెందిన కోట్లాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు

సృజనాత్మక రచనల పోటీ లో పాల్గోడానికి నమోదు చేసుకున్న దాదాపు 15.7 లక్షల మంది

Posted On: 28 MAR 2022 8:03PM by PIB Hyderabad

2022 ఏప్రిల్ 1వ తేదీన జరిగే 5వ పరీక్షా పే చర్చా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివిధ అంశాలపై చర్చిస్తారని కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు తెలిపారు. పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ఏడాదిలో ఒకేసారి నిర్వహిస్తున్నామని, దీనికోసం అనేకమంది ఎదురుచూస్తున్నారని మంత్రి అన్నారు. లైవ్ ప్రోగ్రామ్‌లో విద్యార్థులు అడిగే పరీక్షల ఒత్తిడి మరియు సంబంధిత రంగాలకు సంబంధించిన ప్రశ్నలకు ప్రధాని తన ప్రత్యేక ఆకర్షణీయమైన శైలిలో ఈ కార్యక్రమంలో ప్రతిస్పందిస్తారని  ఆయన తెలిపారు.

పరీక్ష పె చర్చ కార్యక్రమం ఓకే ప్రజా ఉద్యమంగా సాగుతుందని శ్రీ ప్రధాన్ తెలిపారు. కోవిడ్-19 రూపంలో ఎదురైన సమస్యల నుంచి బయటపడి సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో పరీక్ష పె చర్చ కార్యక్రమానికి ప్రాధాన్యత ఏర్పడిందని అన్నారు. కోవిడ్ ముగియడంతో పరీక్షల నిర్వహణ విధానం మారిందని అన్నారు. పరీక్షలు గతంలో మాదిరిగా ఆఫ్ లైన్ విధానంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు.  21వ శతాబ్దపు విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో పరీక్ష పె చర్చ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి వివరించారు. విద్యార్థులతో దేశ ప్రధానమంత్రి నేరుగా మాట్లాడడం కార్యక్రమం ప్రత్యేకత అని మంత్రి అన్నారు. రాష్ట్ర గవర్నర్ల సమక్షంలో జరిగే  కార్యక్రమంలో  దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన విద్యార్థులు పాల్గొంటారని, వారు   రాజ్‌భవన్‌లను సందర్శిస్తారని ఆయన తెలియజేశారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటాయన్న ఆశాభావాన్ని  ఆయన వ్యక్తం చేశారు. పరీక్ష పె చర్చ  భారతదేశం అంతటా మాత్రమే కాకుండా ఇతర దేశాలలో కూడా ప్రసారం అవుతుందని అన్నారు.  ప్రవాస భారతీయులకు కార్యక్రమం చేరువ అవుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని సామూహిక ఉద్యమంగా మార్చేందుకు, విద్యార్థులకు ఒత్తిడి లేని పరీక్షలు నిర్వహించేందుకు మీడియా సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

ఒత్తిడి లేని వాతావరణాన్ని యువతకు అందించాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో పరీక్ష పె చర్చ ప్రజా ఉద్యమంగా సాగుతుందని శ్రీ ప్రధాన్ అన్నారు. దీనిలో పాల్గొంటున్న వారిని ఆయన ‘ఎగ్జామ్ వారియర్స్’ గా అభివర్ణించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజాన్ని ఒక తాటి పైకి తేవాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి కార్యక్రమానికి రూపకల్పన చేసారని ఆయన వివరించారు. దీనిలో భాగంగా ప్రతి విద్యార్థి ప్రతిభను గుర్తించి వెలికి తీసి ప్రోత్సహించడం జరుగుతుందని మంత్రి అన్నారు. ప్రతి విద్యార్థి తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా తెలియజేయడానికి వీలు కలుగుతుందని అన్నారు. 

5వ విడత పరీక్ష పె చర్చ కార్యక్రమం  న్యూ ఢిల్లీలో ఉదయం 11 గంటలకు తల్కతోరా స్టేడియం నుండి టౌన్ హాల్ ఇంటరాక్టివ్ ఫార్మాట్‌లో జరుగుతుందని మంత్రి తెలియజేశారు. భారతదేశం మరియు విదేశాల నుంచి కోట్లాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొంటారని ఆయన తెలిపారు. 

ప్రధాన మంత్రికి ప్రశ్నలు అడిగే విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులను ఎంపిక చేశామని మంత్రి తెలిపారు. వివిధ అంశాలపై ఆన్‌లైన్ లో నిర్వహించిన సృజనాత్మక రచనల పోటీ ఆధారంగా ఎంపిక జరిగిందని  శ్రీ ప్రధాన్ తెలియజేశారు. ఈ పోటీ 28 డిసెంబర్ 2021 నుంచి  3 ఫిబ్రవరి, 2022 వరకు MyGov ప్లాట్‌ఫారమ్ ద్వారా నిర్వహించబడింది. సృజనాత్మక రచనల పోటీలో  ఈ ఏడాది 15.7 లక్షల మంది పాల్గొనడంపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

MyGovలో పోటీ విజయం సాధించి కార్యక్రమంలో    పాల్గొనేవారికి ప్రశంసా పత్రం మరియు ప్రధానమంత్రి రాసిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకం తో కూడిన ప్రత్యేక పరీక్షా పే చర్చా కిట్‌ను అందజేస్తారు.

పాఠశాల విద్య , అక్షరాస్యత విభాగం, విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా ఈ కార్యక్రమం గత నాలుగు సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహించబడుతోంది. పరీక్ష పె చర్చ   మొదటి మూడు కార్యక్రమాలు   న్యూ ఢిల్లీలో టౌన్-హాల్ ఇంటరాక్టివ్ ఫార్మాట్‌లో జరిగాయి. ప్రైమ్ మినిస్టర్స్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ "పరీక్ష పే చర్చ 1.0"  1వ ఎడిషన్ 16 ఫిబ్రవరి 2018న జరిగింది. పాఠశాల మరియు కళాశాల విద్యార్థులతో ఇంటరాక్షన్ కార్యక్రమంగా  2వ ఎడిషన్ "పరీక్ష పే చర్చ 2.0"  2019 జనవరి 29న  మరియు 3వ ఎడిషన్ 20 జనవరి 2020 న జరిగాయి. . కోవిడ్ 19 మహమ్మారి కారణంగా నాల్గవ ఎడిషన్ ఆన్‌లైన్‌లో 7 ఏప్రిల్ 2021న నిర్వహించబడింది.

కార్యక్రమం  దూరదర్శన్ (డీడీ  నేషనల్,  డీడీ   న్యూస్,  డీడీ   ఇండియా), రేడియో ఛానెల్‌లు, టీవీ ఛానెల్‌లు, విద్యా మంత్రిత్వ శాఖ యూట్యూబ్ ఛానెల్‌లు, narendramodi, pmoindia, pibindia, దూరదర్శన్ నేషనల్, MyGovIndia,  డీడీ  న్యూస్  , రాజ్యసభ టీవీ, స్వయంప్రభ సహా డిజిటల్ మీడియా లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. 

 

***



(Release ID: 1810857) Visitor Counter : 162